Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 12 వ వారం పై ఆడియన్స్ కు ఆసక్తి పెరిగింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వారం ఇద్దరు వెళ్తారని వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిసిపోయింది. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే జరిగింది. అయితే, బిగ్ బాస్ 8 తెలుగు 12వ వారం జరిగిన నామినేషన్స్ బీబీ చరిత్రలో మొదటిసారిగా జరిగాయి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో ప్రస్తుతం ఉన్న ఇంటి సభ్యుల ను నామినేట్ చేసే విధానాన్ని బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోనే తొలిసారిగా తీసుకొచ్చారు. దీంతో ఈ నామినేషన్స్‌కు ఫుల్ క్రేజ్ వచ్చింది. ఈ వారం బయటకు యష్మీ బయటకు వచ్చేసింది. మరి ఈమె 12 వారాలకు గాను ఎంత సంపాదించిందో ఇప్పుడు తెలుసుకుందాం..
కన్నడ బ్యాచ్ లో ఒకరు యష్మీ గౌడ.. ఈమె మొదట్లో కనబరిచిన ఆట ఈ వారంలో కనిపించలేదని తెలుస్తుంది. నిఖిల్ తో ప్రేమాయణం కొనసాగిస్తుందని తెలిసిందే.. ఆ విషయాన్ని బయట పెట్టిన తర్వాత ఈమె హౌస్ లో సరిగ్గా ఒక్క గేమ్ కూడా ఆడలేదు. యష్మీ ప్రతివారం నామినేషన్స్ యష్మీ నిలిచేది. ఇక 12 వ వారం నామినేషన్స్‌లో నిఖిల్ మలియక్కల్, ప్రేరణ కంబం, యష్మీ గౌడ, పృథ్వీరాజ్ శెట్టి, నబీల్ అఫ్రీది ఐదుగురు నామినేట్ అయిన విషయం తెలిసిందే. నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కాగానే ఓటింగ్ పోల్స్ ఓపెన్ కాగా రోజు రోజు హెచ్చు తగ్గులతో ఈ వారం బిగ్ బాస్ ఓటింగ్ నడిచింది..
గురువారం వరకు టాప్ లో ఉన్న వారంతా శుక్రవారం, శనివారంకు ఓటింగ్ మారిపోయింది. కన్నడ బ్యాచ్ కు షాక్ ఇచ్చేలా ఓటింగ్ నమోదు అయ్యింది. ఫైనల్‌గా బిగ్ బాస్ తెలుగు 8 పన్నెండో వారం నామినేషన్స్ ఓటింగ్ ఫలితాల్లో చివరి రెండు స్థానాల్లో పృథ్వీరాజ్, యష్మీ గౌడ ఉన్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఈ ఇద్దరిలో ఈ వారం యష్మీ గౌడ ఎలిమినేట్ కాగా పృథ్వీరాజ్ సేఫ్ అయ్యాడు. మొత్తానికి యష్మీ పెట్టే సర్దుకొని బయటకు వచ్చేసింది. ప్రస్తుతం యష్మీ రెమ్యూనరేషన్ భారీగా అందుకుందని తెలుస్తుంది. ఒక్కో వారానికి బిగ్ బాస్ 8 తెలుగులోకి ఫస్ట్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన యష్మీ గౌడ 12 వారాలు హౌజ్‌లో ఉంది. ఈ లెక్కన 12 వారాల్లో యష్మీ గౌడ రూ. 24 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తోంది. అయితే, యష్మీ గౌడ వారానికి రూ. 2,50000 అందుకుందని టాక్ వినిపిస్తుంది. రోజూ వారీగా లెక్కలేస్తే 83 రోజులకు యష్మీ గౌడ రూ. 29, 64, 285 పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక విన్నర్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా నబీల్ అని ఒకవైపు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రోహిణి, పృథ్వీ ఉండొచ్చు అని మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి