BigTV English

Facebook Favour Israel: గాజా యుద్ధ సమయంలో పాలస్తీనా గొంతు నొక్కేసిన ఫేస్‌బుక్!.. బిబిసి రిపోర్ట్

Facebook Favour Israel: గాజా యుద్ధ సమయంలో పాలస్తీనా గొంతు నొక్కేసిన ఫేస్‌బుక్!.. బిబిసి రిపోర్ట్

Facebook Favour Israel|నేటి సమాజంలో ఇన్ఫర్మేషన్ వార్‌కు సోషల్ మీడియానే యుద్ధక్షేత్రం. ఇక్కడ కామెంట్స్, లైక్స్, షేర్స్ రూపంలో దాడులు, ప్రతిదాడులు జరుగుతుంటాయి. వీటిని తమకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తుంటారు. తద్వారా ప్రపంచం నుంచి సానుభూతో, సహాయమో అందుకుంటారు. ఇలాంటి పరిస్థితే ఇజ్రాయెల్-గాజా యుద్ధం సమయంలో వచ్చింది. ఒక పక్క మిసైల్స్, ట్యాంకర్లతో సైనికులు యుద్ధం చేస్తుంటే.. మరోపక్క సోషల్ మీడియాలో కూడా ఇన్ఫర్మేషన్ వార్ కూడా భారీగానే జరిగింది.


అయితే ఈ ఇన్ఫర్మేషన్ వార్‌లో కోట్లాదిమంది యూజర్లున్న ఫేస్‌బుక్ పెద్ద పాత్రే పోషించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గాజా నుంచి వచ్చే గొంతులను నొక్కేయడానికి ఈ అమెరికా సంస్థ ప్రయత్నించినట్లు ఎన్నో కథనాలు ప్రతిరోజూ బయటకు వస్తూనే ఉన్నాయి. పాలస్తీనాకు చెందిన వార్తా సంస్థలు పెట్టే పోస్టుల ఎంగేజ్‌మెంట్ భారీగా తగ్గిపోయేలా, ఆ వార్తలు ఎక్కువ మందికి చేరకుండా ఫేస్‌బుక్ అడ్డుకుందనేవి ఆ సంస్థపై ప్రధానంగా వస్తున్న ఆరోపణలు. తాజాగా ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ చేసిన డేటా అనాలసిస్‌లో ఇవే విషయాలు బయటపడటం ఆందోళన కలిగిస్తున్న అంశం.

గాజాపై ఇజ్రాయెల్ సేనలు దాడులు చేస్తున్న సమయంలో.. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రజలు ఎన్ని అవస్థలు పడుతున్నారు? అని ప్రపంచం అంతా తెలుసుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఈ విషయాలు ఎవరు చెప్పాలి? అక్కడున్న వార్తా సంస్థలే కదా. అవి ఫేస్‌బుక్ ద్వారా తమ ప్రజల అవస్థలను ప్రపంచానికి తెలియజెప్పాలని అనుకుంటే.. ఆ సంస్థ వాళ్ల ముందుకాళ్లకు సంకెళ్లు వేసింది. వారి పోస్టులు ఎక్కువ మందికి చేరకుండా అడ్డుకుంది.


Also Read: కెనెడా అమెరికాలో ఒక రాష్ట్రమైతే.. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

మామూలుగానే ఏవైనా దేశాల మధ్య యుద్ధం జరుగుతుందంటే.. దానికి సంబంధించి వచ్చే వార్తలు, ముఖ్యంగా బాధితుల తరఫు నుంచి వచ్చే వార్తలు ఎక్కువ మంది చదువుతారు. వారి గురించి తెలుసుకోవడానికి, కుదిరితే సాయం చెయ్యడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇజ్రాయెల్-గాజా యుద్ధం సమయంలో మాత్రం పాలస్తీనా వార్తా సంస్థలు పోస్ట్ చేసిన వార్తల ఎంగేజ్‌మెంట్ ఏకంగా 77 శాతం తగ్గిపోవడం ఆశ్చర్యకరం. అదే సమయంలో ఇజ్రాయెల్ నుంచి వచ్చిన వార్తల ఎంగేజ్‌మెంట్ మాత్రం 37 శాతం పెరిగింది.

ఉదాహరణకు పాలస్తీనా టీవీ అనే ఛానెల్‌కు ఫేస్‌బుక్‌లో 50 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే యుద్ధం సమయంలో ఆ సంస్థ చేసిన పోస్టులకు పెద్దగా వ్యూస్ రాలేదు. అంతెందుకు ఆ ఛానెల్‌లో పనిచేసే జర్నలిస్టులు చేసిన పోస్టులకు కూడా సాధారణంగా దొరికే వ్యూస్ కన్నా 60 శాతం తక్కువ వ్యూస్ వచ్చాయి. ఇదంతా ఎన్నో అనుమానాలకు దారి తీసింది. ఇలాంటి టైంలో ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాలో పనిచేసిన కొందరు.. బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. వారిలో ఒక వ్యక్తి.. ఇలా పాలస్తీనా నుంచి వచ్చే వార్తలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో కావాలనే అడ్డుకున్నారంటూ బాంబు పేల్చాడు.

కొన్ని డాక్యుమెంట్లు, ఇంటర్నల్ మెసేజ్‌లను కూడా ఆ వ్యక్తి షేర్ చేశాడు. ‘హేట్‌ఫుల్ కంటెంట్’ పేరుతో 2023 అక్టోబరు తర్వాత పాలస్తీనా యూజర్ల పోస్టులపై మెటా.. ‘షాడో బ్యాన్’ వేసినట్లు సదరు ఎంప్లాయీ షాకింగ్ విషయం వెల్లడించాడు. అంటే సదరు యూజర్‌కు కూడా సమాచారం ఇవ్వకుండా ఒక కంపెనీ.. అతని కంటెంట్‌ను బ్యాన్ చెయ్యడం అన్నమాట. ఇలా చాలామంది పాలస్తీనియన్ల అకౌంట్లపై షాడో బ్యాన్ పడిందని ఆ ఎంప్లాయీ చెప్పుకొచ్చాడు. యుద్దం సమయంలో అన్ని వర్గాల గొంతులను వినిపించాల్సిన సోషల్ మీడియా.. ఇలా ఒక వర్గం గొంతు నొక్కేయడానికి ప్రయత్నించడం నిజంగా శోచనీయం.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×