BigTV English
Advertisement

Black Friday Sale : సేల్‌లో 90% డిస్కౌంట్.. మీరూ నమ్ముతున్నారా? ముంచేస్తారు జాగ్రత్త!

Black Friday Sale : సేల్‌లో 90% డిస్కౌంట్.. మీరూ నమ్ముతున్నారా? ముంచేస్తారు జాగ్రత్త!

Black Friday Sale : బ్లాక్ ఫ్రైడే సేల్.. ఆన్లైన్ షాపింగ్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ సేల్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరిన్ని ఆఫర్స్ ను కొత్తగా తీసుకొచ్చేసేయ్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు. అయితే 2023తో పోలిస్తే ఈ ఏడాది టాప్ బ్రాండ్ వెబ్ సైట్స్ పేరిట నకిలీ వెబ్ సైట్స్ ఎన్నో వచ్చాయని తాజాగా చెక్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు 89% తప్పుడు వెబ్ సైట్స్ ఉన్నాయని తెలిపింది. ఇక వాటిని గుర్తించకపోతే డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉందని.. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయే అవకాశం సైతం ఉందని.. అందుకే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.


ఈ ఏడాది ఎంతో గ్రాండ్ గా మొదలైన బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది సైతం టక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ఏడాది ఆఫర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మినీషో, మింత్రా, టాటా వెబ్సైట్లో ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి. ఇక ఆఫర్స్ తో పాటు నకీలీ వెబ్ సైట్స్ కూడా ఉన్నాయి.  2022 తో పోలిస్తే 2023లో నకిలీ వెబ్సైట్స్ పెరిగిన దానికంటే ఈ ఏడాది మరింత ఎక్కువగా ఉన్నాయని తాజాగా ఓ పరిశోధన తెలపింది. ఈ ఏడాది 89% నకిలీ వెబ్సైట్స్ ఉన్నాయని.. వాటిని గుర్తించకపోతే డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.

ప్రముఖ రిటైలర్స్, బొటిక్స్ ను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని తెలిపిన చెక్ పాయింట్ రీసెర్చ్.. నకిలీ రోలెక్స్, లూయిస్ విట్టన్, లాంగ్‌చాంప్ వంటి టాప్ బ్రాండ్ కంపెనీలనే టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక వీటిలో తప్పుడు వెబ్సైట్స్ తీసుకువచ్చి 90% వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్టు చూపిస్తున్నాయని.. వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ నివేదిక హెచ్చరించింది.


నకిలీ వెబ్సైట్స్ ను ఎలా గుర్తించాలి అంటే –

ఆన్లైన్ లో షాపింగ్ చేసినప్పుడు అప్రమత్తంగా ఉండాలి

వినియోగదారులు బ్రౌజర్ అడ్రస్ బార్లో HTTPS, ప్యాడ్‌లాక్ సింబల్స్ ను కచ్చితంగా వెతకాలి.

వెబ్సైట్ భద్రతను ధృవీకరించాలి

టాప్ బ్రాండ్ వెబ్సైట్స్ ను సైతం ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి

అనుమానాస్పదంగా అనిపించిన వెబ్సైట్స్ జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది.

వీలైతే కాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇవ్వాలి

డెబిట్ కార్డులకు బదులుగా క్రెడిట్ కార్డులను ఉపయోగించాలని చెప్పే వెబ్సైట్స్ ను కచ్చితంగా అనుమానించాల్సిందే.

అతి తక్కువ ధరకే డీల్స్ ను ఇచ్చే వెబ్ సైట్స్ ను కచ్చితంగా అనుమానించాలి

ఇక సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత డేటాను అపహరించడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా పుట్టిన తేదీ, పర్సనల్ డీటెయిల్స్, మఖ్యమైన కార్డులకు సంబంధించిన పిన్ నెంబర్స్, ఆన్ లైన్ డీటైల్స్ వంటివాటిని తష్కరించే ప్రయత్నం చేస్తారు. అందుకే ఇలాంటి సమాచారం ఇవ్వకుండా ఉండటం మంచిది. ఆన్లైన్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు తో లావాదేవీలు జరిపే కస్టమర్స్ మరింత అప్రమత్తంగా ఉండాలి.

ALSO READ :  ఐఫోన్16 ధర ఎక్కువైతేనేం.. అదే ఫీచర్స్ తో బడ్జెట్ ఫ్రెండ్లీ మెుబైల్స్ ఉన్నాయిగా..!!

Related News

Oppo Reno 13 Pro+: ఫ్లాగ్‌షిప్‌లను ఢీ కొట్టే రెనో 13 ప్రో ప్లస్.. ఆఫర్ ధర వింటే ఆశ్యర్యపోతారు..

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేయండి

Moto G Stylus 5G: స్టైలస్‌తో స్టైలిష్‌గా.. మోటరోలా మోటో జి స్టైలస్ 5జి స్పెషల్‌ ఫీచర్లు ఇవే

Nokia X 5G: మళ్లీ దుమ్మురేపేందుకు సిద్ధమైన నోకియా ఎక్స్ 5జి.. 6000mAh బ్యాటరీతో ఎంట్రీ..

Redmi K80 Pro 5G: అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న రెడ్మీ కె80 ప్రో అల్ట్రా 5జి.. ఇది నిజంగా గేమ్‌ ఛేంజర్‌ ఫోన్‌!

iQOO 13 Review: ఐక్యూ 13 టెక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. ఒక్క ఫోన్‌తో మొత్తం ట్రెండ్ మార్చేసింది

Big Stories

×