BigTV English

Annadata Sukhibhava Scheme: అన్నదాత సుఖీభవకు ఈ కార్డు లేకపోతే.. రూ. 20 వేలు కట్!

Annadata Sukhibhava Scheme: అన్నదాత సుఖీభవకు ఈ కార్డు లేకపోతే.. రూ. 20 వేలు కట్!

Annadata Sukhibhava Scheme: ఏపీలో అమలుకానున్న అన్నదాత సుఖీభవ స్కీమ్ పొందాలంటే ఈ కార్డు ఉండాల్సిందే. లేకుంటే వారికి నగదు జమ ఇక అంతే. ఈసారి ప్రభుత్వం ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చింది. మరెందుకు ఆలస్యం.. ఆ కార్డు ఏమిటి? ఎలా పొందాలి తెలుసుకుందాం.


జూన్ 12, 2025 నుంచి అమలులోకి రానున్న అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. చిన్న, సన్నకారు రైతులందరికి దీని ద్వారా నేరుగా నగదు రూపంలో ఆర్థిక సాయం అందించనుంది. అయితే, ఈసారి కౌలు రైతులకు సంబంధించిన కీలకమైన అంశాన్ని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది – CCRS కార్డు (Crop Cultivator Rights Card) తప్పనిసరి.

కేంద్రము అందించే PM-Kisan పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి ₹6,000 అందుతుంది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 ప్రకటించింది. కలిపి రూ.20,000 నగదు సాయం మూడు విడతల్లో రైతులకు అందించనుంది. అయితే ఈ మొత్తం అందుకోవాలంటే, ముఖ్యంగా కౌలు రైతులకు CCRS కార్డు తప్పనిసరిగా ఉండాలి. లేకుంటే ‘అన్నదాత సుఖీభవ.. కట్’ అవుతుంది.


CCRS కార్డు అంటే ఏమిటి?
Crop Cultivator Rights Card (CCRS) అనేది కౌలుకు భూమి తీసుకొని సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం జారీ చేసే ధృవీకరణ పత్రం. ఈ కార్డు లేని రైతులు అధికారికంగా ‘కౌలు రైతులు’గా గుర్తింపు పొందలేరు. ఇదే గుర్తింపు అన్నదాత సుఖీభవ, ఇన్‌పుట్ సబ్సిడీలు, రుణ మాఫీలు, ఫెర్టిలైజర్ సబ్సిడీలు లాంటి పథకాలకు ప్రవేశద్వారంగా నిలుస్తుంది.

CCRS లేకపోతే ఎలాంటి ఇబ్బందులు?
అన్నదాత సుఖీభవతో పాటు ఇతర ప్రభుత్వ పథకాల నుంచి కూడా బయటపడే ప్రమాదం ఉంది. మీరు సాగు చేస్తున్నా, ప్రభుత్వ రికార్డుల్లో ‘రైతు’గా గుర్తింపు ఉండదు. పంట రుణాలు, గింజల కొనుగోలు కేంద్రాల వద్ద సాయం పొందే అవకాశం తగ్గుతుంది. రైతు భరోసా, ప్రీమియం రాయితీలు వంటి ప్రయోజనాల దరిదాపుల్లోకి కూడా రారు.

Also Read: Visakha City: విశాఖకు ఫుల్ జోష్.. సూపర్ ప్రాజెక్ట్ వస్తోంది.. నగరంలో ఇక సందడే సందడి!

CCRS కార్డు ఎలా పొందాలి?
భూమి యజమానితో కౌలు ఒప్పందం (Written Lease Agreement) చేసుకోవాలి. సంబంధిత గ్రామ వ్యవసాయ అధికారిని సంప్రదించి దరఖాస్తు ఇవ్వాలి. e-Crop పుస్తకంలో పేరు నమోదు చేయించాలి. ఆధార్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, కౌలు ఒప్పంద పత్రం అప్లోడ్ చేయాలి. ప్రభుత్వం పరిశీలించిన తర్వాత CCRS కార్డు జారీ చేస్తుంది.

ప్రభుత్వం మెసేజ్ క్లియర్
ఈసారి ప్రభుత్వం సంకేతం స్పష్టంగా ఇచ్చింది. పేద రైతులకు మద్దతు ఉంది, కానీ చట్టపరంగా గుర్తింపు ఉన్నవారికే మద్దతు. అంటే, వ్యవసాయాన్ని కౌలుకు తీసుకొని చేస్తే సరిపోదు. CCRS లేని కౌలు రైతులు ప్రభుత్వ అనుబంధ పథకాల నుంచి వదిలేయబడే ప్రమాదం ఉంది. ఇప్పటిదాకా CCRS కార్డు పొందని రైతులు, తక్షణమే దరఖాస్తు చేయాలి.
తమ పంటలు e-Crop లో నమోదు చేయించాలి. ఆధార్, బ్యాంక్ ఖాతా లింకింగ్ తప్పనిసరిగా చేసుకోవాలి. గ్రామ వ్యవసాయాధికారిని సంప్రదించి పూర్తి సమాచారం తీసుకోవాలి.

అన్నదాత సుఖీభవ పథకం కేవలం నగదు సాయం మాత్రమే కాదు.. అది రైతులకు ఇచ్చే గౌరవం, గుర్తింపు. కానీ, ఈ గౌరవం పొందాలంటే CCRS అనే నిబంధన గట్టిగా అమలవుతోంది. కనుక, రైతన్నలు జాగ్రత్తగా ఉండాలి.. CCRS కార్డు లేనిదే.. అన్నదాత సుఖీభవ – కట్!

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×