Tirumala News: తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. ఈనెల 10న వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకొని టీటీడీ సిబ్బంది వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఇస్తోంది. ఈ నెల 10 నుంచి 12 వరకు గాను టోకెన్ల ప్రక్రియ ప్రారంభించింది. అయితే దర్శన టోకెన్ల కోసం పెద్ద ఎత్తున భక్తులు టీటీడీ కేటాయించిన కేంద్రాల వద్దకు పోటెత్తారు. ఈ క్రమంలో తిరుపతి బస్టాండ్ సమీపంలోని విష్ణు నివాసం వద్ద తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మల్లిక అనే మహిళ మృతి చెందింది. మరో ఆరుగురి భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
తోపులాటలో మల్లిక తొలుత తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే అక్కడి టీటీడీ సిబ్బంది స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలిని తమిళనాడుకు చెందిన మల్లికగా పోలీసులు గుర్తించారు. గాయాల పాలైన ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు తిరుపతిలోనే ఏర్పాటు చేసిన బైరాగి పట్టెడలోని రామానాయుడు పాఠశాల వద్ద కూడా తొక్కిసలాట చోటుచేసుకుంది.
Also Read: IITGN Jobs: బీటెక్ పాసైన వారికి శుభవార్త.. ఈ ఉద్యోగం కొడితే నెలకు RS.2,00,000 పైనే..
మరోవైపు టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుందని ఇదివరకే టీటీడీ చెప్పిన విషయం తెలిసిందే. ఈనెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్న విషయం తెలిసిందే. తిరుమలలో మొత్తం మూడు ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగింది. తోపులాట గాయపడిన భక్తులను రుయా ఆస్పత్రికి తరలించారు. దీనిపై మరింత సమాాచారం తెలియాల్సి ఉంది.