BigTV English

TSPSC: గ్రూప్-1 పేపర్ కూడా లీక్?.. ప్రవీణ్ ఫోన్‌లో అమ్మాయిల నగ్న ఫొటోలు..

TSPSC: గ్రూప్-1 పేపర్ కూడా లీక్?.. ప్రవీణ్ ఫోన్‌లో అమ్మాయిల నగ్న ఫొటోలు..

TSPSC: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు ప్రవీణ్‌కు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగలోకి వస్తున్నాయి. పోలీసులు విచారణలో ప్రవీణ్ నుంచి కీలక విషయాలను రాబడుతున్నారు.


నాలుగేళ్లుగా టీఎస్‌పీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్‌గా వెరిఫికేషన్ డిపార్ట్‌మెంట్లో ప్రవీణ్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో వెరిఫికేషన్ కోసం వచ్చే అమ్మాయిల నంబర్లు తీసుకొని వారిని వేధించేవాడని.. వారికి మాయమాటలు చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అతని ఫోన్లో మహిళల నెంబర్లు, వారి నగ్న ఫొటోలు, వీడియోలు ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు.

ఇక వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలకు సంబంధించిన పేపర్ రేణుక అనే యువతి కారణంగానే లీక్ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ప్రవీణ్ నుంచి పేపర్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


మరోవైపు ఆరా తీస్తున్న కొద్దీ పీపర్ లీక్స్ వ్యవహారాలు బయటపడుతున్నాయి. గ్రూప్-1 పేపర్ కూడా లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. గతేడాది అక్టోబర్ 16న గ్రూప్-1 ఎగ్జామ్ జరిగింది. అయితే నిందితుడు ప్రవీణ్ ప్రతిభలేకపోయినా ఎగ్జామ్ రాసి 103 మార్కులు తెచ్చుకోవడంతో అనుమానాలు వ్యక్తం మవుతున్నాయి.

ఇక పేపర్ లీకేజీ ఘటనపై హైదరాబాద్‌లోని టీఎస్‌పీఎస్సీ ప్రధాన కార్యాలయం ఎదుట బీజేవైఎం, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ నేతల పిల్లలకు ఉద్యోగాల కోసమే పేపర్ లీజ్ జరిగిందని ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పేపర్ లీకేజీ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసును సిట్టింగ్ జడ్జితో విచారన జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకనడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

AP Capitals : 3 రాజధానుల ప్రస్తావనలేదేంటి?.. కారణం ఇదేనా..?

Governor : గవర్నర్ ప్రసంగంపై రచ్చ.. టీడీపీ వాకౌట్..

Tags

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×