Tirumala News: తిరుమలలో గురువారం నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. ఈ క్రమంలో మూడు రోజులపాటు ప్రత్యేక సేవలు రద్దు చేయాలని నిర్ణయించింది టీటీడీ. ఇంతకీ సాలకట్ల వసంతోత్సవాల ప్రత్యేక ఏంటి అన్నదానిపై ఓ లుక్కేద్దాం.
మంగళవారం ఆదాయం
వేసవి సెలవులు దగ్గరపడుతుండడంతో తిరుమలలో రద్దీ క్రమంగా పెరుగుతోంది. వర్కింగ్, వీక్ డేస్ అనే తేడా లేకుండా ఉంది. భక్తులు వెళ్లినవాళ్లు వెళ్తుంటే.. దర్శనం కోసం వచ్చినవాళ్లు వస్తున్నారు. మంగళవారం రోజు 65 వేల మంత్రి భక్తులు వచ్చారు. వీరి ద్వారా హుండీకి రూ. 3.93 కోట్ల ఆదాయం వచ్చింది.
బుధవారం టోకెన్లు, రూముల వివరాలు
బుధవారం రోజు విషయాని కొస్తే సర్వదర్శనం కోసం టోకెన్లను శ్రీవారి మెట్టు వద్ద ఉదయం ఆరుగంటలకు టోకెన్లు ఇచ్చారు. మొత్తంగా 2 వేల టోకెన్లు ఇచ్చినట్టు టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఇక వసతి కోసం రూ. 50, రూ. 100 రూములు అందుబాటులో ఉన్నాయి. ఇక రూ.1000, రూ.1518 సంబంధించి రూములు బుక్కయ్యాయి.
తిరుమల భక్తులకు మరో ముఖ్య గమనిక. ఏప్రిల్ నెలలో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు (ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, తిరుప్పవడ) రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. గురువారం నుంచి శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 10 నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జిత సేవలను రద్దు చేసింది.
ALSO READ: ఆగిన నారీ నారీ నడుమ మురారి పెళ్లి, ఏం జరిగింది?
వసంతోత్సవం ప్రత్యేకత
వసంత రుతువులో జరిగే ఉత్సవాలు కావడంతో వసంతోత్సవం అని పిలుస్తారు. ప్రతీ ఏడాది చైత్ర శుద్ధ పౌర్ణమికి సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అంటే గురువారం స్వామి వారు నాలుగు మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేయనున్నారు. ఊరేగింపు తర్వాత వసంతోత్సవ మండపానికి చేరుకుంటారు. అభిషేక నివేదనలు జరిగిన తర్వాత ఆలయానికి చేరుకుంటారు.
వసంతోత్సవాల్లో రెండో రోజు స్వామివారు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. ఆ తర్వాత మండపంలో వసంతోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో చివరి రోజు శనివారం మలయప్పస్వామితో పాటు సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవం,రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు అరగంటపాటు ఆస్థానం నిర్వహిస్తారు. ఇదిలాఉండగా తిరుమలలో భక్తుల కోసం కొత్తగా నిర్మిస్తున్న యాత్రికుల వసతి సముదాయాన్నిటీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు.
పనుల పురోగతి గురించి ఆరా తీశారు. ఎప్పటిలోగా పూర్తి చేస్తారని అడిగి తెలుసుకున్నారు. అలాగే కొత్త భవనంలో భక్తుల ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. కళ్యాణ కట్ట, డైనింగ్ హాల్, మరుగు దొడ్లు, లాకర్లు వంటి సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచన చేశారు.