BigTV English

Meeting of Telugu States’ CMs: చంద్రబాబు లేఖపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే..?

Meeting of Telugu States’ CMs: చంద్రబాబు లేఖపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే..?

Arrangements for the meeting of the Telugu States CMs: చర్చల ప్రతిపాదనను ఆహ్వానిస్తూ ఈ మేరకు సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ నెల 6న హైదరాబాద్ లో ని ప్రజాభవన్ వేదికగా చర్చిద్దామంటూ ఏపీ సీఎంను ఆహ్వానించారు. “తెలుగు రాష్ట్రాల పరస్పర సహకారానికి ముఖాముఖి చర్చలు అవసరం. విభజన సమస్యలను కలిసి పరిష్కరించుకుందాం. మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరఫున చంద్రబాబును ఆహ్వానిస్తున్నాం” అంటూ రేవంత్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.


ఇదిలా ఉంటే.. విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 6న హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం లేఖ రాశారు. ‘ఏపీ విభజన జరిగి పదేళ్లవుతోంది. విభజన చట్టం అమలులో భాగంగా ఉత్పన్నమైన సమస్యలపై పలు దఫాలుగా చర్చలు జరిగినా కూడా ఇంకా పరిష్కారం కాని అంశాలు ఉన్నాయి. వాటికి సామరస్యపూర్వక పరిష్కారం సాధించేందుకు కట్టుబడి ఉన్నాం. రెండు రాష్ట్రాల సంక్షేమం, పురోగతికి దోహదపడేలా ముఖ్యమైన చిక్కులను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Also Read: వచ్చామా.. వెళ్లామా అన్నట్టు పనిచేస్తే కుదరదు: అధికారులకు సీఎం వార్నింగ్


‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖాముఖి చర్చల ద్వారా కీలక అంశాలను పరిష్కరించుకునేందుకు అవకాశముంటుంది. ఈ చర్చలు మంచి ఫలితాస్తాయనే నమ్మకం ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సుస్థిర ప్రగతి సాధించడానికి, రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఇది మన బాధ్యత. ప్రజల అభ్యున్నతికి దోహదడేలా ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు ఇది అత్యంత కీలకం’ అంటూ చంద్రబాబు ఆ లేఖలో వివరించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రగతికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషిని చంద్రబాబు ప్రశంసించారు.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×