Mutton: చాలామంది నాన్‌వెజ్ ప్రియులకు మటన్ అంటే చాలా ఇష్టంగా తింటుంటారు.. చికెన్ కంటే మటన్ తినాలంటేనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఆరోగ్యానికి మంచిదని కొందరు తింటారు. ఇలా తరచూ కాకపోయిన అప్పుడప్పుడు మటన్ తెచ్చెకొని తింటుంటారు.. మటన్‌ను కూడా మరీ అతిగా తినకూడదు. తింటే లేని పోని అనారోగ్య సమస్యలు వస్తాయి. మటన్‌ను ఎవరైనా వారానికి ఎంతో మోతాదులో తినాలి..?
విటమిన్ బి12 కోసం..
మటన్‌ను తినడం వల్ల మన శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా మటన్‌లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. అయితే విటమిన్ బి12ను పొందాలని చూసేవారు మటన్ లివర్, బోటి, తలకాయ వంటివి తినాలి. మటన్ కన్నా వీటిల్లోనే విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. విటమిన్ బి12 మన శరరీంలో ఎర్ర రక్త కణాల తయారీకి ఉపయోగపడుతుంది. అలాగే నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మెడ, భుజాల నొప్పి ఉన్నవారు తరచూ మటన్‌ను తింటే మేలు జరుగుతుంది. మటన్‌లో ఐరన్ కూడా సమృద్ధిగానే ఉంటుంది. ఇది రక్తం తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. నీరసం, అలసట తగ్గుతాయి. యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు.
అధిక చక్కెర:
నిజానికి మటన్ తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్లతో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కానీ.. మటన్ పలు అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుందని మీకు తెలుసా? అందులో ముఖ్యంగా తరచూ మటన్ తినేవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రధానంగా.. మటన్‌లోని హానికారక శాచురేటెడ్ కొవ్వులు సహజ ఇన్సులిన్ విడుదలను అడ్డుకుంటున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారట.
Also Read: డైలీ ఉదయన్నే ఈ పనులు చేస్తే.. రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు
ప్రాసెస్ చేసిన మాంసం:
ఇష్టం కదా అని నాన్‌వెజ్ లాగిస్తే ఇక చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక మొత్తంలో ప్రాసెస్ చేసిన మాంసం, రెడ్ మీట్ తినడం పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. చికెన్, ఫిష్ వంటి ఇతర ప్రోటీన్ వనరులను తీసుకోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ తగ్గించదని అధ్యయనం చెపుతోంది. అందుకే నాన్‌వెజ్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదని చెపుతున్నారు. శరీరానికి మాంసాహారం అవసరమే కానీ.. పరిమితికి మించి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు.
మాంసంకి బదులు కూరగాయలు:
మాంసంకి బదులుగా తాజా కూరగాయలు, తృణ దాన్యాలు, పండ్లు వంటి వాటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సూచిస్తున్నారు. ఇవి ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా డైట్ కంట్రోల్‌గా కూడా ఉపయోగబడతాయి. కూరగాయలు, పండ్లలో విటినిన్స్, మినరల్స్, ఫ్లావానోయిడ్స్ వంటి అనేక రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్‌ను తీసుకోవద్దని చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.