BigTV English
Advertisement

TTD: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై.. చర్యలకు సిద్ధమైన టీటీడీ

TTD: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై.. చర్యలకు సిద్ధమైన టీటీడీ

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో.. వందకు పైగా ఆవులు మృతి చెందాయంటూ.. వైసీపీ నేత, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు.. రాజకీయ దుమారానికి దారితీశాయ్. చనిపోయిన గోవుల ఫోటోలను చూపిస్తూ.. గోశాలను అసమర్థ అధికారుల చేతుల్లో పెట్టారని విమర్శించారు. ఇందుకు టీటీడీ నిర్లక్ష్యం, అసమర్ధతే కారణమన్నారు. గోవులకు సరైన ఆహారం, వైద్య సౌకర్యాలు అందడం లేదని ఆరోపించారు.


తిరుమల గోశాల చుట్టూ ఫైట్‌ కంటిన్యూ అవుతూనే ఉంది. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన వర్సెస్ టీటీడీ మధ్య పంచ్‌లు పేలుతున్నాయి. ఆరోపణలు, విమర్శలతో హీటెక్కిస్తున్నారు. ఈ వివాదంలో తాజాగా ఈవో కూడా ఎంటరయ్యారు. భూమన ఆరోపనలకు కౌంటర్ ఇస్తూనే, గత ఐదేళ్లల్లో గోశాల పరిస్థితి దుర్భరంగా ఉండేదని ఆరోపించారు. అప్పటి డైరెక్టర్‌ హరినాథ్‌రెడ్డి హయాంలో.. విజిలెన్స్‌ను కూడా గోశాలలోకి అనుమతించలేదని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలకు భూమన కౌంటర్ ఇచ్చారు. ఈవో రాజకీయాల్లోకి రావాలంటూ సెటైర్స్ వేశారు. టీటీడీలో 2 వేల మంది తన శ్రేయోభిలాషులు ఉన్నాని చెప్పారు. టీటీడీ ఛైర్మన్‌, ఈవో కార్యాలయాల్లోనూ తన మనుషులు ఉన్నారని, ఏం జరిగినా తెలుస్తుందంటూ బాంబు పేల్చారు భూమన. ఈవో చెప్పిన ప్రతి అంశానికీ భూమన భారీ ఎత్తున కౌంటర్లు వేశారు. అందులో భాగంగా గోశాల విషయంలో జరిగిన విజిలెన్స్ రిపోర్టులు. అవి తాము చేయించిన రిపోర్టులనీ. వీరు ఇప్పుడొచ్చి ఏమీ చేయించలేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు భూమన.

గోశాలలో గోవులు చనిపోతున్నాయని.. చెబుతూ, తిరిగి మేము మార్పింగ్ వీడియోలను ప్రచారం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మేము చెబుతున్నది కూడా అదే కదా అంటూ కౌంటర్ అటాక్ చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈవో కూడా యావరేజ్ గా ఆవులు చనిపోతున్నది నిజమే అంటున్నప్పుడు మేం చెప్పినదాన్లో అబద్ధం ఎక్కడుందని నిలదీశారాయన.


ఇదిలా ఉంటే.. తాజాగా  వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు టీటీడీ బోర్డు మెంబర్‌ భానుప్రకాశ్‌రెడ్డి. గోశాల ఇష్యూలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని.. పవిత్రమైన గోశాలను గోవధ శాలగా మార్చారంటూ కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డిపై ఐటి యాక్ట్ 74, BNS యాక్ట్ 356 కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు.

Also Read: రైతులను మోసం చేసి భూములను లాక్కుంటున్నాడు.. బాబుపై షర్మిల షాకింగ్ కామెంట్స్

భక్తుల మనోభావాలు దెబ్బతినేలా భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారన్నారు భాను ప్రకాష్ రెడ్డి. గతంలో తాము వైసీపీ హాయంలో జరిగిన అక్రమాలపై ఆధారాలతో బయట పెట్టామని.. కరుణాకర్ రెడ్డి మాత్రం అసత్యాన్ని ప్రచారం చేశారన్నారు. వైసిపి హాయంలో పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు పెట్టారని ఆరోపించారు. గోవిందుడు, గోవులతో ఆటలు వద్దని వైసిపి నేతలకు హెచ్చరిస్తున్నామన్నారు. టిటిడిలో‌ జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని.. త్వరలోనే అన్నింటిపైనా చర్యలు తీసుకుంటామన్నారు.

 

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×