BigTV English

Health benefits: అగరబత్తి‌కి విక్స్ రాసి వెలిగిస్తే దగ్గు, జలుబు వెంటనే తగ్గుతుందా? నిజమేమిటి?

Health benefits: అగరబత్తి‌కి విక్స్ రాసి వెలిగిస్తే దగ్గు, జలుబు వెంటనే తగ్గుతుందా? నిజమేమిటి?

Health benefits: మన ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు తరచూ వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలం లేదా చలికాలంలో దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ, తలనొప్పి వంటి ఇబ్బందులు చాలామందిని వేధిస్తాయి. సాధారణంగా ఇలాంటి సమయంలో మనం వెంటనే మందులు వాడడం అలవాటుగా చేసుకుంటాం.


కానీ మన ఇంట్లోనే ఉన్న కొన్ని సరళమైన పద్ధతులతో ఈ సమస్యలకు తక్షణ ఉపశమనం పొందవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన చిట్కా అగరబత్తి‌, విక్స్. అవును మీరు విన్నది నిజమే. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, ఈరెండింటితో జలుబు, తలనొప్పి అన్నీ మాయం అవుతాయంటే నమ్మలేని నిజం. మరి దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అగరబత్తి – సువాస వాతావరణం


అగరబత్తి అంటే కేవలం పూజలో వాడేది మాత్రమే కాదు. దాని నుంచి వచ్చే సువాసన మన ఇంట్లో గాలి శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇంటి వాతావరణంలో ఉన్న దుర్వాసనలు, తేమ వలన వచ్చే బూజు వాసన అన్నీ పోయి మనసుకు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడేలా చేస్తుంది.

విక్స్ లోని ఔషధ గుణాలు

విక్స్ అంటే మనందరికీ తెలిసిన ఒక ఆయుర్వేద క్రీమ్. ఇందులో మెంటాల్, యూకలిప్టస్ ఆయిల్, కర్పూరం వంటి పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి, జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడను సులభంగా ఉపశమన పరచడానికి సహాయపడతాయి.

Also Read: Samsung Galaxy: సామ్‌సంగ్ జెడ్ ఫ్లిప్7.. హ్యాండ్స్-ఫ్రీ కెమెరాతో ఆకట్టుకుంటున్న గెలాక్సీ

ఎలా వాడాలి?

ఒక అగరబత్తి తీసుకుని దానికి పై నుంచి కింద వరకు సన్నగా విక్స్ రాయాలి. ఆ తర్వాత దానిని వెలిగించి ఇంట్లో ఒక మూలలో పెట్టాలి. ఆ అగరబత్తి నెమ్మదిగా కాలుతూ విక్స్ లోని సువాసన గాలిలో కలుస్తుంది. ఆ వాసనలో ఉన్న ఔషధ గుణాలు మన ఇంట్లో వ్యాపించి, దగ్గు, జలుబు ఉన్న వారికి వెంటనే ఉపశమనం ఇస్తాయి.

అంటే, ముక్కు బ్లాక్ అవడం తగ్గుతుంది. శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది. దగ్గు వల్ల వచ్చే గొంతు నొప్పి తగ్గుతుంది. నిద్రలో ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. గది లోపల ఆ వాసన వ్యాపించేలా తలుపులు మూసి ఉంచితే మరింత ఉపయోగం ఉంటుంది.

జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి

ఈ చిట్కా చిన్నపిల్లల దగ్గర లేదా నేరుగా శ్వాసలోకి పీల్చుకునేలా కాకుండా జాగ్రత్తగా వాడాలి. ఎక్కువ సేపు గదిలో ఉంచకుండా, 15–20 నిమిషాల తర్వాత గదిని తెరిచి ఉంచి గాలిని లోపలికి రానివ్వడం మంచిది. ఇది కేవలం తాత్కాలిక ఉపశమనానికే ఉపయోగపడుతుంది. సమస్య ఎక్కువ రోజులు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. అయితే ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు, కానీ ఒక సహాయక చిట్కాగా మాత్రం చాలా ఉపయోగకరం.

Related News

High Blood Sugar: డైలీ వాకింగ్, డైట్ పాటించినా ఆ మహిళలకు హై బ్లడ్ షుగర్ ? అదెలా సాధ్యం?

Whiteheads: ముఖంపై తెల్ల మచ్చలా? ఈ టిప్స్ పాటిస్తే సరి !

Scalp Care Tips: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది

Sugar Side Effects: చక్కెర ఎక్కువగా తింటే.. ఎంత ప్రమాదమో తెలుసా ?

Vitamin D Sources: విటమిన్ డి లోపమా ? ఇవి తింటే ప్రాబ్లమ్ సాల్వ్ !

Banana: రోజూ 2 అరటి పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా ?

Jackfruit Health Tips: ఈ ఒక్క పండు తింటే.. మీ ఆరోగ్యంలో అద్భుతమైన ఫలితాలు

Big Stories

×