E-Paper
Advertisement

కార్ల మార్కెట్‌లో పండుగ జోష్.. సెప్టెంబర్‌ అమ్మకాల్లో బిగ్ జంప్.. టాప్ కంపెనీల సేల్స్ ఇవే!

కార్ల మార్కెట్‌లో పండుగ జోష్.. సెప్టెంబర్‌ అమ్మకాల్లో బిగ్ జంప్.. టాప్ కంపెనీల సేల్స్ ఇవే!
Advertisement

September 2026 Car Sales: పండుగ సీజన్ మొదలవ్వకముందే భారత కార్ల మార్కెట్‌లో సందడి మొదలైంది. దసరా, దీపావళి లాంటి పండుగలను దృష్టిలో పెట్టుకుని కార్ల కంపెనీలు పెద్ద సంఖ్యలో కార్లను డీలర్లకు పంపించాయి. దీంతో సెప్టెంబర్ 2026లో ప్యాసింజర్ వెహికల్ మార్కెట్‌లో అమ్మకాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా SUVలకు డిమాండ్ కొనసాగగా, ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా వినియోగదారుల ఆసక్తి పెరిగింది.

అమ్మకాల్లో మారుతి సుజుకి జోష్!  

సెప్టెంబర్‌లో మారుతి సుజుకి అమ్మకాలు భారీ స్థాయిలో నమోదయ్యాయి. కంపెనీ మొత్తం 2,36,013 వాహనాలను అమ్మింది. ఇందులో దేశీయ అమ్మకాలు, ఇతర OEMలకు విక్రయాలు, ఎగుమతులు ఉన్నాయి. దేశీయ మార్కెట్‌తో పాటు ఎగుమతుల్లోనూ కంపెనీ మంచి వృద్ధిని నమోదు చేసింది. మారుతి విక్రయాల్లో SUVలు, MPVలు కీలకంగా నిలిచాయి. వీటి అమ్మకాలు 78,911 యూనిట్లుగా నమోదయ్యాయి. చిన్న కార్లు, సెడాన్ల విభాగం కూడా 91,887 యూనిట్ల అమ్మకాలతో భారీ వాటాను సాధించింది.

టాటా మోటార్స్.. ఈవీలకు భారీ డిమాండ్

Advertisement

టాటా మోటార్స్ సెప్టెంబర్‌లో 70,210 ప్యాసింజర్ వాహనాలను అమ్మింది. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 60,907 యూనిట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధి కనిపించింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. సెప్టెంబర్‌లో టాటా EV అమ్మకాలు 15,384 యూనిట్లకు చేరాయి. అంటే, టాటా అమ్మకాల్లో EVల వాటా మరింత పెరుగుతున్నట్టు తెలుస్తోంది.

మహీంద్రా.. SUVలే బలం!

SUVల మార్కెట్‌లో మహీంద్రా మరోసారి తన బలాన్ని చూపించింది. సెప్టెంబర్‌ లో కంపెనీ మొత్తం వాహన అమ్మకాలు 1,14,874 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 15 శాతం వృద్ధి నమోదయ్యింది. దేశీయ మార్కెట్లో SUVల అమ్మకాలు 64,092 యూనిట్లకు చేరుకుని 14 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మహీంద్రా ఎలక్ట్రిక్ ఆరిజిన్ SUVలు కూడా కీలక మైలురాయిని చేరుకున్నాయి. ఈ మోడళ్ల బిల్లింగ్ ఒక లక్ష యూనిట్లను దాటినట్లు కంపెనీ వెల్లడించింది.

హ్యుందాయ్.. కొత్త రికార్డు!

Advertisement

హ్యుందాయ్‌కు సెప్టెంబర్ నెల మరింత ప్రత్యేకంగా నిలిచింది. కంపెనీ దేశీయ అమ్మకాలు 57,166 యూనిట్లుగా, ఎగుమతులు 20,750 యూనిట్లుగా నమోదయ్యాయి. మొత్తం 77,916 యూనిట్లతో కంపెనీ ఇప్పటివరకు అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. వార్షిక ప్రాతిపదికన ఇది 10.8 శాతం వృద్ధి.

కియా నుంచి భారీ జంప్!

కియా ఇండియా సెప్టెంబర్‌లో 32,017 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో 22,700 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే 41 శాతం వృద్ధి నమోదైంది. కియా భారత మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇదే అత్యధిక నెలవారీ అమ్మకాలుగా నిలిచింది.

టయోటా, MG, రెనాల్ట్ పరిస్థితి ఏంటి?

టయోటా సెప్టెంబర్‌లో 28,218 యూనిట్ల మొత్తం అమ్మకాలు నమోదు చేసింది. దేశీయంగా 25,027 యూనిట్లు, ఎగుమతుల్లో 3,191 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక JSW MG మోటార్ ఇండియా 8,018 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ కొత్త ఎనర్జీ వాహనాలకు డిమాండ్ కొనసాగుతోందని తెలిపింది. మరోవైపు రెనాల్ట్ దేశీయంగా 3,399 యూనిట్లను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే నెలవారీ అమ్మకాలు తగ్గినా, జనవరి-సెప్టెంబర్ కాలంలో కంపెనీ అమ్మకాలు గత ఏడాది కంటే పెరిగాయి. మొత్తంగా చూస్తే సెప్టెంబర్ కార్ల మార్కెట్‌ లో SUVలు, EVలు, హైబ్రిడ్ వాహనాలకు ఉన్న డిమాండ్ మరోసారి స్పష్టమైంది. పండుగ సీజన్‌లో కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశాలతో కంపెనీలు ఇప్పటికే స్టాక్‌ను మరింత పెంచుతున్నాయి.

Read Also: టాటా ఏరిస్ బేస్ మోడల్ vs టాప్ మోడల్.. ఏ మోడల్ లో ఏం తేడాలున్నాయంటే?

Tags

Related News

హోండా కొత్త అడ్వెంచర్ స్కూటర్‌కు బ్రేక్.. ADV160 డెలివరీలు వాయిదా!

కారు నుంచి విమానం వరకు.. ఆటోపైలట్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసా?

టాటా ఏరిస్ బేస్ మోడల్ vs టాప్ మోడల్.. ఏ మోడల్ లో ఏం తేడాలున్నాయంటే?

ఏపీలో ఎక్కువ.. అండమాన్ లో తక్కువ.. ఇవాళ్టి పెట్రోల్, డీజిలో రేట్లు ఇవే!

డాష్‌ బోర్డ్‌ లో ఈ లైట్లు వెలుగుతున్నాయా? అయితే, కచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే!

అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్ లాంచ్ 2027 లోనే.. ఎందుకు ఆలస్యమైందంటే?

యమహా నుంచి ప్రీమియం బైక్‌ల జోరు.. భారత్‌లో కొత్త మోడళ్లకు ప్లాన్!

Big Stories

Advertisement
×