E-Paper
Advertisement

ఇక్కడ ప్లాట్లు కొంటే.. తిరుమలలో జీవితాంతం వీఐపీ బ్రేక్ దర్శనమట.. టీటీడీ రెస్పాన్స్ ఇదే!

ఇక్కడ ప్లాట్లు కొంటే.. తిరుమలలో జీవితాంతం వీఐపీ బ్రేక్ దర్శనమట.. టీటీడీ రెస్పాన్స్ ఇదే!
Advertisement

TTD Complaint: తిరుపతి హైవేలో ప్లాట్లు కొనుగోలు చేస్తే “జీవితాంతం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం” కల్పిస్తామని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న SCP Developers సంస్థపై టీటీడీ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ప్రచారానికి టీటీడీతో ఎలాంటి సంబంధం లేదని, ఇటువంటి హామీలు ఇచ్చే అధికారం ఏ ప్రైవేటు సంస్థకూ లేదా వ్యక్తికీ లేదని స్పష్టం చేసింది.

తప్పుడు ప్రచారం..

శ్రీవారి దర్శనాలు, సేవలు, టికెట్లు అన్నీ టీటీడీ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారమే అమలులో ఉంటాయని వెల్లడించింది. టీటీడీ పేరు, శ్రీవారి పేరు, దర్శనాలను ఉపయోగించి భక్తులను ఆకర్షించేలా తప్పుడు ప్రచారం చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య అని పేర్కొంది. ఇటువంటి తప్పుడు ప్రకటనలు, సోషల్ మీడియా రీల్స్, వాణిజ్య ప్రకటనలను నమ్మి భక్తులు మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనాలకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం టీటీడీ అధికారిక ప్రకటనలు, వెబ్‌సైట్, అధికారిక సోషల్ మీడియా వేదికలను మాత్రమే విశ్వసించాలని సూచించింది.

Advertisement

Also Read: ఈ ధరలో ఇలాంటి ఫీచర్లా? 50MP కెమెరా, స్నాప్‌డ్రాగన్‌తో Poco M8 Power సెన్సేషన్!

చట్టపరమైన చర్యలు..

టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టిన నేపథ్యంలో సంబంధిత సంస్థ తమ సోషల్ మీడియా ప్రకటనలను తొలగించినట్లు గుర్తించారు. ప్రకటనలను తొలగించినప్పటికీ, సంబంధిత సంస్థపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ పేరు, శ్రీవారి ప్రతిష్ఠను వ్యాపార ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసి భక్తులను తప్పుదోవ పట్టించిన సంస్థపై కఠిన చర్యల కోసం పోలీసులకు అధికారిక ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.

Advertisement

Also Read: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. అధికారులకు కీలక సూచనలు!

Related News

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, రికార్డు స్థాయిలో ఆదాయం

Big Stories

Advertisement
×