E-Paper
Advertisement

Vaikunta dwara darshan Tirumala: 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు.. టీటీడీ కీలక నిర్ణయం.. టోకెన్లు ఎప్పుడంటే?

Vaikunta dwara darshan Tirumala: 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు.. టీటీడీ కీలక నిర్ణయం.. టోకెన్లు ఎప్పుడంటే?
Advertisement

Vaikunta dwara darshan Tirumala: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. మొత్తం 182 గంటల పాటు దర్శనాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఇందులో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామన్నారు. దీంతో సామాన్య భక్తులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

టోకెన్ల జారీ ఎప్పుడంటే?

తితిదే పాలక మండలి సమావేశం అనంతరం ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనాలలో మొదటి మూడు రోజులు(డిసెంబర్ 30, 31, జనవరి 1) రూ.300, శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు 15 వేల రూ.300 దర్శన టిక్కెట్లు, 1000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్‌ పద్ధతిలో కేటాయించినట్లు పేర్కొన్నారు.

నవంబర్ 27 నుంచి రిజిస్ట్రేషన్

Advertisement

డిసెంబర్‌ 30, 31, జనవరి 1వ తేదీ డిప్‌ ద్వారా దర్శనాలకు అనుమతిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ టిక్కెట్లకు సంబంధించిన నవంబర్‌ 27 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ అవకాశం కల్పిస్తామని చెప్పారు. డిసెంబర్‌ 2న లాటరీ విధానంలో ఎంపికైన వారికి టోకెన్లు జారీ చేస్తామన్నారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో స్థానికుల కోసం ప్రత్యేక కేటాయింపులు చేస్తామన్నారు. జనవరి 6, 7, 8వ తేదీల్లో రోజుకు 5 వేల టోకెన్లు కేటాయించనున్నట్లు టీటీడీ తెలిపింది. వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో ఏడు రోజుల పాటు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.

Also Read: Sachivalaya Employees: సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. స్పౌజ్ కేటగిరి బదిలీలకు అనుమతి.. మార్గదర్శకాలు జారీ

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×