E-Paper
Advertisement

అన్నయ్యా బాబాయ్ కేసు.. ఈడీ పిలిచారు, ఇప్పుడు ఏం చేద్దాం, వైసీపీలో నేతల ఉక్కిరి బిక్కిరి

అన్నయ్యా బాబాయ్ కేసు.. ఈడీ పిలిచారు, ఇప్పుడు ఏం చేద్దాం, వైసీపీలో నేతల ఉక్కిరి బిక్కిరి
Advertisement

Amaravati: వైసీపీలో ఏం జరుగుతోంది? వరుసగా ఈడీ నోటీసులతో ఆ పార్టీ నేతలు ఎందుకు కంగారు పడుతున్నారా? ఓ వైపు లిక్కర్ కేసు వ్యవహారం.. ఇంకోవైపు వివేకానంద హత్య కేసులో నోటీసులు నేతలు బెంబేలెత్తిపోతున్నారా? దీంతో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఆ పార్టీ నేతలు ఉంది. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలన్న దానిపై లోలోపల మదనపడుతున్నారు.

వివేకానంద కేసు కొత్త మలుపు

ఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులకు నోటీసులు ఇచ్చుకుంటూ సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తోంది ఈడీ. ఈ క్రమంలో వైసీపీ సీనియర్‌ నేత, కడప ఎంపీ అవినాష్‌‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 14న అనగా బుధవారం విచారణకు హాజరుకావాలని అందులో ప్రస్తావించినట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు జోరుగా సాగుతోంది.

ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు, 14న విచారణ

Advertisement

ఇప్పటికే ఈ కేసులోని చాలామంది నిందితులకు నోటీసులు ఇవ్వడం, వారిని విచారించడం జరిగిపోయింది. చివరకు ఎంపీ అవినాష్‌రెడ్డి వరకు వచ్చింది. అందులో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరిలను గంటల తరబడి విచారించింది ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్. నిందితుల వాంగ్మూలాలతోపాటు బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నిందితుల నుంచి వాంగ్మూలాలు నమోదు

వివేకా హత్యకు సంబంధించి రూ.40 కోట్లకు ఒప్పందం జరిగిందన్న ఆరోపణలు, నగదు బదిలీలకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో 2019 నుంచి నిందితులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, నగదు లావాదేవీలను చెక్ చేస్తోది ఈడీ. ఈ ఏడాది ఆగస్టు 21న హైదరాబాద్, కడపలోని ఏడు ప్రాంతాల్లో వివేకానంద హత్య కేసుకు సంబంధించి ఈడీ సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో పత్రాలు, డిజిటల్ పరికరాలు, అవినాష్‌ రెడ్డికి సంబంధించిన ప్రాంగణంలో లెక్కల్లో చూపని రూ.24 లక్షల నగదు, రెండు లాకర్ తాళాలు స్వాధీనం చేసుకుంది ఈడీ.

Advertisement

ALSO READ: అమరావతిలోని కేఎల్‌ యూనివర్సిటీలో అగ్నిప్రమాదం, విద్యార్థులు సేఫ్, ఏం జరిగింది?

ఈ క్రమంలో వివేకా కేసు మరో అడుగు ముందుకు పడుతుందా? ఇక్కడే ఆగిపోతుందా? అన్న చర్చ కడప జిల్లా వ్యాప్తంగా నెలకొంది. దీని సంబంధించిన డేటా మొత్తం ఈడీ వద్ద ఉందని, ఏ మాత్రం తేడా చేసినా దొరికిపోవడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.  మరోవైపు లిక్కర్ కేసులో వైసీపీ నేతలకు ఈడీ నోటీసులు ఇవ్వడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇలా వరుసగా అన్ని కోణాల్లో ఈడీ పిలుపు రావడంతో రేపు ఎవరి ఇంటికి ఈడీ నోటీసులు వస్తాయోమోనని టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.

Related News

అమరావతిలోని కేఎల్‌ యూనివర్సిటీలో అగ్నిప్రమాదం, విద్యార్థులు సేఫ్, ఏం జరిగింది?

నాడు జగన్, నేడు చంద్రబాబు.. బీసీల విషయంలో ఇద్దరూ వెన్నుపోటు దారులే: వైఎస్ షర్మిల!

బీసీలను మోసం చేయడానికి చంద్రబాబు కొత్త డ్రామా: బోత్స సత్యనారాయణ!

గొర్రెల కాపరిగా 8 ఏళ్ల బాలుడు.. చలించిపోయి బాలుడిని కాపాడిన మంత్రి నారా లోకేష్!

బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయిస్తాం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర!

జగన్‌ని ఓ రేంజ్‌లో ఆడేసుకున్న సీఎం చంద్రబాబు.. సర్వే వివరాలు వైసీపీలో వణుకు మొదలు

హైకోర్టులో వైసీపీకి ఊహించని షాక్..ఆరు వారాల్లోపు స్థానికసంస్థల ఎన్నికలు, బీసీల రిజర్వేషన్లపై జీవోల కొట్టివేత

Big Stories

Advertisement
×