E-Paper
Advertisement

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు.. ఇక భక్తులకు పండగే, ఆ విధంగా చేస్తే టికెట్ ఈజీ

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు.. ఇక భక్తులకు పండగే, ఆ విధంగా చేస్తే టికెట్ ఈజీ
Advertisement

Vaikuntha Dwara Darshan: ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూసినా తిరుమలలో రద్దీ కనిపిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు సీజన్‌లో రద్దీగా ఉండేది. ఇప్పుడు ప్రతీరోజూ రద్దీగా నెలకున్న పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమైన శుభదినాల గురించి చెప్పనక్కర్లేదు. తిరుమల కొండకు భక్తులు అధికంగా తరలివస్తుంటారు. తాజాగా డిసెంబర్‌ మూడో వారం నుంచి వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో 10 రోజుల పాటు భక్తులకు దర్శనాలు కల్పించనుంది తిరుమల తిరుపతి దేవస్థానం.

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు

తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు భారీ ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. డిసెంబర్ 20 నుంచి 29 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు ఉండనున్నాయి. ఈ క్రమంలో వైకుంఠ ద్వార దర్శనాల తొలి రెండు రోజులు అంటే డిసెంబర్ 20, 21న టికెట్లను లక్కీ డిప్‌ విధానంలో భక్తులకు కేటాయిస్తారు. దీనికి సంబంధించి 27న ఆన్‌లైన్‌లో లక్కీ డిప్ దర్శన టికెట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలుకానుంది.

శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు

Advertisement

రెండు రోజుల తర్వాత మిగతా రోజులకు ఎలాంటి టోకెన్లు లేకుండా నేరుగా సామాన్య భక్తులకు నేరుగా స్వామి సర్వ దర్శనం కల్పించనుంది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శనాల 10 రోజులు రోజుకు రూ.15 వేలు చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జారీ చేయనుంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నుంచి పర్మిషన్ రావాల్సి వుంది. గురువారం సీఎం చంద్రబాబు తిరుమలలో పర్యటించనున్నారు.

ఆయన దృష్టికి రూ. 300 వేల టికెట్ల అంశాన్ని అధికారులు తీసుకురానున్నట్లు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోనుంది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో ప్రివిలేజ్‌ దర్శనాలను రద్దు చేసింది. తిరుమలకు వచ్చే వీఐపీలకు మాత్రమే దర్శనం లభించనుంది. పోయిన ఏడాది వైకుంఠ ద్వార దర్శనానికి దాదాపు 8 లక్షల మంది వరకు వచ్చారు.

Advertisement

ALSO READ: వైఎస్ షర్మిల బెంగళూరు వ్యవహారంపై అంబటి ఫైర్.. ఏమన్నారంటే?

ఈ ఏడాది అంతకంటే ఎక్కువ మంది రావచ్చని టీటీడీ అంచనా. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లలో నిమగ్నమైంది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు 90 శాతం దర్శనాలు కల్పించాలన్నది టీటీడీ ఆలోచనగా కనిపిస్తోంది.

Related News

వైఎస్ షర్మిల బెంగళూరు వ్యవహారంపై అంబటి ఫైర్.. ఏమన్నారంటే?

ఎలాంటి నిర్ణయం లేకుండా ముగిసిన KRMB భేటీ.. కృష్ణా డెల్టాకు చుక్క నీరు ఇవ్వం: తెలంగాణ ENC

శ్రీకాకుళం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ జోరు.. ప్రభుత్వ వైఫల్యాలపై ధర్మాన ప్రసాద్ రావు ఫైర్

చీపురుపల్లి సభలో బొత్స సత్యనారాయణ ప్రసంగం.. మధ్యలోనే కరెంట్ నిలిపివేత!

ఏపీలో కొత్త అధ్యాయం.. నేడే కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకారం.. పట్టణాల్లో పండగ వాతావరణం!

యలహంక ప్యాలెస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. చుట్టూ బారికేడ్లు ఏర్పాటు

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. BPT, SONA, సాంబ, సన్న బియ్యానికి ధరలు ఫిక్స్!

Big Stories

Advertisement
×