E-Paper
Advertisement

ట్రెండింగ్‌లో ‘రివర్స్ వెకేషన్’.. లగ్జరీ లైఫ్ వదిలేసి అడవుల బాట

ట్రెండింగ్‌లో ‘రివర్స్ వెకేషన్’.. లగ్జరీ లైఫ్ వదిలేసి అడవుల బాట
Advertisement

Reverse Vacation: సెలవులు వచ్చాయంటే ..చాలు ఒకప్పుడు థాయ్‌లాండ్ అనో, దుబాయ్ అనో లేదంటే గోవాలోని ఫైవ్ స్టార్ హోటళ్లలో ఎంజాయ్ చేయాలని అనుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ రివర్స్ అయింది. అవును, అందుకే దీనికి ‘రివర్స్ వెకేషన్’అని పేరు పెట్టారు. ప్రస్తుతం జనాలు విలాసవంతమైన లైఫ్‌ను కాసేపు పక్కన పెట్టి, మొబైల్ సిగ్నల్స్ కూడా సరిగ్గా లేని సాదాసీదా పల్లెటూళ్లు, దట్టమైన అడవులలో కాలం గడపడానికి ఎగబడుతున్నారు. అసలు ఈ వింత ట్రెండ్ ఏంటి? ప్రజల మైండ్ సెట్ ఎందుకు ఇలా మారింది? ఆ ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు చూద్దాం.

అసలు ఏంటి ఈ ‘రివర్స్ వెకేషన్’?

సింపుల్‌గా చెప్పాలంటే.. ఆధునిక హంగులు, ఆర్భాటాలు లేని ప్రాంతాలకు వెళ్లి ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపడమే ఈ రివర్స్ వెకేషన్.7-స్టార్ రూములు, స్విమ్మింగ్ పూల్స్,ఏసీ క్లబ్‌లకు గుడ్ బై చెప్పేసి.. పల్లెటూరి మట్టి ఇళ్లు, అడవుల్లోని చిన్న చిన్న హట్స్ , చెట్లపై కట్టే ట్రీ హౌస్‌లలో స్టే చేయడానికి పర్యాటకులు ఇష్టపడుతున్నారు. పొద్దున్నే కోడి కూతతో నిద్ర లేవడం, బావి నీళ్లతో స్నానం చేయడం, కట్టెల పొయ్యి మీద వండిన స్వచ్ఛమైన ఆహారం తినడం ఈ వెకేషన్ స్పెషాలిటీ.

ఈ మార్పుకు గల 3 ముఖ్య కారణాలు:

Advertisement

1. మెంటల్ పీస్, డిజిటల్ డెటాక్స్ :
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ఆఫీస్ మెయిల్స్, సోషల్ మీడియా నోటిఫికేషన్లతో నేటి తరం తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సిటీల్లోని లగ్జరీ హోటళ్లకు వెళ్లినా మళ్లీ అదే వైఫై, అదే స్క్రీన్లు కనిపిస్తాయి. అందుకే.. ఫోన్ సిగ్నల్స్ దొరకని అడవుల్లోకి లేదా పల్లెటూళ్లలోకి వెళ్లి ప్రకృతితో కనెక్ట్ అవ్వాలని చూస్తున్నారు. దీనివల్ల బ్రెయిన్‌కు ఎంతో రిలాక్సేషన్ దొరుకుతుంది.

2. నోస్టాల్జియా (పాత జ్ఞాపకాలు):
ఈ రోజుల్లో మెట్రో నగరాల్లో బతుకుతున్న చాలా మంది ఒకప్పుడు పల్లెటూరి నుంచి వచ్చినవారే. కాంక్రీట్ జంగిల్స్ మధ్య బతుకుతూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను, ఆ పచ్చదనాన్ని మిస్ అవుతున్నారు. తమ పిల్లలకు కూడా వ్యవసాయం అంటే ఏంటో, పల్లెటూరి వాతావరణం ఎలా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో ఈ రివర్స్ టూరిజం వైపు అడుగులు వేస్తున్నారు.

Advertisement

3. రియల్ ఎక్స్‌పీరియన్స్ :
రూముల్లో కూర్చుని టీవీ చూడటం కంటే.. అడవుల్లో ట్రెకింగ్ చేయడం, పక్షుల కిలకిలరావాలు వినడం, రాత్రి పూట నక్షత్రాల కింద క్యాంప్ ఫైర్ వేసుకోవడం వంటి రియల్ ఎక్స్‌పీరియన్స్‌కు యువత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇది కేవలం ట్రిప్ మాత్రమే కాదు, ఒక కొత్త జీవన విధానాన్ని అనుభవించడం లాంటిది.

పెరుగుతున్న ఎకో-టూరిజం :
ట్రావెల్ ఏజెన్సీల రిపోర్ట్స్ ప్రకారం.. ఈ రివర్స్ వెకేషన్ ట్రెండ్ వల్ల హోమ్‌స్టేలు , అగ్రి-టూరిజం బిజినెస్ విపరీతంగా పెరుగుతోంది. పర్యాటకులు స్థానిక రైతులతో కలిసి పొలాల్లో పని చేయడం,ఆవుల పాలు పితకడం, చేతివృత్తులను నేర్చుకోవడం వంటి వాటిపై ఆసక్తి చూపిస్తున్నారు. దీని వల్ల అటు పర్యాటకులకు మనశ్శాంతి దొరకడమే కాకుండా, ఇటు పల్లెటూరి ప్రజల ఆర్థిక రంగానికి కూడా ఎంతో మేలు జరుగుతోంది.

Tags

Related News

‘ఇరుముడి’ మూవీలోని ఈ లోకేషన్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఫిదా అయిపోతారు!

కారు నిండా ముద్దులు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్, పాపం ప్రియుడు!

దేశంలో ఫస్ట్ హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ రెడీ.. వందే భారత్‌కు మించి వేగంతో దూసుకెళ్లనున్న రైళ్లు!

సముద్రంలో ఈ పసుపు గుర్తు కనిపిస్తే జాగ్రత్త! ఎందుకో తెలుసా?

మహారాష్ట్రలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మరాఠీ తప్పనిసరి ఎందుకు చేశారు? కారణాలేంటీ?

బ్రిటీషర్ల నాటి వైభవం.. మన దేశంలోనూ ‘లండన్’ ఉందోచ్.. విశేషాలు ఇవే!

మెట్రో రైలుకు గ్లోబల్ గుర్తింపు, ఆ సర్టిఫికేషన్ సాధించిన తొలి సంస్థగా..

అమృత్ భారత్ రైళ్లలో సూపర్ స్పెసిలిటీస్.. వెర్షన్ 3.0 చూస్తే మతిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×