TTD Chairman: తెలంగాణలో బీఆర్ఎస్ నేతలకు అసలు కష్టాలు మొదలయ్యాయా? రేవంత్ పాలనలో తొలి ఏడాది హ్యాపీగా ఆయా నేతలకు గడిచిపోయిందా? ఓకే రోజు ముగ్గురు బీఆర్ఎస్ నేతలకు కష్టాలు మొదలయ్యాయా? ఆ ముగ్గురూ మాజీ మంత్రులే. బీఆర్ఎస్‌లో జరుగుతున్న చర్చేంటి? ఇవే ప్రశ్నలు తెలంగాణ ప్రజలను వెంటాడుతున్నాయి.
రాజకీయాల్లో ఎవరి ఆలోచనలు వారుకుంటాయి. సమయం.. సందర్భం వచ్చినప్పుడు ఎత్తుకు పైఎత్తులు వేస్తారు. ఒక్కోసారి పార్టీ ఇమేజ్ పెరుగుతుంది. మరోసారి డ్యామేజ్ అవుతుందని, అయిన సందర్భాలు లేకపోలేదు. మరి సలహా ఎవరు ఇచ్చారో తెలీదుగానీ.. బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
మనసులో ఎలాంటి ఆలోచన వచ్చిందో తెలీదుగానీ కొండపై రాజకీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సీన్ కట్ చేస్తే.. ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీకి కొత్త ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టారు.
ఇక తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించి లేదని మనసులోని మాట బయటపెట్టారు. అన్నట్లుగా బోర్డు తొలిసారి సమావేశాల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నారు. దీంతో చాలామంది రాజకీయ నేతలు తిరుమల వెళ్లినా దర్శనం చేసుకుని వచ్చేవారు. ఈ తరహా వాతావరణం బాగుందని చాలామంది ప్రశంసించారు.
ALSO READ: ఏపీలో ఆరుగురు మంత్రులపై వేటు.. లోకేష్, పవన్‌తో రాయబారాలు మొదలుపెట్టిన నేతలు.. ఎవరువాళ్లు, ఏమైంది
గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కొండపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలపై టీటీడీ ఆగ్రహించింది. దీనిపై ఎక్స్‌లో పోస్టు చేశారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.
‘తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సంహించేది లేదన్నారు. తిరుమల పవిత్ర క్షేత్రం.. ఇది రాజకీయ వేదిక కాదన్నారు. రాజకీయంగా తిరుమలను ఎవరు వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలో హెచ్చరించారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదనే మా పాలకమండలి తొలి సమావేశంలో ప్రత్యేక ఎజెండాగా ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసేవారు ఎంతటివారైనా సరే ఉపేక్షించేదే లేదన్నారు. తెలంగాణకు చెందిన ఓ నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అతనిపై చర్యలకు ఆదేశిస్తున్నా’మని రాసుకొచ్చారు. దీంతో రేపో మాపో ఆయనకు టీటీడీ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ లో చిన్నపాటి చర్చ మొదలైపోయింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను బీఆర్ఎస్‌లోని పలువురు నేతలు, కార్యకర్తలు తప్పుబడు తున్నారు. గత పదేళ్లు ఉమ్మడి రాష్ట్రంగా ఉందని, అప్పుడు కాస్త వెసులుబాటు వచ్చిందని చెబుతున్నారు. ఎవరి నిర్ణయాలు వారు తీసుకుంటారని అంటున్నారు.
తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడకూడదని కొత్త పాలక మండలి నిర్ణయం తీసుకోవడంపై చాలామంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాంటి సమయంలో ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు. ప్రోటోకాల్ విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చకు వచ్చిందని అంటున్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడడం సరికాదని ఓ వర్గం వాదన. మొత్తానికి శ్రీనివాస్ గౌడ్‌కు ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సంహించేదేలేదు.
తిరుమల పవిత్ర క్షేత్రం. ఇది రాజకీయ వేదిక కాదు. ఎవరు రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించడం జరిగింది. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదనే మా…
— B R Naidu (@BollineniRNaidu) December 19, 2024