E-Paper
Advertisement

ముంబైకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. శనివారం ఆపరేషన్ ఖాయం, కోలుకోవాలని అభిమానుల పూజలు

ముంబైకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. శనివారం ఆపరేషన్ ఖాయం, కోలుకోవాలని అభిమానుల పూజలు
Advertisement

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం ముంబైకి వెళ్తున్నారు. భుజానికి ఆపరేషన్ నిమిత్తం ఆయన వెళ్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శనివారం ఆపరేషన్ జరగడం ఖాయమని అంటున్నారు. దీంతో కొద్ది రోజులు ఆయన విశ్రాంతి తీసుకోనున్నారు.

ముంబైకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్-ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం ముంబైకి వెళ్లనున్నారు. జులై 11న శనివారం ఆయనకు ఆపరేషన్ జరిగే అవకాశముంది. కొన్నాళ్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భుజం నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నారు. కేబినెట్ సమావేశానికి హాజరైనా కనీసం కూర్చోలేకపోయారు. నొప్పి తీవ్రం కావడంతో ఓసారి కేబినెట్ సమావేశం నుంచి బయటకు వచ్చేశారాయన.

Advertisement

శనివారం పవన్ భుజానికి ఆపరేషన్-ఇంతకీ ఆయనకు వచ్చిన సమస్య ఏంటి? రొటేటర్ కఫ్ అనే సమస్య. భుజం కీలును పట్టి ఉంచే కండరాలు-స్నాయువుల సముదాయాన్ని రొటేటర్ కఫ్ అని వైద్యులు చెబుతుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే కండరాలు చిట్లిపోవడంతో విపరీతమైన నొప్పి వస్తుంది. ఆ నొప్పిని తప్పుకోవడం చాలా కష్టం. దీనివల్ల చేతులు కదపలేదు, కనీసం ఆ చేతితో ఏమీ పట్టుకునే పరిస్థితి ఉండదు.

రోజు రోజుకూ నొప్పి తీవ్రం కావడంతో జూన్ చివరలో భార్య అన్నాతో కలిసి ముంబై వెళ్లాడు. అక్కడ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో వెళ్లి వైద్య పరీక్షలు చేశారు. భుజాల్లో కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెంటనే ఆపరేషన్ అవసరమని డాక్టర్లు సూచన చేశారు. వాస్తవానికి వైద్యులు జూన్‌లో ఆపరేషన్ చేయించుకోవాలని సలహా ఇచ్చారు. తనపై ప్రభుత్వ బాధ్యతలు ఉండడంతో కొంత గడువు కోరారు.

Advertisement

వేగంగా కోలుకోవాలని అభిమానుల పూజలు-తాజాగా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు జులై 10న శుక్రవారం ముంబైకి వెళ్తున్నారు పవన్ కల్యాణ్. కోకిలాబెన్ ఆసుపత్రిలో శనివారం ఆయనకు సర్జరీ జరగనుంది. రెండు భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేస్తారా? ఒకటి దాని తర్వాత మరొకటి చేస్తారా? తీవ్రతను బట్టి వారం గ్యాప్‌ ఇచ్చి ఆపరేషన్ చేస్తారా? అనేది ఇంకా తెలియాల్సి వుంది.

ALSO READ: రైల్వే ఉద్యోగిని ఇంట్లో భారీ చోరీ.. 30 తులాల బంగారం, వెండి అపహరణ!

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత పరిపాలనా విధుల్లో పాల్గొంటారని తెలుస్తోంది. కనీసం ఎలాగ లేదన్నా విధులకు హాజరుకావడానికి కనీసం రెండు వారాలు పడుతుందని అంటున్నారు. ఈలోగా వైద్యుల చెకప్‌కు వెళ్లాల్సి వుంటుందని అంటున్నారు. పవన్ కల్యాణ్ ఆపరేషన్ కోసం ముంబై వెళ్తున్న విషయం తెలియగానే ఆయన అభిమానులు పూజలు మొదలుపెట్టారు. వేగంగా కోరుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

Related News

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ఈసారి రెండుసార్లు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

రైల్వే ఉద్యోగిని ఇంట్లో భారీ చోరీ.. 30 తులాల బంగారం, వెండి అపహరణ!

ప్రశ్న రావణ్‌-వైసీపీ గుట్టు విప్పిన సీఎం చంద్రబాబు.. హే రామ్ అంటూ కొత్త డ్రామాలు, బనగానపల్లె సభలో సీఎం

Vijayawada: యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌.. ఫోన్‌లో సీక్రెట్ యవ్వారాలు, తీగ లాగితే డొంక కదిలింది

పెళ్లి వేడుకలో రక్తపాతం.. ఇద్దర్ని లేపేసిన ప్రత్యర్థులు, తిరుపతి సిటీలో జంట హత్యల కలకలం

మత విద్వేషాలు రేపితే చర్యలు తప్పవు.. జగన్, ప్రకాష్ రాజ్‌లపై మంత్రి సత్యకుమార్ ఫైర్!

రేషన్ కార్డువారికి ఏపీలో శుభవార్త.. అందుబాటులోకి మీ మార్ట్‌లు, తక్కువ ధరకే సరుకులు, మరి డీ‌మార్ట్ మాటేంటి?

Big Stories

Advertisement
×