E-Paper
Advertisement

అయోధ్య వివాదం ఎఫెక్ట్? టీటీడీ అకౌంటింగ్ వ్యవహారాల్లో ఊహించని మార్పులు!

అయోధ్య వివాదం ఎఫెక్ట్? టీటీడీ అకౌంటింగ్ వ్యవహారాల్లో ఊహించని మార్పులు!
Advertisement

TTD Accounting: తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దేందుకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. టీటీడీ అభ్యర్థనతో సరికొత్త అకౌంటింగ్ మాన్యువల్స్ రూపొందించే ప్రాజెక్టును చేపట్టినట్లు ఐసీఏఐ ప్రకటించింది. ఇప్పటికే ప్రాథమిక అధ్యయనం ప్రారంభించినట్లు ఐసీఏఐ అధ్యక్షుడు ప్రసన్నకుమార్ తెలిపారు. టీటీడీ ఆదాయం, చెల్లింపులు, ఆస్తులు, అప్పులు, ఖాతాల నిర్వహణతో పాటు ప్రతి ఆర్థిక అంశాన్ని సమగ్రంగా పరిశీలించనున్నారు.

ప్రస్తుతం టీటీడీ అమలు చేస్తున్న అకౌంటింగ్ మాన్యువల్ దాదాపు మూడు దశాబ్దాల క్రితం రూపొందించినది. మారుతున్న టెక్నాలజీ, పెరుగుతున్న లావాదేవీలు, ఆధునిక ఆర్థిక ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని కొత్త విధానాలు అవసరమనే చర్చ జరుగుతోంది. దేవాలయాల నిర్వహణలో బలమైన రిస్క్ మేనేజ్‌మెంట్, సమర్థవంతమైన ఇంటర్నల్ ఆడిట్ వ్యవస్థలు అత్యంత కీలకం అనే చర్చ చాలా రోజులుగా జరుగుతోంఇ. చిన్నపాటి తప్పు కూడా నిధులు పక్కదారి పట్టే ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. అందుకే ఈ మార్పులకు టీటీడీ రెడీ అయ్యింది.

Advertisement

అయోధ్య రామాలయంలో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. టీటీడీ కోసం సిద్ధం చేస్తున్న అకౌంటింగ్ మాన్యువల్ భవిష్యత్తులో ఇలాంటి ఆర్థిక లోపాలను నివారించడంలో కీలక పాత్ర పోషించనుంది. గతంలో ఇండియన్ రైల్వేస్.. ఇండియా పోస్ట్ వంటి ప్రభుత్వ సంస్థలకు కూడా ఇలాంటి ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేసింది ICAI. సో.. ఇప్పుడు టీటీడీ కోసం రూపొందించే ఈ డిజైన్ ఒక రోల్‌ మోడల్ కానుంది.

Also Read: ములుగు జిల్లాలో తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు 21 ఆవులు మృతి!

Related News

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, హైదరాబాద్‌లో అయితే..

లారీని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 30 మంది, ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఏపీ రాజకీయాల్లో కొత్త అంకం.. అలర్టయిన కూటమి ప్రభుత్వం, మూడు పార్టీల సంయుక్త ప్రకటన

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. SSD టోకెన్లు రద్దు, కాకపోతే నేరుగా దర్శనం

దటీజ్ డిప్యూటీ సీఎం.. పవన్ దెబ్బకి మారిపోయిన రోడ్డు.. వాహనదారుల ప్రశంసలు!

డీఎస్సీ నిర్వహణపై రోజా తీవ్ర విమర్శలు.. సీబీఐ విచారణకు డిమాండ్!

వైసీపీ నేత విజయప్రసాద్ గుట్టు బయటకు.. చిట్టా విప్పిన ఈడీ, ఆనాటి నుంచి అజ్ఞాతంలో

చిక్కుల్లో బిగ్‌బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్.. విశాఖ పోలీసులు కేసు నమోదు, యువతి వ్యవహారమే..

Big Stories

Advertisement
×