E-Paper
Advertisement

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. ఐదు కేసులు నమోదు- మృతులు, ప్రభుత్వం ఏమంటోంది?

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. ఐదు కేసులు నమోదు- మృతులు, ప్రభుత్వం ఏమంటోంది?
Advertisement

Amaravati: ఏపీలో మరోసారి కరోనా కేసులు కలకలం రేపుతున్నాయా? ఐదు కేసులు నమోదయ్యాయా? ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంపై వైద్య వర్గాలు ఏమంటున్నాయి? కేవలం ప్రభుత్వంపై బురద జల్లేందుకు చేస్తున్న ప్రచారమా? కరోనా కేసులపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఏమంటోంది? ఇదే చర్చ మొదలైంది.

ఏపీలో మళ్లీ కరోనా కలకలం-ఏపీలో కరోనా సోకి కేసులు, ఆపై ఇద్దరు చనిపోవడంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. కడప జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయని, ఐదు కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఇద్దరు వేర్వేరు ఆసుపత్రుల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయారంటున్నారు.

Advertisement

జరుగుతున్న ప్రచారంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. కరోనా కేసులపై ప్రభుత్వానికి ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఇలాంటి ప్రచారం వల్ల ప్రజా భద్రతకు భంగం కలిగించాలని చూడటం చట్ట రీత్యా నేరం అవుతుందని తెలిపింది.

ఐదు కేసులు నమోదు-కడప జిల్లాలో బయటపడిన ఈ కేసులపై ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించింది. సీనియర్ డాక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దీర్ఘకాలిక చర్యలు చేపడుతున్నారని ప్రస్తావించింది. ఎక్స్ వేదికగా ఈ విషయాలు వెల్లడించింది. వృద్ధాప్యం, మధుమేహం, అధిక రక్తపోటు, వంటి కారణాలతో ఇటీవల సంభవించిన మరణాలపై ప్రభుత్వ మెడికల్ కాలేజీ-కడప వైరల్ ప్రయోగశాల ఇప్పటికే పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిందని పేర్కొంది.

Advertisement

నమోదైన కేసుల వివరాలు వెల్లడించారు. సుబ్బరాయుడు అనే వ్యక్తి మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్నాడని, తీవ్ర స్థితిలో ఉండగా గతనెల 28న మరణించినట్టు తెలిపింది. వీరారెడ్డి కూడా మధుమేహం, అధిక రక్తపోటు బాధపడుతున్నాడని, తీవ్ర స్థితిలో చికిత్స అనంతరం కోలుకుని ఈనెల నాలుగున డిశ్చార్జ్ అయ్యాడని ప్రస్తావించింది.

మృతులపై ప్రభుత్వం క్లారిటీ-కొండయ్య అనే కూడా మధుమేహం, క్షయవ్యాధితో పాటు ఆత్మహత్యాయత్నం చేసిన చరిత్ర ఉందని, ప్రస్తుతం కడప ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. సయ్యద్ మబాషాకు దీర్ఘకాలంగా మద్యపాన అలవాటు ఉందని, తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ జూలై 7న మరణించాడు. అక్షత్ కు అనారోగ్య సమస్యలు లేవని స్వల్ప లక్షణాలతో ఇంటి వద్ద ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలియజేసింది.

ALSO READ: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ఈసారి రెండుసార్లు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

నమోదైన అన్ని కేసులపై సమగ్ర విచారణ చేపట్టామని, ఎవరికీ ఇటీవల ప్రయాణ చరిత్ర లేనట్లు తేలిందని రాసుకొచ్చింది.నమోదైన కేసుల్లో ఒకరు కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో విధులు నిర్వహిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థి ఉన్నాడని, అతడు ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ప్రస్తావించింది. కేసులు, మరణాల నేపథ్యంలో సంబంధిత నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు శాంపిల్స్ పంపించాలని తెలిపారు. వైరస్‌లో కొత్త, ఆందోళనకరమైన వేరియంట్లు ఉన్నాయా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది.

 

Related News

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ఈసారి రెండుసార్లు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

ముంబైకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. శనివారం ఆపరేషన్ ఖాయం, కోలుకోవాలని అభిమానుల పూజలు

రైల్వే ఉద్యోగిని ఇంట్లో భారీ చోరీ.. 30 తులాల బంగారం, వెండి అపహరణ!

ప్రశ్న రావణ్‌-వైసీపీ గుట్టు విప్పిన సీఎం చంద్రబాబు.. హే రామ్ అంటూ కొత్త డ్రామాలు, బనగానపల్లె సభలో సీఎం

Vijayawada: యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌.. ఫోన్‌లో సీక్రెట్ యవ్వారాలు, తీగ లాగితే డొంక కదిలింది

పెళ్లి వేడుకలో రక్తపాతం.. ఇద్దర్ని లేపేసిన ప్రత్యర్థులు, తిరుపతి సిటీలో జంట హత్యల కలకలం

మత విద్వేషాలు రేపితే చర్యలు తప్పవు.. జగన్, ప్రకాష్ రాజ్‌లపై మంత్రి సత్యకుమార్ ఫైర్!

Big Stories

Advertisement
×