BigTV English

Tirumala Update: తిరుపతి తొక్కిసలాట ఘటనలో నలుగురు భక్తులు మృతి.. అసలేం జరిగిందంటే?

Tirumala Update: తిరుపతి తొక్కిసలాట ఘటనలో నలుగురు భక్తులు మృతి.. అసలేం జరిగిందంటే?

Tirumala Update: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో పలుచోట్ల టికెట్ల కేంద్రాలను ఏర్పాటు చేయగా, తొక్కిసలాట జరిగి అపశృతి చోటుచేసుకుంది. తిరుపతిలోని శ్రీనివాసం వద్ద వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. సుమారు 11 పైగా టికెట్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, శ్రీనివాసం వద్దకు బుధవారం సాయంత్రం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఒక్కసారిగా టికెట్ కౌంటర్ వద్దకు భక్తులను అనుమతించడంతో తొక్కిసలాట జరిగినట్లు స్థానికులు తెలుపుతున్నారు.


తొక్కిసలాటలో చాలా వరకు భక్తులు అపస్మారక స్థితికి వెళ్లగా వారిని హుటాహుటిన టీటీడీ సిబ్బంది రుయా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం నలుగురు భక్తులు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. ఘటన జరిగిన వెంటనే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరు గురించి ఆరా తీస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా అన్ని చర్యలు చేపట్టినప్పటికీ అపశృతి చోటు చేసుకోవడంతో టీటీడీ అధికారులు విస్మయానికి గురయ్యారు. అయితే మృతుల సంఖ్య పై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వచ్చిన నలుగురు భక్తులు తోపులాటలో మృతి చెందడంతో సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టోకెన్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చిన సందర్భంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచి వేసిందని సీఎం అన్నారు. ఈ ఘటనలో గాయాలైన వారికి వెంటనే మెరుగైన వైద్య చికిత్స అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. కాగా మరికొంత మంది భక్తులు అనారోగ్యపాలైనట్లు తెలుస్తోంది.


భక్తులు మృతి చెందడం బాధాకరం.. వైఎస్ జగన్

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనంకోసం తిరుపతిలో టోకెన్లు జారీచేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు కోలుకోవాలని ఆకాంక్షించారు.

టీటీడీ పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి.. లోకేష్

వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విడుదల నేపథ్యంలో తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తొక్కిసలాటలో నలుగురు భక్తులు మృతి చెందడం తనను  తీవ్ర మనోవేదనకు గురిచేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇటువంటి అవాంచనీయ ఘటనలకు తావీయకుండా టీటీడీ మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. మృతి చెందిన భక్తుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని లోకేష్ హామీ ఇచ్చారు.

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: మా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×