E-Paper
Advertisement

అరకు-పాడేరు ప్రాంతాల్లో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి ప్రజలు పరుగులు, 30సెకన్ల పాటు కంపించిన భూమి

అరకు-పాడేరు ప్రాంతాల్లో భూప్రకంపనలు..  ఇళ్ల నుంచి ప్రజలు పరుగులు, 30సెకన్ల పాటు కంపించిన భూమి
Advertisement

Alluri District: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాను భూప్రకంపనలు వణికించాయి. ఆ జిల్లాలని శనివారం అర్ధరాత్రి పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారి భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు.

అల్లూరి జిల్లాను వణికించిన భూప్రకంపనలు

Advertisement

అల్లూరు సీతారామరాజు జిల్లాలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శనివారం అర్ధరాత్రి 11 నుంచి 12 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చాయి. నార్మల్‌గా రాత్రి 8 లేదా 9 గంటల సమయానికి ఆ ప్రాంత ప్రజలు నిద్రపోతుంటారు. వేసవికాలం కావడంతో చాలా మంది రాత్రి 11 గంటల వరకు నిద్రపోలేదు. ఉన్నట్లుండి భూమి సడన్‌గా కదలడం ప్రారంభించింది.

వెంటనే పిల్లలతో ఇళ్ల నుంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు. కేవలం అరకులోయ, పాడేరు నియోజకవర్గాలతోపాటు మరి కొన్ని ప్రాంతాల్లో ఈ విధంగా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రిక్టర్ స్కేలుపై ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వచ్చింది. స్థానికులు మాత్రం 30 సెకన్లపాటు భూమి కంపించిందని చెబుతున్నారు.

Advertisement

అర్ధరాత్రి వేళ కంపించిన భూమి.. ఇళ్ల నుంచి ప్రజలు పరుగులు

తాము ఎప్పుడూ ఈ విధంగా భూమి వణకడం చూడలేదని అంటున్నారు. తాము భయాందోళనకు గురయ్యామని తెలిపారు. ఒరిస్సాలోని కోరాపుట్ ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తించినట్టు తెలుస్తోంది. రెక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.4గా నమోదు అయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ: గాజులు తొడుకున్నావా, అమ్మాయిలా ఏడవొద్దు, అనే పదాలకు ముగింపు చెప్పాలి: నారా లోకేష్

 

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×