Yelahanka Palace: ఏపీలో జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదంతో మరో ట్విస్ట్ నెలకొంది. అయితే యలహంక ప్యాలెస్ వద్దకు షర్మిల వస్తుందన్నదన్న అంశంపై అక్కడ ఉత్కంఠ నెలకొంది. షర్మిల రాక నేపథ్యంలో బెంగళూరులో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అక్కడ అంతా రాజకీయ నాయకులు. కార్యకర్తు సిద్దమైతున్నట్టు సమాచారం.
వైఏస్ షర్మిల ప్రవేశాన్ని అడ్డుకుంటూ దేవనహళ్లి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసారు. బెంగుళూరు కోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్యాలెస్ వద్ద భద్రత కట్టుదిట్టంతో పాటు ప్యాలేస్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. యలహంక ఆస్తిలో అంగుళం కూడా షర్మిలకు హక్కు లేదంటూ జగన్ తరఫు వాదనలు వినిపిస్తున్నారు. యలహంక ఆస్తి భారతి రెడ్డి, ఆమె కుమార్తెలకు చెందినదని కోర్టుకు వివరాలు తెలిపారు.
అయితే 2007లో సుగుణమ్మ సిలికాన్ బిల్డర్స్‌కు ఇచ్చిన లీజు.. 2027 ఫిబ్రవరి వరకు గడువు ఉందని, గతంలో గెస్ట్‌హౌస్‌లో షర్మిలకు తాత్కాలికంగా ఆశ్రయం ఇచ్చామన్న సిలికాన్ బిల్డర్స్ కోర్టుకు తెలిపింది. దీంతో కుమార్తె అంజలి వివాహ వేదిక మారినా.. యలహంక ప్యాలెస్‌ను సందర్శించాలన్న షర్మిల నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఆదేశాలను షర్మిల గౌరవిస్తారా లేదంటే ప్యాలెస్ వద్దకు వస్తే తదుపరి పరిణామాలేంటి.. అన్నదానిపై ఇప్పుడు రాష్టవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Also Read: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. BPT, SONA, సాంబ, సన్న బియ్యానికి ధరలు ఫిక్స్!