E-Paper
Advertisement

ఆంధ్రా బిడ్డగా నన్ను భావించండి.. ఏం చెయ్యాలో చెప్పండి, తెలుగులో మాట్లాడిన అనంత్ అంబానీ

ఆంధ్రా బిడ్డగా నన్ను భావించండి.. ఏం చెయ్యాలో చెప్పండి, తెలుగులో మాట్లాడిన అనంత్ అంబానీ
Advertisement

Madanapalle: తనను ఆంధ్ర బిడ్డగా భావించాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనంత్‌ అంబానీ అన్నారు. ఏపీకి అందించాల్సిన సహకారంపై మార్గనిర్దేశం చేయాలని సీఎం చంద్రబాబును కోరారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించి రిలయన్స్‌ సంస్థపై నమ్మకం ఉంచినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

ఆంధ్రా బిడ్డగా నన్ను భావించండి-అనంత్ అంబానీ

దేశ ఆర్థికాభివృద్ధిలో మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నో ప్రణాళికలు చేశారన్నారు. పంచాయతీల బలోపేతానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా కృషి చేస్తున్నారని వివరించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ఆహ్మానించిన సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం మదనపల్లెలో జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తోపాటు పలువురు హాజరయ్యరు.

మదనపల్లెలో జరిగిన కార్యక్రమానికి అనంత్ అంబానీ హాజరు

Advertisement

తెలుగులో నమస్కారం అని మాట్లాడారు అనంత్ అంబానీ. చిన్న పదాలు తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.  గ్లోబల్ హార్టికల్చర్ హబ్-ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- రిలయన్స్ ఇండస్ట్రీస్-ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ స్థాపన, నిర్వహణ కోసం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ పూర్తి మద్దతు అందిస్తుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

25 ఏళ్ల కిందట హైదరాబాద్‌కు ఐఎస్‌బీని తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు, రైతుల కోసం మరో ఐఎస్‌బీని రాయలసీమకు తీసుకొస్తున్నారని వివరించారు. మోదీ నాయకత్వంలో ఆంధ్ర భూమి.. సువర్ణ భూమిగా మారుతోందని మనసులోని మాట బయటపెట్టారు. 1919లో మదనపల్లెలో రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయగీతం జనగణమనను బెంగాలీ నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించిన విషయాన్ని గుర్తు చేశారు.

Advertisement

ALSO READ: అన్నయ్యా బాబాయ్ కేసు.. ఈడీ పిలిచారు, ఇప్పుడు ఏం చేద్దాం, వైసీపీలో నేతల ఉక్కిరి బిక్కిరి

అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అనంత్ అంబానీని తెలుగు ముద్దుబిడ్డగా అభివర్ణించారు. అనంత్‌ అంబానీ పారిశ్రామికవేత్త మాత్రమే కాదని, పర్యావరణ పరిరక్షకుడని చెప్పారు. జామ్‌నగర్‌లో 3,500 ఎకరాల్లో జంతువుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, తిరుమల శ్రీవారిపై భక్తితో ఉచితంగా ఎలక్ట్రిక్‌ బస్సులు ఇచ్చారని ఈ సందర్భంగా కొనియాడారు. ప్రాథమిక రంగం వృద్ధిలో హార్టికల్చర్‌ది కీలకపాత్రని, పండ్ల తోటల సాగులో మంచి అవకాశాలు ఉన్నాయని వివరించారు.

ప్రకృతి సేద్యంలో రాష్ట్రం తొలి స్థానంలో ఉందని, సాగునీరు ఇస్తే రాయలసీమ ప్రజలు బంగారం పండిస్తారని చెప్పారు. ఉత్పత్తికి మార్కెట్‌ సౌకర్యం తోడైతే సంపద సృష్టిస్తారని, 20 రకాల పంటల్లో ఏ పంటైనా పండించే సత్తా సీమ రైతులకు ఉందన్నారు. గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌తో పంటలు, ధరల స్థిరీకరణ జరగుతుందని చెప్పకనే చెప్పారు.

Related News

ఏపీలో సంచలనం.. తిరుపతి బీజేపీ నేత హత్యకు భార్య కుట్ర.. బయటపడ్డ షాకింగ్ నిజాలు!

అన్నయ్యా బాబాయ్ కేసు.. ఈడీ పిలిచారు, ఇప్పుడు ఏం చేద్దాం, వైసీపీలో నేతల ఉక్కిరి బిక్కిరి

అమరావతిలోని కేఎల్‌ యూనివర్సిటీలో అగ్నిప్రమాదం, విద్యార్థులు సేఫ్, ఏం జరిగింది?

నాడు జగన్, నేడు చంద్రబాబు.. బీసీల విషయంలో ఇద్దరూ వెన్నుపోటు దారులే: వైఎస్ షర్మిల!

బీసీలను మోసం చేయడానికి చంద్రబాబు కొత్త డ్రామా: బోత్స సత్యనారాయణ!

గొర్రెల కాపరిగా 8 ఏళ్ల బాలుడు.. చలించిపోయి బాలుడిని కాపాడిన మంత్రి నారా లోకేష్!

బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయిస్తాం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర!

Big Stories

Advertisement
×