BigTV English

Tirumala Update: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 15 కంపార్ట్మెంట్ లలో భక్తులు.. దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

Tirumala Update: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 15 కంపార్ట్మెంట్ లలో భక్తులు.. దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

Tirumala Update: శ్రీనివాస గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా.. గోవిందా హరి గోవిందా.. వేంకటరమణ గోవిందా.. అనే భక్తి కీర్తనం కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ శ్రీనివాసుడి సన్నిధిలో వింటే చాలు భక్తి పారవశ్యంలో పరవశించి పోవాల్సిందే. గోవిందా నామస్మరణ భక్తిశ్రద్దలతో పఠిస్తే చాలు.. ఆ స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది. అటువంటి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. స్వామివారిని దర్శించిన భక్తులు లడ్డూ ప్రసాదాన్ని పవిత్రంగా భావించి.. నిశ్చలమైన భక్తితో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. శ్రీవారి సేవలో భక్తులు తరిస్తే.. భక్తుల సేవలో టీటీడీ నిరంతరం తరిస్తోంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనార్థం ఎన్ని గంటల సమయం పడుతుంది? తాజాగా ఎందరు భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారో తెలుసుకుందాం.


తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాక, ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు వస్తుంటారు. అంతేకాదు విదేశాల నుండి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు రావడం పరిపాటి. అందుకే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ నిరంతరం కృషి చేస్తోంది. స్వామివారి దర్శనంకై ఎందరో భక్తులు సుదూర ప్రాంతాల నుండి పాదయాత్ర ద్వారా తిరుమలకు చేరుకుంటారు. అంతేకాదు అలిపిరి మెట్ల మార్గం, శ్రీవారి మెట్ల మార్గం నుండి కాలినడకన నిర్మలకు చేరుకుంటారు భక్తులు.

కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది టీటీడీ. సెలవు దినాలలో స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తారు భక్తులు. సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో.. ప్రత్యేకమైన రోజుల్లో శ్రీవారి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తుంది టీటీడీ.


స్వామి వారిని దర్శించుకున్న భక్తులు.. తమ కోరికలు తీరిన వెంటనే మొక్కులు తీర్చుకుంటారు. పలువురు కానుకలు సమర్పిస్తే, మరికొందరు తలనీలాలు సమర్పించే తమ భక్తిని చాటుకుంటారు. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న భక్తుల నోట వినిపించే మాట.. గోవిందా నామస్మరణమే. అందుకే తిరువీధులు నిరంతరం గోవింద నామస్మరణతో మారూమ్రోగుతాయి.

ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే శనివారం స్వామి వారిని 75,147 మంది భక్తులు దర్శించుకోగా.. 28096 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.16 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టిటిడి అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనార్థం భక్తులు 15 కంపార్ట్మెంట్ లలో వేచి ఉన్నట్లు టీటీడీ ప్రకటించింది.

Also Read: Black Friday Sale : సేల్‌లో 90% డిస్కౌంట్.. మీరూ నమ్ముతున్నారా? ముంచేస్తారు జాగ్రత్త!

ఇక,
తిరుప‌తి, తిరుమ‌ల‌లోని టీటీడీ ఆసుప‌త్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక సంవ‌త్సర‌ కాలపరిమితితో సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్ పోస్టును భర్తీ చేసేందుకు టీటీడీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. న‌వంబ‌ర్ 25వ తేదీ ఉదయం 11 గంటలకు తిరుప‌తిలోని టీటీడీ సెంట్రల్‌ ఆసుపత్రిలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరగనున్నట్లు టీటీడీ ప్రకటన జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు తగిన సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సిందిగా కోరడమైనది. ఇతర వివరాల కోసం టీటీడీ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

Related News

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

Perni nani Vs Balakrishna: కూటమిపై ‘మెగా’ అస్త్రం.. పుల్లలు పెట్టేందుకు బాలయ్యను వాడేస్తున్నపేర్ని నాని

Ysrcp Assembly: అసెంబ్లీకి రావట్లేదు సరే.. మండలిలో అయినా సంప్రదాయాలు పాటించరా?

AU Student Death: ఏపీ అసెంబ్లీలో AU విద్యార్ధి మణికంఠ మృతిపై చర్చ

Jagan: యూరప్‌ టూర్‌‌కు గ్రీన్‌సిగ్నల్.. వెళ్లాలా-వద్దా అనే డైలామాలో జగన్, కారణం అదేనా?

Chandrababu – Shankaraiah: సీఎంకే నోటీసులు పంపిస్తారా? ఎంత ధైర్యం? శంకరయ్యపై చంద్రబాబు ఆగ్రహం

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Big Stories

×