OTT Movie : కొన్ని సై-ఫై థ్రిల్లర్ సినిమాలు చూడటానికి చాలా భయంకరంగా ఉంటాయి. ఈ సినిమాలలో పెద్ద ఆకారంలో ఉండే జంతువులు చేసే హింస గూస్ బంప్స్ తెప్పిస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక రాక్షస సాలీడు రక్తం రుచి మరిగి మనుషుల్ని చంపుతుంది. ఆ తరువాత స్టోరీ ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
న్యూయార్క్ నగరంలో ఒక చల్లని రాత్రి సమయంలో, ఉన్నట్టుండి ఒక గుడ్డు ఆకాశం నుండి ఒక పాత అపార్ట్‌మెంట్ భవనంలోని కిటికీ లో నుంచి పడుతుంది. దాని నుండి ఒక చిన్న సాలీడు బయటకు వస్తుంది. ఈ సాలీడును అక్కడే ఉన్న 12 ఏళ్ల బాలిక చార్లెట్ కనిపెడుతుంది. ఆమె కామిక్ బుక్స్‌పై ఇంట్రెస్ట్ కలిగి ఉంటుంది. చార్లెట్ తన సవతి తండ్రి ఈథన్ తో కలిసి ‘ఫాంగ్ గర్ల్’ అనే కామిక్ బుక్‌పై పని చేస్తుంటుంది. కానీ ఆమె ఆ ఇంట్లో ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె ఈ సాలీడును రహస్యంగా పెంచడం ప్రారంభిస్తుంది. దానికి ‘స్టింగ్’ అని పేరు కూడా పెడుతుంది. చార్లెట్ స్టింగ్‌కు బొద్దింకలు తినిపిస్తూ దానిని సంరక్షిస్తుంది. కానీ స్టింగ్ అసాధారణ వేగంతో పెరగడం ప్రారంభిస్తుంది.
దానికి రక్తం పట్ల ఆకలి అమాంతం పెరుగుతుంది. త్వరలోనే ఇరుగుపొరుగు పెంపుడు జంతువులు దీని వల్ల మాయం అవుతుంటాయి. ఆ తర్వాత అపార్ట్‌మెంట్‌లోని మనుషులను కూడా చంపి తింటుంది. ఈ విషయం తెలుసుకున్న చార్లెట్ తన కుటుంబాన్ని, ఇతరులను రక్షించడానికి స్టింగ్ బలహీనతను కనిపెట్టి దానిని ఆపడానికి పోరాడాల్సి వస్తుంది. చివరికి చార్లెట్ ఈ సాలీడుని ఎలా ఎదుర్కుంటుంది ? దీని బారిన ఎంతమంది పడతారు ? ఇంతకీ అది ఎక్కడినుంచి వచ్చింది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : కూతుర్ని వెంటాడే తల్లి ఆత్మ … సచ్చినా సాధించడం అంటే ఇదే … చూసినోళ్ళకి చుక్కలే
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సై-ఫై థ్రిల్లర్ మూవీ పేరు ‘స్టింగ్’ (Sting). 2024 లో వచ్చిన ఈ మూవీకి కియా రోచె-టర్నర్ దర్శకత్వం వహించారు. ఇందులో ర్యాన్ కార్, అలైలా బ్రౌన్, పెనెలోప్ మిచెల్, రాబిన్ నెవిన్, నోని హాజెల్‌హర్స్ట్, సిల్వియా కొలోకా వంటి నటులు నటించారు. ఈ మూవీ స్టోరీ 12 ఏళ్ల బాలిక చుట్టూ తిరుగుతుంది. ఆమె రహస్యంగా ఒక అసాధారణమైన సాలీడిని పెంచుతుంది.ఆ తరువాత ఊహించని సంఘటనలు ఎదురౌతాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.