E-Paper
Advertisement

టీటీడీ కొత్త విధానం! శ్రీవారి సేవకులకు సిబిల్ తరహాలో రేటింగ్, సేవకు రేటింగ్ ఎందుకు?

టీటీడీ కొత్త విధానం! శ్రీవారి సేవకులకు సిబిల్ తరహాలో రేటింగ్, సేవకు రేటింగ్ ఎందుకు?
Advertisement

Tirumala News: ఏడాదికి ఒక్కసారైనా తిరుమల శ్రీవారి దగ్గరకు వెళ్లాలని భక్తులు కోరుకుంటారు. స్వామిని దర్శించి ముక్కులు తీర్చుకుంటే కొంతైన రిలీఫ్ లభిస్తుందని భక్తుల నమ్ముకం. భక్తులకు తగిన విధంగా సేవలు సరిగా అందలేదని భావిస్తోంది టీటీడీ. నేపథ్యంలో శ్రీవారి సేవకులకు సిబిల్ తరహాలో రేటింగ్ ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తోంది. ఆ రేటింగ్ ఏ విధంగా ఇస్తారన్నది అసలు ప్రశ్న.

టీటీడీ కొత్త విధానం! తిరుమల పేరు చెప్పనక్కర్లేదు. శ్రీనివాసుడిని దర్శించుకుందనే భక్తులు పోటీ పడుతుంటారు.  టీటీడీ విడుదల చేసిన టికెట్ల కంటే భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. రోజు రోజుకూ భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా భక్తులు చాలా చోట్ల ఇబ్బందిపడిన.. పడుతున్న సందర్భాలు వెలుగులోకి వస్తున్నాయి.

Advertisement

శ్రీవారి సేవకులకు సిబిల్ తరహాలో రేటింగ్- చాలామంది నానారభస చేస్తున్నట్లు సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. దీన్ని పరిష్కరించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త నిర్ణయం తీసుకోనుంది. తిరుమల శ్రీవారి సేవకుల పనితీరు ఆధారంగా సిబిల్‌ స్కోర్‌ తరహాలో రేటింగ్ ఇవ్వాలని భావిస్తోంది. మంగళవారం శ్రీవారి సేవా సదన్-2లో గ్రూప్ సూపర్‌వైజర్‌ల శిక్షణా కార్యక్రమం జరిగింది.

భక్తులకు నాణ్యమైన సేవలు-ఈ సందర్భంగా టీటీడీ ఈవో రవిచంద్ర మాట్లాడారు. భక్తులకు సేవా నాణ్యతమైన  మెరుగుపరచడానికి, స్వచ్ఛంద సేవలో పాల్గొనడానికి భక్తులకు అవకాశాలను విస్తృతం చేయడానికి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

Advertisement

గ్రూప్ సూపర్ వైజర్ల కార్యక్రమంలో ఈవో మాట-తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 వేల దేవాలయాలు ఉన్నాయని, స్థానిక దేవాలయాలు, పుణ్యక్షేత్రాలలో భక్తుల సర్వీసు చేసే అవకాశాలను గుర్తించాలని గ్రూప్ సూపర్‌వైజర్లు, శ్రీవారి సేవకులను ఆయన కోరారు. శ్రీవారి సేవకుల పని తీరును అంచనా వేసి, అందుకు అనుగుణంగా విధులు కేటాయించేందుకు సిబిల్ స్కోర్ తరహా రేటింగ్ వ్యవస్థను తీసుకురావాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ వ్యవస్థ సేవా ప్రమాణాలను బలోపేతం చేయడం, బాధ్యతలను నిర్ధారిస్తుందన్నారు. అందుకోసం గ్రూప్‌ సూపర్‌వైజర్లు సమష్టిగా కృషి చేయాలన్నారు. చాలా మంది శ్రీవారి సేవ చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు  వస్తుంటారు. కేవలం తిరుమల కాకుండా వారి సొంత గ్రామాలు, పట్టణాల్లోని దేవాలయాల్లో సేవ చేసేందుకు వీలు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు.

ALSO READ: తిరుపతి హైవే ప్లాట్ల ప్రకటనలపై టీటీడీ వేటు.. పోలీసులకు ఫిర్యాదు!

మరోవైపు తిరుపతిలో బుధవారం శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించిన ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని నిలిపి వేసినట్లు ప్రకటించింది టీటీడీ. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల్లో టోకెన్ల జారీ ఉండదని తెలిపింది. శుక్రవారం దర్శనం కోసం గురువారం మధ్యాహ్నం నుండి యథావిధిగా టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగుతుందని ఈ సందర్భంగా భక్తులకు తెలియజేసింది.

Related News

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

Big Stories

Advertisement
×