E-Paper
Advertisement

ఏపీలో కొత్త అధ్యాయం.. నేడే కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకారం.. పట్టణాల్లో పండగ వాతావరణం!

ఏపీలో కొత్త అధ్యాయం.. నేడే కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకారం.. పట్టణాల్లో పండగ వాతావరణం!
Advertisement

AP Municipalities: ఆంధ్రప్రదేశ్ లోని పట్టణ స్థానిక సంస్థల్లో నేటి నుంచి కొత్త పాలకవర్గాల పాలన మెుదలు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 మున్సిపల్ కార్పోరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఇవాళ తొలి సమావేశాలు జరగనున్నాయి. ఇటీవల నూతనంగా ఎన్నికైన మేయర్లు, ఛైర్ పర్సన్లు, కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్లు ఈ సమావేశంలో పాల్గొని అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో విశాఖ నుంచి అనంతపురం వరకూ అన్ని మున్సిపల్ కేంద్రాల్లో సందడి ఏర్పడింది.

ఎన్నిక పటిష్ట భద్రతా ఏర్పాట్లు

అయితే తొలి సమావేశాల్లో డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక అత్యంత కీలకంగా మారనుంది. వీళ్ల ఎన్నిక ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అధికారిక నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. ఎన్నికల నియమావళి ప్రకారం అన్ని మున్సిపల్ కార్యాలయాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

కూటమి మధ్య పదవుల కేటాయింపు

Advertisement

ఇదిలా ఉంటే తొలివిడతలో ఎన్నికలు జరిగిన 100 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్ పర్సన్ పదువుల కేటాయింపునకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సయోధ్య కుదిరింది. టీడీపీకి 66, జనసేనకు 23, భాజాపాకు 9 పదవులను సర్దుబాటులో భాగంగా కేటాయించారు. అటు విజయవాడ డిప్యూటీ మేయర్ గా చెన్నుపాటి గాంధీ భార్య క్రాంతిశ్రీని ఎంపిక చేయడం గమనార్హం.

Also Read: బిస్లెరీ వాటర్ తాగుతున్నారా? జాగ్రత్త.. ఆ నీటిలో క్యాన్సర్ కారకాలు.. FSSAI సంచలన ప్రకటన!

నేటి నుంచే ఐదేళ్ల పదవీకాలం

Advertisement

కాగా మున్సిపల్ నిబంధనల ప్రకారం.. తొలి సమావేశం జరిగిన తేదీ నుంచే కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల ఐదేళ్ల పదవీకాలం అధికారికంగా ప్రారంభం కానుంది. పట్టణాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషించాల్సిన కొత్త పాలకవర్గాలు నేటి నుంచి పూర్తిస్థాయిలో పాలనా పగ్గాలు చేపట్టనున్నాయి. దీంతో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల పాలనకు నేడు ఘనంగా శ్రీకారం చుట్టినట్లయింది.

Also Read: పాక్ ప్లేయ‌ర్ల‌పై దాడి చేయాల‌ని హ‌ర్షిత్ రాణాను గంభీరే ఉసిగొల్పాడు

Tags

Related News

యలహంక ప్యాలెస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. చుట్టూ బారికేడ్లు ఏర్పాటు

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. BPT, SONA, సాంబ, సన్న బియ్యానికి ధరలు ఫిక్స్!

‘కోడి రక్తం చూస్తేనే కళ్లు తిరిగి పడిపోతారట’.. కేతిరెడ్డిపై జేసీ వ్యంగ్యాస్త్రాలు

పంచాయతీ ఎన్నికల్లో జనసేన శ్రేణులు స్వేచ్ఛగా పోటీ చేయెుచ్చు: పవన్ కళ్యాణ్

‘నన్ను చంపాలని చూస్తున్నారు’.. జేసీ ఫ్యామిలీపై కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు!

వైఎస్ షర్మిలకు కోర్టు బిగ్ షాక్.. యలహంక ప్యాలెస్‌లోకి నో ఎంట్రీ!

స్థానిక ఎన్నికల తీరుపై వైఎస్ జగన్ సంచలన పోస్ట్.. వీడియోలు విడుదల!

Big Stories

Advertisement
×