E-Paper
Advertisement

చీపురుపల్లి సభలో బొత్స సత్యనారాయణ ప్రసంగం.. మధ్యలోనే కరెంట్ నిలిపివేత!

చీపురుపల్లి సభలో బొత్స సత్యనారాయణ ప్రసంగం.. మధ్యలోనే కరెంట్ నిలిపివేత!
Advertisement

Botsa Satyanarayana: విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో అభివృద్ధి ఏమి చేశారో చెప్పుకునే పరిస్థితి లేదంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ప్రలోభాలు, బెదిరింపులు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందేందుకు అభివృద్ధి, సంక్షేమాన్ని నమ్ముకోవాల్సిన ప్రభుత్వం.. ప్రలోభాలు, బెదిరింపులు, దాడుల రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపితే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చీపురుపల్లి పట్టణానికి రెండున్నరేళ్లలో ఏం అభివృద్ధి చేశారు. ప్రజల ముందుకు వచ్చి చెప్పే ధైర్యం ఉందా.. అంటూ ప్రభుత్వానికి సూటిగా సవాల్ విసిరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం తప్ప అభివృద్ధిపై మాట్లాడే పరిస్థితి ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు.

ఎంతటి పోరాటానికైనా సిద్ధం..

Advertisement

వ్యాపారులను, సామాన్యులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయించడం, వారిని ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలను తక్షణమే మానుకోవాలని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను భయపెట్టాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఘాటుగా వ్యాఖ్యానించారు. కార్యకర్తలకు, ప్రజలకు బొత్స సత్యనారాయణ భరోసా ఇస్తూ.. ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు భయపడవద్దని, మీకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. అవసరమైతే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు.

ఇక సభలో మరో కీలక పరిణామం..

బొత్స సత్యనారాయణ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ ప్రసంగిస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బొత్స.. ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి మాట్లాడే హక్కు లేదా..? ప్రజల సమస్యలను ప్రశ్నించే గొంతుకను అడ్డుకోవడం ఏ రకమైన పాలన..? అంటూ అధికార యంత్రాంగం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Advertisement

Also Read: బిస్లెరీ నీరు తాగొచ్చా? వద్దా? FSSAI నివేదికపై బిస్లెరీ సంస్థ ఏం చెప్పిందంటే?

Tags

Related News

ఏపీలో కొత్త అధ్యాయం.. నేడే కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకారం.. పట్టణాల్లో పండగ వాతావరణం!

యలహంక ప్యాలెస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. చుట్టూ బారికేడ్లు ఏర్పాటు

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. BPT, SONA, సాంబ, సన్న బియ్యానికి ధరలు ఫిక్స్!

‘కోడి రక్తం చూస్తేనే కళ్లు తిరిగి పడిపోతారట’.. కేతిరెడ్డిపై జేసీ వ్యంగ్యాస్త్రాలు

పంచాయతీ ఎన్నికల్లో జనసేన శ్రేణులు స్వేచ్ఛగా పోటీ చేయెుచ్చు: పవన్ కళ్యాణ్

‘నన్ను చంపాలని చూస్తున్నారు’.. జేసీ ఫ్యామిలీపై కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు!

వైఎస్ షర్మిలకు కోర్టు బిగ్ షాక్.. యలహంక ప్యాలెస్‌లోకి నో ఎంట్రీ!

Big Stories

Advertisement
×