BigTV English

TTD No-Fly Zone: తిరుమల కొండపై.. నో ఫ్లయింగ్ జోన్ డిమాండ్

TTD No-Fly Zone: తిరుమల కొండపై.. నో ఫ్లయింగ్ జోన్ డిమాండ్

TTD No-Fly Zone: తిరుమల ఆలయంతో పాటు ఏడు కొండలను.. నోప్లయింగ్ జోన్ గా ప్రకటించాలని ఎన్నో సంవత్సరాలుగా.. అటు రాష్ట ప్రభుత్వంతో పాటు టీటీడీ పాలక వర్గాలు, కేంద్రానికి వినతులు పంపుతున్నాయి. అయితే సాంకేతిక కారణాల వల్ల.. తిరుమలను నో ప్లయింగ్ జోన్‌గా ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే తాజాగా అహ్మదాబాద్‌లో జరిగిన దుర్ఘటన తర్వాత.. మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పుడు మరో సారి భక్తుల నుంచి.. నోప్లయింగ్ జోన్ గా ప్రకటించాలనే డిమాండ్ వినిపిస్తోంది. దానికి తోడు అత్యవసరంగా యాంటీ డ్రోన్ సాంకేతికతను.. అమలు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ దిశగా టీటీడీ అడుగులు వేస్తుందా?


తిరుమలలో చెలరేగుతున్న సంఘ విద్రోహ శక్తులు

అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు.. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరుడు వెలిసిన తిరుమల క్షేత్రం.. అలాంటి క్షేత్రంలో మరింత కఠినంగా.. భద్రతా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాంకేతిక పరిజ్ణానం పెరుగుతున్న కొద్ది.. విద్రోహ శక్తులు చెలరేగి పోతున్నాయి. దీనికి తగ్గట్టుగా ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా ఎదో ఒక లోపాన్ని వెతుక్కుని సంఘవిద్రోహ శక్తులు చెలరేగుతున్నాయి.


తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి కుట్రలు

ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద హిందూ దార్మిక సంస్థ.. టీటీడీ మారుతున్న సాంకేతికకు అనుగుణంగా.. ముందుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి హిందువు తన జీవితంలో ఓక సారి అయిన.. శ్రీనివాసుడుని దర్శించుకోవాలని అనుకుంటారు. కొండపై హిందు ప్రాసశ్యతను, పవిత్రతను దెబ్బ తీయాలని కూడా హిందు వ్యతిరేక శక్తులు, అన్యమతస్తులు పాల్పడుతున్న అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో తిరుమల కొండపై భద్రతా ఏర్పాట్లు.. ప్రభుత్వానికి సవాలుగా మారుతున్నాయి.

విదేశాల్లో యుద్ధగతిని నిర్దేశిస్తున్న డ్రోన్లు

తాజాగా ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలతో.. తిరుమలలో భద్రతా విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై.. ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అటు రష్యా -ఉక్రేయిన్ యుద్దంతో పాటు ఇజ్రాయిల్ – పాలస్తీనా యుద్దంలో ఎక్కువుగా డ్రోన్స్ యుద్దగతిని నిర్ధిశిస్తున్నాయి. ఆ సాంకేతికతో ఉగ్రవాదులు డ్రోన్స్‌ను ఉపయోగించే పరిస్థితిని కొట్టి పారేయలేం అంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ ద్వారా.. డ్రోన్స్ ఎగరకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.

డ్రోన్లతో చిత్రీకరణ జరుపుతున్న యూట్యూబర్స్

ఈ మధ్య కాలంలో తరుచుగా.. డ్రోన్స్‌తో కొంతమంది యుట్యాబర్స్ చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి స్థితిలో పూర్తి స్థాయిలో.. డ్రోన్స్ ఎగరవేయకుండా ఉండే టెక్నాలజీని వాడుకోవాలంటున్నారు. అందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు పూర్తిగా సహాకరించాల్సిన పరిస్థితి ఉంది. తాజాగా టీటీడీ యాంటీ డ్రోన్ టెక్నాలజీ కోసం ఇజ్రాయిల్‌తో సంప్రదింపులు జరుపుతోంది. గత పాలకులు సైతం యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకు వస్తామని.. పలుమార్లు చెప్పినప్పటికి అచరణలో పట్టించుకోలేదు. మరి ప్రస్తుత టీటీడీ పాలకవర్గం చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.

అహ్మాదాబాద్ ఘటనతో భక్తుల భయాందోళన

ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తర్వాత తిరుమలను నో ప్లయింగ్ జోన్ గా ప్రకటించాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. రేణిగుంట విమానాశ్రయం అతి దగ్గరగా ఉండటం వల్ల తిరుమల మీదుగా విమానాలు ఎగరక తప్పదని ఎయిర్‌పోర్టు అథారటి అధికారులు చెబుతున్నారు. అయితే అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం హస్టల్ భవనంపై పడటంతో భవనం శిథిలం కావడంతో పాటు ప్రయాణీకులు, మేడికోలు కూడా చనిపోయారు. ఇలాంటిది తిరుమల విషయంలో ఉహించుకోవడానికి కూడా భక్తజనం భయపడుతున్నారు.

కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని డిమాండ్లు

ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట ప్రభుత్వంతో పాటు టీటీడీ పాలకవర్గాలు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకు వచ్చి తిరుమలను నో ప్లయింగ్ జోన్ గా ప్రకటింప చేయాలని భక్తులు, హిందూ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఈ మధ్య తరుచుగా విమానాలు ఆలయం మీదుగా దూసుకు పోతున్నాయి. ఒక్కో రోజు అయితే ఏకంగా పది విమానాలు కూడా ఆలయం మీదుగా వెళ్ళాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకుని కేంద్రం మీద వత్తిడి తీసుకురావాల్సి ఉందంటున్నారు.

శ్రీకాళహస్తి, కడప, చంద్రగిరి దిక్కులలో హోల్డింగ్ పాయింట్

ఏయిర్ పోర్ట్ అథారిటీ అఫ్ ఇండియాతో చర్చలు జరిపి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటింప చేయాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. తిరుపతి విమానాశ్రయానికి రాక పోకలకు శ్రీకాళహస్తి, కడప, చంద్రగిరి దిక్కులలో హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయిని వాటిలో చంద్రగిరి హోల్డింగ్ పాయింటును రద్దు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు. ఇప్పటికైనా టీటీడీ ఈ విషయంలో సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×