Illu Illalu Pillalu Today Episode April 9th : నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదా తన నగలను చూపించి ప్రేమను ఎలా ఉంది ప్రేమ అని అడుగుతుంది. ప్రేమ చాలా అందంగా ఉన్నావ్ అక్క చాలా బాగున్నాయి నగలు అని బాధపడుతుంది. నర్మదా నువ్వేం బాధపడకు ప్రేమ మా అమ్మ నన్ను ఎలాగా అర్థం చేసుకుందో మీ అమ్మ నాన్నలు కూడా నిన్ను అలాగే అర్థం చేసుకుంటారని అంటుంది. మా అమ్మ నాన్నలు అర్థం చేసుకోవడానికి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నది కాదు అక్క మా ఇంటి మధ్య 25 ఏళ్ల పగ కూడా ఉంది ఈ రెండు కుటుంబాలు గత 25 ఏళ్ల నుంచి దూరంగానే ఉంటున్నారు అని బాధపడుతుంది. ప్రేమ బాధను సంతోషంగా మార్చేస్తుంది వాళ్ళ అమ్మ. ఇంటికొచ్చి నగలిచ్చి ప్రేమకు సారి పెట్టేస్తుంది. అది చూసిన ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడతారు. భద్ర సేన మాత్రం రేవతిని అవమానించడంతోపాటు కొడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. చందు సేటు దగ్గరికి వెళ్లి డబ్బులు కావాలి అని అడుగుతాడు. ఎంత కావాలి బాబు నీకు ఎంత కావాలన్నా ఇస్తాను అయితే మీ నాన్నగారితో ఒక మాట చెప్పిందో చాలు అనేసి అనగానే చందు షాక్ అవుతాడు. నా పర్సనల్ ఖర్చులకోసం నేను తీసుకుంటున్నానండి కచ్చితంగా నెలరోజులు తిరిగిచ్చేస్తాను మీరు అర్థం చేసుకోవాలి అని బ్రతిమలాడుతాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ మీ నాన్నగారు ఉంటే నమ్మకం ఆయన మాట లేకుండా ఆయన ఏమీ చేయకుండా నేను నీకు డబ్బులు ఇస్తే నువ్వు ఇస్తావని గ్యారెంటీ ఏంటి అని చెందును సేటు అడుగుతాడు.. అప్పుడే రామరాజు సేటుకు పెళ్లి పత్రిక ఇవ్వడానికి అక్కడికి వస్తాడు. అయితే చందు నిజం చెప్పొద్దని అడుగుతాడు.
సేటు బయటకు వెళ్లి రామరాజు తో మాట్లాడుతాడు. ఎప్పుడు లేనిది ఇలా వచ్చారేంటి అంటే మా కొడుకు పెళ్లి కుదిరింది అండి మీరు తప్పకుండా మీ కుటుంబంతో కలిసి పెళ్లికి రావాలని కార్డు ఇచ్చి వెళ్తాడు. ఇక సేటు చందు ని నమ్మి కచ్చితంగా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మీ నాన్న దగ్గరికి వచ్చి నేను అడుగుతాను అని అంటాడు. మొత్తానికైతే చందుకు డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులు తీసుకెళ్లి శ్రీవల్లికి ఇస్తారు. డబ్బులు చూసి శ్రీవల్లి సంతోషంతో చందు ని హగ్ చేసుకుంటుంది.
చూసావా అమ్మడు అల్లుడికి నువ్వంటే ఎంత ఇష్టము ఇది బ్రతికినంత కాలం ఇలానే ఉంచుకోవాలి అల్లుడినీ గుప్పెట్లో పెట్టుకోవాలి. నీకోసం ఏదైనా ఎదిరించేలా ఎవరినైనా బెదిరించేలా కూడా నువ్వు మార్చుకోవాలని భాగ్యం కూతురుకి సలహాలిస్తుంది. ఇక అందరూ కలిసి బట్టలు కొనడానికి షాపింగ్ మాల్ కి వెళ్తారు.. భాగ్యం వాళ్ళు కూడా కార్లో వస్తారు. ఆనంద్ రావు తన కళ్ళకి పెట్టుకున్న కళ్ళజోడు తో కాస్త కామెడీ చేస్తాడు అది కాస్త అందరిని ఆకట్టుకుంటుంది.
ఎస్కలేటర్ మీద ఎక్కడానికి వాళ్లంతా పడ్డ ఇబ్బంది అంతా కాదు ఎపిసోడ్ కి అదే హైలెట్ అవుతుంది.. ఇక దిగేటప్పుడు ఆనందరావు వెళ్లి సాగర్ కాళ్ళ దగ్గర పడతాడు. సాగరు మామతో ఏంటి మామ ఎస్క్లేటర్ ఎక్కడ మీదే మొదటిసారి అని అడుగుతాడు కానీ భాగ్యం మాత్రం ఏదో కవర్ చేసి అలా వదిలేస్తుంది. ఇక భాగ్యం చిన్న కూతురు ఏదో ఒకటి చెప్పి గొప్పగా మ్యానేజ్ చేస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి బట్టలు కొనడానికి వెళ్తారు. భాగ్యం మేము అబ్బాయి వాళ్ళకి కొంటాము మీరు అమ్మాయి వాళ్ళ కొనాలి మీకు తెలుసు కదా వదిన గారు అనేసి అంటుంది.
మాకు అందరికీ బట్టలు పెట్టాల్సిన అవసరం లేదండి మా పెద్దబ్బాయి కి మా ఇద్దరికీ మా కూతురు ఇద్దరికీ పెట్టాల్సి వస్తుంది అని అనగానే మాటల్లే చాలా చల్లని కబురు చెప్పిందనేసి భాగ్యం సంతోషపడుతుంది. ముందుగా మనం బట్టలు కొంటే మన దానికన్నా మించినట్టు వారి చేత బట్టలు కొనిచ్చని భాగ్యం ప్లాన్ వేస్తుంది. కాస్ట్లీ గా మంచి చీరలు చూపించండి అని అంటుంది. ఏ చీర చూపించినా దాని రేట్లు చూసి ఇది బాగాలేదు అది బాగా లేదంటూ వంకలు పెడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో చందు ధీరజ్లు గొడవ పడతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..