BigTV English

Tirumala News: తిరుమల కొత్త రికార్డు.. నాలుగు రోజుల్లో మూడున్నర లక్షలు

Tirumala News: తిరుమల కొత్త రికార్డు.. నాలుగు రోజుల్లో మూడున్నర లక్షలు

Tirumala News: వేసవి సెలవులు చివరిదశకు ముగియడంతో తిరుమలలో రద్దీ విపరీతంగా పెరిగింది. కేవలం నాలుగు రోజుల్లో దాదాపు మూడున్నర లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు భక్తులు. ఒక విధంగా చెప్పాలంటే ఇదొక రికార్డుగా చెబుతున్నారు టీటీడీ అధికారులు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భక్తులు తగ్గుముఖం పట్టినా, కొద్దిరోజులకే పెరగడం విశేషం.


వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు భక్తులు పొటెత్తారు. సోమవారం నాటికి భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. గడిచిన నాలుగు రోజుల్లో రికార్డుస్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ఈ స్థాయిలో భక్తులు రావడం ఓ రికార్డు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు చేసింది.

ద‌ర్శనం కోసం క్యూలైన్లలో ఉన్న భ‌క్తుల‌కు అన్న‌, పానీయాల‌ను ఎప్పటికప్పుడు పంపిణీ చేసింది. అన్నీ విభాగాల స‌మ‌న్వయంతో భ‌క్తుల‌కు వేగంగా ద‌ర్శనం అయ్యేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. విజిలెన్స్, ఆల‌య విభాగాలు సమన్వయంగా సాధార‌ణ రోజుల్లో కంటే 10వేల మంది వ‌ర‌కు భ‌క్తుల‌కు అద‌నంగా ద‌ర్శనం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని టీటీడీ వెల్లడించింది.


గడిచిన నాలుగు రోజుల్లో దాదాపు 3 లక్షల 28 వేల మంది భ‌క్తులు స్వామివారిని ద‌ర్శించుకున్నారు. సరాసరి రోజుకు 85 వేల మందిపైగానే స్వామి వద్దకు వచ్చారు. గురువారం మొదలు ఆదివారం వరకు ఈ రద్దీ నెలకొంది. దాదాపు 11 లక్షల మంది భ‌క్తుల‌కు అన్న ప్రసాదాలు అందించారు.

ALSO READ: అన్నదాత సుఖీభవకు ఈ కార్టు లేకుంటే రూ.20 వేలు కట్

నాలుగున్నర లక్షలకు పైగానే భ‌క్తుల‌కు పానీయాలు అంటే టీ, కాఫీ, పాలు, మ‌జ్జిగ వంటివి అందజేశారు. లక్షన్నర మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. ఇక టీటీడీ వైద్య విభాగం ద్వారా 12 వేల మంది భ‌క్తులు వైద్య సేవ‌లు పొందారు. ఇదికాకుండా శ్రీవాణి దర్శనాలు ప్రత్యేకం.

భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ సమయంలో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ అమాంతంగా తగ్గింది.  అప్పుడు గంటలో భక్తులు దర్శనాలు చేసుకునేవారు. ఆ వ్యవహారం కాస్త సద్దుమణిగిన తర్వాత యథావిధిగా తిరుమలకు భక్తులు పోటెత్తారు.

తిరుమ‌లలో జూన్ నెల‌లో జ‌ర‌గ‌నున్న విశేష ప‌ర్వ దినాలు ఉన్నాయి. ⁠జూన్ ఐదున వ‌ర‌ద‌రాజ‌స్వామి వర్ష తిరు న‌క్ష‌త్రం కార్యక్రమం జరగనుంది. 9న శ్రీ‌వారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం కానుంది. అలాగే న‌మ్మాళ్వార్ శాత్తు మొర‌.⁠ ⁠జూన్ 11న శ్రీ‌వారి జ్యేష్ఠాభిషేకం స‌మాప్తం కానుంది. ⁠జూన్ 21 స్మార్త ఏకాద‌శి కాగా, మరుసటి రోజు వైష్ణ‌వ మాధ్వ ఏకాద‌శి. ⁠జూన్ 26న పెరియాళ్వార్ ఉత్స‌వం ప్రారంభంకానుందని ఒక ప్రకటనలో తెలిపింది టీటీడీ.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×