E-Paper
Advertisement

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. SSD టోకెన్లు రద్దు, కాకపోతే నేరుగా దర్శనం

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. SSD టోకెన్లు రద్దు, కాకపోతే నేరుగా దర్శనం
Advertisement

Tirumala News: తిరుమల.. ఈ పేరు చెప్పనక్కర్లేదు. నిత్యం తండోపతండాలుగా ఏడు కొండలకు భక్తులు తరలి వస్తున్నారు. ప్రతీరోజూ ఇసుక వేస్తే రాలనంత విధంగా అక్కడికి వస్తున్నారు. టికెట్లు లేక చాలామంది ఇబ్బంది పడుతున్న సందర్భాలు లేకపోలేదు. తాజాగా బుధవారం తిరుపతిలో SSD టోకెన్లు రద్దు చేసింది టీటీడీ. అయితే భక్తులు నేరుగా వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవచ్చు.

 

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్

Advertisement

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల స్వామి దర్శనం కోసం ప్రతీ రోజూ ఏడు కొండలకు వేలాదిమంది భక్తులు తరలి వస్తుంటారు. టికెట్లు బుక్ చేసుకున్నవారు కొందరైతే, కాలిబాట వెళ్లేవారు మరికొందరు. ఈ రెండు కాకుండా ఎక్కువమంది భక్తులు సర్వ దర్శన టోకెట్లు తీసుకుని దర్శనానికి వెళ్తారు. టికెట్లు బుక్ చేసుకోకుండా వచ్చే భక్తుల కోసం ఎస్‌ఎస్‌డీ టోకెన్లను జారీ చేస్తోంది టీటీడీ.

బుధవారం SSD టోకెన్లు జారీ రద్దు

తాజాగా తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌ దగ్గర వద్ద ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ చేస్తుంది. ఈ టోకెన్లను బుధవారం నిలిపివేసింది టీటీడీ. గురువారం దర్శనానికి సంబంధించి బుధవారం జారీ చేయనున్న టోకెన్లు ఇవ్వరని తెలిపింది. అయితే భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని సర్వ దర్శనం చేసుకోవాలని వెల్లడించింది. అయితే శుక్రవారం దర్శనానికి సంబంధించి గురువారం మధ్యాహ్నం టోకెన్లు జారీ చేస్తారని వెల్లడించింది. ఈ విషయంలో భక్తులు సహకరించాలని కోరింది టీటీడీ.

Advertisement

 

అసలు మేటర్ ఇదీ

గురువారం మధ్యాహ్నం శుక్రవారం దర్శనానికి సంబంధించి టోకెన్లు జారీ చేయనున్నారు. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా వచ్చినవారు నేరుగా తిరుమలకు వచ్చి సర్వదర్శనం చేసుకునే అవకాశం కల్పించింది. ప్రతి బుధవారం ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపింది. గడిచిన ఆరు నెలల్లో ఏడు వారాల పాటు ఈ విధానాన్ని పరిశీలన చేసింది. ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ చేయకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నానా ఇబ్బందు పడుతున్నారు. ఆయా భక్తులు తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవచ్చని సూచన చేసింది.

ALSO READ: దటీజ్ డిప్యూటీ సీఎం.. పవన్ దెబ్బకి మారిపోయిన రోడ్డు.. వాహనదారుల ప్రశంసలు!

బుధవారం దర్శనం కోసం మంగళవారం ఉదయం ఆరు గంటలకు 10 వేల ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేసింది. వారికి బుధవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కానుంది. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు మంగళవారం రోజు రెండు వేల టోకెన్లు జారీ చేసింది టీటీడీ.

Related News

విధుల్లో ఉండగానే గుండెపోటు.. నున్న సీఐ అలీ మృతి!

షాక్‌లో బొత్స సత్తిబాబు, సొంత అడ్డాలో వైసీపీ నేతల షాక్, మూకుమ్మడి రాజీనామాలు

నేను అనుకుంటే వేల కోట్లు సంపాదించేవాడిని.. వైసీపీకి మంత్రి నారాయణ మాస్ కౌంటర్!

లోకేష్ టార్గెట్‌గా జగన్ కొత్త ఎత్తులు, రంగంలోకి వేణుగోపాల సోమిరెడ్డి, ఆళ్ల స్థాయిలో పోటీ ఇస్తారా?

తుని ఉమెన్స్ కాలేజీలో ఫుడ్ కలకలం, సాంబారులో బల్లి వ్యవహారం, ఆసుపత్రిలో విద్యార్థినులకు చికిత్స

నిడదవోలులో మళ్లీ మొదలైన విగ్రహ వివాదం.. రంగంలోకి వంగవీటి రంగా కుమార్తె!

ఏపీలో మొట్టమొదటి తొలి ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

నాగలాపురం తహసీల్దార్ ఆఫీస్‌లో విషాదం.. ఫ్యాన్ ఊడిపడి యువకుడికి గాయాలు!

Big Stories

Advertisement
×