E-Paper
Advertisement

రూ.2.75 లక్షలకే హోండా 500సీసీ బైక్.. మూడు వేరియంట్లలో విడుదల!

రూ.2.75 లక్షలకే హోండా 500సీసీ బైక్.. మూడు వేరియంట్లలో విడుదల!
Advertisement

Honda CB500 Launched: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా (Honda)  ఇండియన్ మార్కెట్లోకి మరో కొత్త బైక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హోండా CB500ను తాజాగా విడుదల చేసింది. దీని ధరను రూ.2.75 లక్షలుగా నిర్ణయించింది. ముఖ్యంగా 500 సీసీ సెగ్మెంట్‌లో కొత్త బైక్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది. అల్లాయ్ వీల్స్, స్పోక్ వీల్స్ ఆప్షన్లతో మొత్తం మూడు వేరియంట్లలో ఈ బైక్ లభిస్తుంది.

501cc ఇంజన్.. 43.3Nm టార్క్..

హోండా CB500లో సరికొత్త 501cc సింగిల్ సిలిండర్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ ను అమర్చారు. ఇది 5,250rpm వద్ద 28hp గరిష్ట పవర్, 3,750rpm వద్ద 43.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ ను అందించారు. గేర్ ఛేంజెస్ ఈజీగా ఉండేందుకు స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌ను కూడా అందించారు. భారత మార్కెట్లో హోండా అందిస్తున్న అతిపెద్ద ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ బైక్ ఇదే కావడం విశేషం.

మూడు వేరియంట్లు.. ధరలు ఎలా ఉన్నాయంటే?

Advertisement

హోండా CB500ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది. అల్లాయ్ (Alloy) రూ.2.75 లక్షలు, స్పోక్ (Spoke) రూ.3 లక్షలు, స్పోక్ విత్ స్ట్రైప్ (Spoke with Stripe) రూ.3.02 లక్షలుగా కంపెనీ రేట్ ఫిక్స్ చేసింది. బేస్ వేరియంట్‌లో అల్లాయ్ వీల్స్ ఉండగా, మిగిలిన రెండు వేరియంట్లలో స్పోక్ వీల్స్ అందించారు. టాప్ వేరియంట్‌ లో స్పెషల్ కలర్స్,  గ్రాఫిక్స్ ఉన్నాయి.

సేఫ్టీ కోసం స్పెషల్ ఫీచర్లు

ఈ బైక్‌లో ముందు 19 అంగుళాల, వెనుక 17 అంగుళాల వీల్స్ అందించారు. రెండు వైపులా డిస్క్ బ్రేకులు, డ్యూయల్ ఛానల్ ABS ఉన్నాయి. సస్పెన్షన్ కోసం ముందు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక ప్రీలోడ్ అడ్జస్టబుల్ గ్యాస్ ఛార్జ్డ్ ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఇచ్చారు. అంతేకాకుండా, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC), అనలాగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, హోండా రోడ్‌ సింక్ కనెక్టివిటీ లాంటి ఫీచర్లు అన్ని వేరియంట్లలోనూ ఉన్నాయి. బైక్ కర్బ్ వెయిట్ 189 కిలోలు కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 168 మి.మీగా ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గట్టి పోటీ తప్పదా? 

Advertisement

ఇండియన్ మార్కెట్లో 500సీసీ సెగ్మెంట్ లో కొంతకాలంగా పెద్దగా పోటీ లేదు. 2020లో రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 500సీసీ UCE మోడళ్లను నిలిపివేసిన తర్వాత ఈ సెగ్మెంట్ లో ఏర్పడిన స్పేష్ ను హోండా CB500 ఫిల్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.3.38 లక్షల నుంచి ప్రారంభమయ్యే రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ కంటే తక్కువ ధరతో ఇది అందుబాటులోకి వచ్చింది.

బుకింగ్స్ షురూ..

ఈ బైక్ కోసం ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 2026 చివరి నాటికి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Read Also: మళ్లీ వస్తున్న పాత పల్సర్.. కొత్త బైక్‌లో ఏమున్నాయంటే?

Tags

Related News

Bajaj Pulsar 125 Neon: మళ్లీ వస్తున్న పాత పల్సర్.. కొత్త బైక్‌లో ఏమున్నాయంటే?

Maruti Suzuki: కొనుగోలుదారులకు మారుతి షాక్.. మళ్లీ పెరిగిన కార్ల ధరలు!

ఒకే రోజులో రెండుసార్లు ట్రాఫిక్ చలాన్ పడుతుందా? వాహనదారులు ఈ రూల్స్ తెలుసుకోండి

క్యూట్ లుక్‌ తో కొత్త ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ ఎంతో తెలిస్తే షాకవ్వల్సిందే!

విన్‌ఫాస్ట్ నుంచి మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లాంచింగ్ ఎప్పుడంటే?

టాటా To హోండా.. డిసెంబర్‌ లో రాబోతున్న 5 అదిరిపోయే కార్లు ఇవే!

ఎలక్ట్రిక్ నుంచి CNG వరకు.. డిసెంబర్‌ లో మార్కెట్లో అడుగు పెట్టనున్న 10 క్రేజీ స్కూటర్లు!

Big Stories

Advertisement
×