BigTV English

OTT Movie : గ్రామంలో అందరినీ భయపెట్టే ఆత్మ… మతి పోగొట్టే మర్డర్ కేసు… క్లైమాక్స్ వరకు ట్విస్టులే

OTT Movie : గ్రామంలో అందరినీ భయపెట్టే ఆత్మ… మతి పోగొట్టే మర్డర్ కేసు… క్లైమాక్స్ వరకు ట్విస్టులే

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న సినిమాలు ఇప్పుడు ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా వీటిని ఆడియన్స్ ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, కన్నడ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ కథ కర్ణాటకలోని తులునాడు కోస్టల్ ఏరియాలో జరుగుతుంది. ఇందులో మర్డర్ మిస్టరీ, దెయ్యం సంఘటనలు, తులు సంస్కృతికి చెందిన దైవకోళ ట్రెడిషన్ మిక్స్ అవుతాయి. ఒక గ్రిప్పింగ్‌ థ్రిల్లర్ గా ఈ సినిమా చివరి వరకు ఉత్కంఠంగా నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో

‘అనుక్త’ (Anukta) 2018లో విడుదలైన కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. ఆశ్వత్ సామ్యూల్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో కార్తిక్ అట్టవార్ , సంపత్ రాజ్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 15 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, 2018 జూన్ 8న థియేటర్లలోకి వచ్చింది. IMDb 7.6/10 రేటింగ్ ని కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

విజయ్ అనే పోలీస్ ఆఫీసర్‌, తులునాడు గ్రామంలో జరిగిన ఒక దారుణమైన మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి సిద్దమవుతాడు. ఈ మర్డర్ ఒక పాత ఇంట్లో జరిగింది. దానికి రక రకాల దెయ్యం కథలు చక్కర్లు కొడుతుంటాయి. విజయ్ తన భార్య సుమతితో ఆ గ్రామానికి వెళ్తాడు. అక్కడ వాళ్లకు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. విజయ్‌కు వింత కలలు, భయంకరమైన సౌండ్స్, ఇంట్లో స్ట్రేంజ్ ఫీలింగ్ వంటి సంఘటనలు అతన్ని కలవరపెడతాయి. ఈ గ్రామంలో తులు సంస్కృతికి చెందిన దైవకోళ అనే రిచ్యువల్ గురించి తెలుస్తుంది. అది మర్డర్‌తో కనెక్ట్ అయినట్టు కనిపిస్తుంది.


విజయ్ ఇన్వెస్టిగేషన్‌లో డీప్ గా వెళ్తున్నప్పుడు, గ్రామస్తులు ఏవో సీక్రెట్స్ దాచినట్టు, ఎవరూ స్ట్రెయిట్‌గా మాట్లాడటం లేదని అర్థమవుతుంది. విజయ్ మర్డర్ కేసును సాల్వ్ చేయడానికి గ్రామంలో అందరినీ విచారిస్తుంటాడు. అతనికి స్థానిక దైవకోళ గురువు కూడా సహాయం చేస్తాడు. అయితే అతను కూడా అనుమానస్పదంగానే కనిపిస్తాడు. ఇక విజయ్‌కు వచ్చే కలల్లో ఒక అమ్మాయి కనిపిస్తుంటుంది. ఆమె మర్డర్‌తో కనెక్ట్ అయినట్టు ఉంటుంది. ఈ కలలు నిజమా, లేక సైకలాజికల్ గందరగోళమా అని విజయ్ గందరగోళంలో పడతాడు. సుమతి కూడా ఇంట్లో భయంకర సంఘటనలను ఫేస్ చేస్తుంది.

ఇన్వెస్టిగేషన్‌లో మర్డర్ వెనుక ఒక పాత రివెంజ్ స్టోరీ బయట పడుతుంది. దీనికి సంబంధించి దైవకోళ ఒక రిచ్యువల్ క్లూ ఇస్తుంది. అది మర్డర్‌కు లింక్ అవుతుంది. దీంతో కథలో సస్పెన్స్ పెరుగుతుంది. విజయ్ కేసును సాల్వ్ చేయడానికి ఒక స్టెప్ దగ్గరకు వస్తాడు. అతని కలల్లో కనిపించే అమ్మాయి, గతంలో జరిగిన ఒక ట్రాజెడీతో కనెక్ట్ అయినట్టు తెలుస్తుంది. దైవకోళ రిచ్యువల్ ఒక దెయ్యం శక్తిని రివీల్ చేయడంతో హత్య జరిగిందని తెలుస్తుంది. విజయ్, సుమతి, గురువు కలిసి ఈ శక్తిని ఫేస్ చేస్తారు. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్‌లు వస్తాయి. చివరికి ఈ మర్డర్ కేసు సాల్వ్ అవుతుందా ? దెయ్యం రహస్యం బయటపడుతుందా ? విజయ్ కలోకి వచ్చే అమ్మాయి ఎవరు ? ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చే నిజాలు ఏంటి ? అనే విషయాలను, ఈ కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని చూసు తెలుసుకోవాల్సిందే.

Read Also : చావును ముందే పసిగట్టే యాప్… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… మైండ్ బెండయ్యే ట్విస్టులు

Related News

OTT Movie : ఈ నలుగురు కుర్రాళ్ళు అరాచకం భయ్యా… అన్నీ అవే సీన్లు… ఇంత ఓపెన్ గా ఎలా భయ్యా ?

OTT Movie : భర్త మోసానికి భార్య రివేంజ్… ఎవడితో పడితే వాడితో ఆ పని… చూసి తట్టుకోవడం కష్టమే

OTT Movie : పెళ్లి రోజే మొగుడికి మస్కా… వేరొకరితో భార్య శోభనం… బుర్ర పాడు చేసే సినిమా

OTT Movie : చాకెట్లలో బంగారు టికెట్లు… తిండికి గతిలేని పిల్లాడి రాత మార్చే కథ… మనసును శాటిస్ఫై చేసే స్టోరీ మావా

OTT Movie : అమ్మాయిలనే ముట్టుకోని ఆణిముత్యం… ఆటిజం ఉన్నా అదిరిపోయే ట్రీట్మెంట్ చేసే డాక్టర్… ఒక్కో కేసులో ఒక్కో అద్భుతం

OTT Movie : పెళ్లి కాకుండానే టీనేజ్ అమ్మాయి ప్రెగ్నెంట్… చదువుకోవాల్సిన వయసులో ఇవేం పిచ్చి పనులు పాపా ?

OTT Movie : కన్న తల్లిని కడుపులో నుంచే తినేసే పిల్ల రాక్షసి… డాక్టర్ కు కూడా చుక్కలు చూపించే సైతాన్

Big Stories

×