BigTV English

Transfers of District collectors in AP: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ

Transfers of District collectors in AP: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ

Transfers of District collectors in AP(AP news live): ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వారిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.


ఐఏఎస్ అధికారులు బదిలీ వివరాలు..

  • అనకాపల్లి – కె. విజయ
  • పార్వతీపురం మన్యం – శ్యామ్ ప్రసాద్
  • శ్రీకాకుళం – స్వప్నిల్ దినకర్
  • అంబేద్కర్ కోనసీమ – రావిరాల మహేశ్ కుమార్
  • కడప – లోతేటి శివశంకర్
  • నెల్లూరు – ఆనంద్
  • పల్నాడు – అరుణ్ బాబు
  • తిరుపతి – డి. వెంకటేశ్వర్
  • సత్యసాయి – చేతన్
  • అన్నమయ్య – చామకుర్రి శ్రీధర్
  • విశాఖ – హరేంద్ర ప్రసాద్
  • నంద్యాల – బి. రాజకుమారి

Also Read: ఆ విషయంలో నాకు యువత సహకరించాలి: పవన్ కల్యాణ్


ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై సచివాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కున్నారని, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీకి సంబంధించి ముఖ్యమంత్రి సమీక్షించారు. పాలనలో మార్పు స్పష్టంగా కనిపించేలా.. అధికారులు వేగంగా పని చేయాలని సూచించారు.

2014 నుంచి 2019 వరకు ఇసుక సరఫరాలో అమలు చేసినటువంటి పాలసీలు, ఆ తర్వాత వైసీపీ సర్కారు తెచ్చిన విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. తక్షణం నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Also Read: చంద్రబాబు ఇంటి కోసం లంచం, డిప్యూటీ సర్వేయర్ సస్పెండ్

గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. రహదారులపై గుంతలు పూడ్చడం, వెంటనే మరమ్మతులు చేయాల్సిన రోడ్లపై అధికారులు దృష్టిసారించాలన్నారు. ఇందుకు సంబంధించి తనకు సత్వరమే నివేదికలు ఇవ్వాలన్నారు. అదేవిధంగా రోడ్ల మరమ్మతులకు సంబంధించి సాంకేతికంగా అందుబాటులోకి వచ్చిన కొత్త విధానాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు.

అదేవిధంగా.. నిత్యావసర సరుకుల భారం తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Tags

Related News

RTC mike announcement: మహిళలకు ఫ్రీ బస్.. మైక్ అనౌన్స్‌మెంట్స్ కండక్టర్ కొత్త కల్చర్!

Nara Lokesh: అలాంటి సినిమాలను రిలీజ్ కానివ్వం -లోకేష్ ఘాటు హెచ్చరిక

Ysrcp Silence: స్త్రీశక్తిపై వైసీపీ మౌనం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఒప్పుకున్నట్టేనా?

AP Free Bus: ఏపీలో ఫ్రీ బస్.. బస్సులో ప్రయాణించిన చంద్రబాబు, పవన్.. వారితో మహిళల మాట ఇదే!

AP weather alert: తీరప్రాంతంలో టెన్షన్ టెన్షన్.. 24 గంటల్లో అక్కడ దంచుడే!

AP free bus scheme: ఏపీలో ఫ్రీ బస్ రైడ్.. ఈ రూల్స్ మర్చిపోతే టికెట్ కట్టుడే!

Big Stories

×