Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’ పథకం ఇంప్లిమెంట్ కావడంతో వైసీపీ పరిస్థితి ఏంటి? ఈ స్కీమ్‌పై ప్లాన్ ప్రకారం బురద జల్లుతోందా? టీడీపీకి క్రెడిట్ ఇచ్చేందుకు వైసీపీ మనసు రావడం లేదా? రాబోయే నాలుగేళ్లు ఈ పథకం కంటిన్యూగా సాగితే ఏపీలో ఫ్యాన్ తిరగడం కష్టమేనా? ఎందుకు వైసీపీ నేతలు ఆ విధంగా చర్చించుకుంటున్నారు? ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
ఏపీలో కూటమి పాలన ఏడాది సందర్భంగా తల్లికి వందనం పథకం ప్రారంభించారు సీఎం చంద్రబాబు. గడిచిన రెండు, మూడు రోజులు తల్లుల ఖాతాల్లోకి నిధులు చేరుకున్నాయి. చాలామంది విద్యార్థుల తల్లులు హ్యాపీగా ఫీలవుతున్నారు. కష్టాల్లో ఉన్న తమకు ఈ నిధులు ఊరట ఇస్తుందని చెబుతున్నారు. కచ్చితంగా తమ పిల్లలను బడులు, కాలేజీలకు పంపిస్తామని చెబుతున్నారు.
వైసీపీ హయాంలో కుటుంబంలో ఒక్క విద్యార్థికి మాత్రమే ‘తల్లి ఒడి’ పేరుతో 13 వేలు రూపాయలు ఇచ్చేవారు. అందుకు కండీషన్లు చాలానే ఉన్నాయనుకోండి. అది వేరే విషయం. అయితే కూటమి సర్కార్ వైసీపీ పెట్టిన కండీషన్లు ఫాలో అవుతూనే, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ 15 వేల చొప్పున నిధులు తల్లుల ఖాతాలో వేసింది.
ఖాతాలో ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు పడడంతో ఆ తల్లిదండ్రులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఒకవిధంగా ఈ పథకం చిన్న చిన్న లోపాలున్నా సక్సెస్ అయ్యిందనే చెప్పవచ్చు. పరిస్థితి గమనించిన వైసీపీ, ఏదోవిధంగా ఆ పథకంపై బురద జల్లే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా.
ALSO READ: శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. రెడీగా ఉండండి?
ఆ పార్టీకి చెందిన నేతలు రోజుకు ఇద్దరు లేదా ముగ్గురు మీడియా ముందుకొచ్చి ఈ స్కీమ్ గురించి నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. దీనికితోడు ఆ పార్టీ అధికారిక గెజిట్ సాక్షి ద్వారా తమదైన స్టయిల్‌లో ప్రచారం మొదలుపెట్టింది వైసీపీ. తాటికాయంత అక్షరాలతో ‘తల్లుల పేరుతో లీలలు వంధనం వింతలు’ క్యాప్షన్ పెట్టింది రాసుకొచ్చింది. పరిస్థితి గమనించిన మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగేశారు.
‘తల్లుల కళ్లలో ఆనందం చూసి జగన్ కడుపు మంట మూడింతలు పెరిగిందని ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ రాసుకొచ్చారు. మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదు. గ్రామ సచివాలయం, లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తరువాత మాత్రమే వారికి నిధులు విడుదల అవుతాయి.
దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ జగన్ రెడ్డి. మీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు చేస్తారనుకుంటే ఎలా? మాది ప్రజా ప్రభుత్వం తప్పు చెయ్యం.. చెయ్యనివ్వం. కడుపు మంటగా ఉన్నట్టుంది రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తాను వాడండి.. కాస్త తగ్గుద్ది’ అంటూ రాసుకొచ్చారు.
ఈ స్కీమ్ గురించి జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్న ఆ పార్టీ నేతలు ఫ్యూచర్ తమ భవిష్యత్ ఏంటని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఉచిత బస్సు, మిగతా స్కీమ్‌లు అమలైతే తమ పరిస్థితి ఏంటన్నది కొందరి మాట. ఇంకా నాలుగేళ్లు ఉందని, మరో రెండేళ్లకు వైసీపీ పరిస్థితి ఏంటని తెలుస్తుందని అంటున్నారు. మొత్తానికి వైసీపీ నేతల్లో అప్పుడు చిన్నపాటి టెన్షన్ మొదలయ్యిందనే చెప్పవచ్చు.
#PsychoFekuJagan#TallikiVandanam
తల్లికి వందనం సూపర్ సక్సెస్! తల్లుల కళ్లలో ఆనందం చూసి
జగన్ రెడ్డి గారి కడుపు మంట మూడింతలు పెరిగింది. మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా… pic.twitter.com/GhgmEkpKJJ— Lokesh Nara (@naralokesh) June 15, 2025