Lokesh Kanagaraj: ఈరోజుల్లో దర్శకులు ఒక హిట్ కొట్టడం ఈజీ అయినా అదే సక్సెస్‌ను కంటిన్యూ చేయడం మాత్రం కష్టమే. అందుకే యంగ్ డైరెక్టర్లు పక్కా హిట్ ఫార్ములాస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అలా తన సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్. కోలీవుడ్‌లో లోకేశ్‌కు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. ముఖ్యంగా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్‌సీయూ) అనేది క్రియేట్ చేసి క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలతో యూత్‌కు బాగా దగ్గరయ్యాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇక తాజాగా నిర్మాతగా తన అప్‌కమింగ్ మూవీ గురించి ప్రకటించాడు లోకేశ్. అప్పటినుండి కోలీవుడ్‌లో ఒక చర్చ మొదలయ్యింది.
ఫ్లాప్స్ మాత్రమే
దర్శకుడిగా లోకేశ్ కనకరాజ్‌కు తిరుగులేదు. తెరకెక్కించింది తక్కువ సినిమాలే అయినా వాటితోనే విపరీతమైన పాపులారిటీ సంపాదించాడు. కానీ నిర్మాతగా మాత్రం ఒక్క హిట్‌ను కూడా అందుకోలేకపోయాడు లోకేశ్. తను ఇప్పటివరకు దర్శకుడిగా మాత్రమే చాలామంది ప్రేక్షకులకు తెలుసు. కానీ లోకేశ్ కనకరాజ్ నిర్మాత కూడా అని, ఇప్పటికే రెండు ఫ్లాప్ సినిమాలను నిర్మించాడనే విషయం మాత్రం చాలా తక్కువమందికి తెలుసు. లోకేశ్ కనకరాజ్ చాలాకాలం క్రితమే ‘జీ స్క్వాడ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. తన నిర్మాణంలో రెండు సినిమాలను కూడా తెరకెక్కించాడు. కానీ అవి నిర్మాతగా లోకేశ్‌కు ఫ్లాప్స్ మాత్రమే మిగిల్చాయి.
Also Read: కన్నడ సినీ చరిత్రలో ఉపేంద్ర రికార్డ్.. ‘యూఐ’ చిత్రానికి ప్రేక్షకుల బ్రహ్మరథం
నిర్మాతగా ప్రయాణం
లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) నిర్మాతగా తెరకెక్కించిన డెబ్యూ చిత్రం ‘ఫైట్ క్లబ్’. 2023లో విడుదలయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎక్కువగా మెప్పించలేకపోయింది. అందుకే యావరేజ్ హిట్‌గా నిలిచింది. అలా ‘ఫైట్ క్లబ్’తో లోకేశ్ కనకరాజ్ జీ స్క్వాడ్ ప్రొడక్షన్ (G Squad Productions) ప్రయాణం మొదలయ్యింది. నిర్మాతగా మొదటి సినిమా ఫ్లాప్ అయినా కూడా వెంటనే సందీప్ కిషన్ హీరోగా ‘మైఖేల్’ అనే మరో మూవీని నిర్మించాడు లోకేశ్. భారీ హైప్‌తో విడుదలయిన ఈ సినిమా కూడా ఫ్లాప్‌గానే నిలిచింది. అయినా కూడా నిర్మాతగా లోకేశ్ ప్రయోగాలు చేయడం మాత్రం ఆపలేదు. ప్రస్తుతం నిర్మాతగా ఏకంగా ఒకేసారి రెండు చిత్రాలను లైన్‌లో పెట్టాడు లోకేశ్ కనకరాజ్.
ఒకేసారి రెండు సినిమాలు
రాఘవ లారెన్స్ హీరోగా బక్కియరాజ్ కన్నన్ తెరకెక్కిస్తున్న‘బెన్జ్’ మూవీని లోకేశ్ కనకరాజ్ తన జీ స్క్వాడ్ ప్రొడక్షన్ ద్వారా నిర్మిస్తున్నాడు. ఇది లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా అందరూ కొత్త నటీనటులతో ‘మిస్టర్ భరత్’ అనే మూవీని నిర్మిస్తున్నట్టుగా అనౌన్స్ చేశాడు లోకేశ్. ‘బెన్జ్’, ‘మిస్టర్ భరత్’లో ఏ మూవీ ఫ్లాప్ అయినా కూడా నిర్మాతగా లోకేశ్ కనకరాజ్‌కు హ్యాట్రిక్ ఫ్లాప్స్ పడినట్టే అని కోలీవుడ్ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం దర్శకుడిగా రజినీకాంత్ హీరోగా ‘కూలీ’ అనే సినిమా చేస్తున్నాడు లోకేశ్. దర్శకుడిగా లోకేశ్ లెక్కలు కరెక్ట్‌గా ఉన్నా నిర్మాతగా మాత్రం తడబడుతున్నాడని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.