Trump Deadline Hamas| అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్లకు భారీ వార్నింగ్ ఇచ్చారు. జనవరి 20, 2025న తాను అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే లోపు బందీలను విడుదల చేయకపోతే నరకం చూపిస్తానని తీవ్రంగా హెచ్చరించారు. జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షునిగా రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మధ్యప్రాచ్య దేశాలలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా 16 నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ మిలిటెంట్లు అక్టబోర్ 7, 2023న ఇజ్రాయెల్ పై దాడి చేసి వంద మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులను కిడ్నిప్ చేశారు. ఆ తరువాత నుంచి పాలస్తీనా భూభాగమైన గాజాలో ఇప్పటివరకు ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టిస్తోంది. దీంతో అంతర్జతీయ రాజకీయాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇప్పటికే హమాస్, ఇజ్రాయెల్ మధ్య సంధి కుదిర్చేందుకు అమెరికా, కతార్ దేశాలు మధ్యవర్తిత్వం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ట్రంప్ ఇంతకుముందులా ఇజ్రాయెల్ పక్షంలో నిలబడ్డారు. తాజాగా ఆయన హమాస్ మిలిటెంట్లకు హెచ్చరిక జారీ చేశారు. “నేను మధ్యవర్తిత్వానికి వ్యతిరేకిని కాను. చర్చలకు విఘతం కలిగించాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ నేను అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టే సమయానికి బందీలు తిరిగి రాకపోతే నరకం చూపిస్తా.. మధ్య ప్రాచ్యంలో నరక ద్వారాలు తెరిచేస్తా.. ” అని మంగళవారం జనవరి 7, 2025 తన ఫోరిడా మర్ ఆ లాగో నివాసం వద్ద మీడియా సమావేశంలో గంభీరంగా చెప్పారు.
Also Read: అమెరికాలో రాష్ట్రంగా కెనెడా.. కొత్త మ్యాప్ విడుదల చేసిన ట్రంప్.. ప్రసక్తే లేదన్న ట్రూడో!
మీడియా సమావేశంలో హమాస్ తో చర్చల ఎంతవరక వచ్చాయి? బందీలు ఎప్పటివరకు విడుదల చేస్తారు? అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో తన ప్రత్యేక దూత అయిన స్టీవెన్ చార్లెస్ వీట్కాఫ్ ఇటీవలే పర్యటన ముగించారని.. బందీలు విడుదల త్వరలోనే జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మీడియా సమావేశంలో స్టీవెన్ వీట్కాఫ్ మాట్లాడుతూ.. “మేము త్వరలోనే బందీలను విడుదల చేయిస్తాం. ఈ మేరకు పాజిటివ్ గా చర్చలు ముందుకు సాగుతున్నాయి. ఎందుకు ఆలస్యమైందని అంశంపై ఈ దశలో నెగిటివ్ గా నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ప్రెసిడెంట్ చెప్పినట్లు వారికి డెడ్ లైన్ విధించాం. దీంతో చర్చలు వేగంగానే సాగుతున్నాయి. కతార్ ప్రభుత్వం పనితీరు చాలా బాగుంది.” అని చెప్పారు.
హమాస్ (Hamas) బందీలలో అమెరికా పౌరులు కూడా ఉండడంతో వారి విడుదల కోసం అమెరికా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఇటీవలే హమాస్ తమ వద్ద బందీగా ఉన్న ఒక టీనేజర్ అమ్మాయి వీడియోని విడుదల చేసింది. ఆమె గత ఫొటోలు కూడా మీడియాలో ప్రచురితమ్యాయి. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. “ఆ టీనేజర్ అమ్మాయితో హమాస్ ఉగ్రవాదులు చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న అమెరికన్లు, ఇజ్రయెల్ పౌరుల బంధువులు చాలా మంది నన్ను సంప్రదించారు. వారి బాధ నేను అర్థం చేసుకోగలను. ప్రస్తుతానికి అయితే హమాస్ ఉగ్రవాదులకు చెప్పేది ఒక్కటే డెడె లైన్ లోపు బందీలను విడుదల చేయాలి లేకపోతే వారి కోసం నరక ద్వారాలు తెరవబడతాయి.” అని ట్రంప్ చెప్పారు.