Sapthagiri : తెలుగు హాస్య నటుడు సప్తగిరి ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి చిట్టెమ్మ కన్నుమూశారని వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని తెలుస్తుంది. ఆమె నిన్న బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయినట్లు సప్తగిరి వెల్లడించారు. నేడు ఆమె భౌతికయాన్ని తిరుపతిలో ఆమె స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారని సమాచారం. సప్తగిరి ఇవాళ అమ్మ భౌతికయాన్ని చూడటానికి సినీ ప్రముఖులు భారీగా తిరుపతికి చేరుకొని ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.. సప్తగిరికి సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతూ మనోధైర్యాన్ని అందిస్తున్నారు సినీ ప్రముఖులు..
సప్తగిరి ప్రసాద్ సినిమాలు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న కమెడియన్ సప్తగిరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గత కొన్నేళ్లుగా తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన ఎన్నో సినిమాల్లో నటించాడు. కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బొమ్మరిల్లు సినిమా దర్శకుడైన భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన పరుగు సినిమా అతనికి నటుడిగా గుర్తింపునిచ్చింది. ప్రేమకథా చిత్రమ్,వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుని నటుడిగా స్థిరపడిపోయాడు. సప్తగిరి చాలా లోబడ్జెట్ కామెడీ సినిమాల్లో కనిపించాడు. డిసెంబరు 2016 లో వచ్చిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా అంత పెద్దగా సక్సెస్ అవ్వకపోయినా హీరోగా మంచి మార్కులు పడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సప్తగిరి ఆల్రౌండ్ అనిపించాడు. ఎలాంటి పాత్రలోనైనా చేయగలరని నిరూపించాడు. ఇక ఇటీవల వరస సినిమాలలో హీరోగా చేయడంతో పాటు పలు సినిమాల్లో కమెడియన్ గా నటిస్తున్నాడు.
Also Read : నాలుగు నెలల్లో నరకం చూశాను.. పెళ్లి పై కీర్తి క్లారిటీ..
సప్తగిరి ఫ్యామిలీ..
సప్తగిరి ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వ్యక్తి. అతని అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. తర్వాత తన పేరును సప్తగిరి అని మార్చుకున్నాడు. అతని స్వస్థలం చిత్తూరు జిల్లా, పుంగనూరు. తండ్రి అటవీ శాఖలో ఉద్యోగి. ఇంటర్ వరకు చదివాడు. తరువాత ఎంసెట్ లో మంచి ర్యాంకు రాలేదు. ఇంటర్ పరీక్షలయ్యాక ఒక రోజు తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాడు. అక్కడ ఓ సాధువు రూపంలో కనిపించిన వ్యక్తి ఇతన్ని సప్తగిరి అని సంబోధించడంతో అదెందుకో బాగుందనిపించి తరువాత తన పేరును సప్తగిరి అని మార్చుకున్నాడు. ఈయన నటుడు కాక మునుపు సహాయ దర్శకుడిగా పనిచేశాడు.. కొన్ని సినిమాలకు పనిచేసిన తర్వాత నటన పై ఆసక్తితో అటుగా అడుగులు వేసాడు. పరుగు చిత్రంతో నటుడుగా పరిచయం అయ్యాడు. రీసెంట్ గా పెళ్లి కానీ ప్రసాద్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు. హాస్య నటులు హీరోలుగా నటించే చిత్రలపైన ప్రేక్షకులకి కొన్ని అంచనాలుంటాయి. ఫుల్ కామెడీ వుంటుందనే నమ్మకంతో వస్తారు. అనుకున్నట్లుగానే ఈ మూవీలో ఎంటర్టైన్మెంట్ తో పాటుగా సెంటిమెంట్ ని కూడా బాగా పండించాడు సప్తగిరి. ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ మూవీలో నటిస్తున్నాడు..