E-Paper
Advertisement

తెల్ల కాగితం మూవీ రివ్యూ.. హర్ష్ రోషన్ హిట్ కొట్టాడా?

తెల్ల కాగితం మూవీ రివ్యూ.. హర్ష్ రోషన్ హిట్ కొట్టాడా?
Advertisement

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్ బండ్రెడ్డి
తారాగణం: హర్ష్ రోషన్, నక్షత్ర, దీపక్, అజయ్
సంగీత దర్శకుడు: విజయ్ బుల్గానిన్
DOP: K.V. గుహన్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
నిర్మాత: కృష్ణ కొమ్మాలపాటి
సమర్పణ: అరుణాచల క్రియేషన్స్
నిర్మాణ సంస్థ: అరుణాచల క్రియేషన్స్

తెల్ల కాగితం సినిమా కథ:

కాలేజ్ రోజుల్లో ఒకరినొకరు ఇష్టపడిన రాము (హర్ష్ రోషన్), ఆశ (నక్షత్ర)ల ప్రయాణం అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. ఇద్దరూ శారీరకంగా దగ్గర కావడం, ఆ తర్వాత ఆశ గర్భవతి కావడం జరుగుతుంది. సమాజానికి, తల్లిదండ్రులకు ఈ విషయం తెలిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోననే భయంతో ఆ యువజంట ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఆ గండం నుంచి బయటపడేందుకు వారు ఎంచుకున్న మార్గాలు ఏమిటి? ఈ ఊహించని సమస్యను వారు ఎలా ఎదుర్కొన్నారు? అనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం.

సినిమా విశ్లేషణ:

Advertisement

యువత ఎదుర్కొనే సున్నితమైన సమస్యను, ఒక బాధ్యతాయుతమైన కోణంలో దర్శకుడు రమేష్ బండిరెడ్డి తెరకెక్కించారు. సినిమా ప్రారంభంలో కాలేజ్ ఎపిసోడ్స్, లవ్ ట్రాక్ చాలా సహజంగా, యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. అయితే, మెయిన్ కాన్ఫ్లిక్ట్ ప్రారంభమయ్యాక కథనం కొంత గంభీరంగా మారుతుంది. కొన్ని సన్నివేశాల్లో డ్రామా మోతాదు ఎక్కువైనా, నేటి యువతను ఆలోచింపజేసేలా దర్శకుడు కథను నడిపించిన తీరు అభినందనీయం. టెక్నికల్ పరంగా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కథకు సరిగ్గా సరిపోయాయి.

తెల్ల కాగితం మూవీ ప్లస్ పాయింట్లు:

హర్ష్ రోషన్, నక్షత్రల సహజమైన నటన, కెమిస్ట్రీ
సినిమా నేపథ్యానికి తగినట్లుగా ఉన్న విజువల్స్
విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం (పాట్లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్)
యూత్‌కు కనెక్ట్ అయ్యే ఒక బలమైన సోషల్ పాయింట్

తెల్ల కాగితం మూవీ మైనస్ పాయింట్లు:

Advertisement

సెకండాఫ్‌లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలు సాగదీతగా అనిపించడం
కథనాన్ని రక్తి కట్టించేలా స్క్రీన్‌ప్లే ఉంటే బాగుండేది.

also read: అలనాటి ఈ అందాల తారలు ఇప్పుడెలా ఉన్నారో చూసారా?

చివరి అఖరి మాటగా:

టీనేజ్ ప్రేమలు, ఆ తర్వాతి బాధ్యతల నేపథ్యంలో సాగే ఈ ‘తెల్ల కాగితం’ కేవలం వినోదం కోసమే కాకుండా, నేటి సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నంగా నిలుస్తుంది.

Tella kaagitham Movie Rating  : 2.75/5

Related News

తత్వం మూవీ రివ్యూ.. ఈ సస్పెన్స్ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ రివ్యూ.. కార్తికేయ నిర్మాతగా సక్సెస్ కొట్టారా?

‘డోరతీ’ మూవీ రివ్యూ.. కీర్తి సురేష్ బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?

The Paradise Review : ‘ది ప్యారడైజ్’.. నాని కొత్త ప్రయోగం ఏమైందంటే?

ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ..నాని ఖాతాలో హిట్టు పడినట్టేనా?

సీక్రెట్ సోల్జర్ మూవీ రివ్యూ…

సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

Big Stories

Advertisement
×