Brahmamudi serial today Episode: పంతులు గారు పూజ చేయిస్తుంటాడు. అపర్ణ, ఇంద్రాదేవి ఇద్దరూ కలిసి కనకానికి పూజరి చెప్పినట్టు మనం చేయాలి అని చెప్తారు. సరే అంటుంది కనకం. పూజ అయిపోతుంది. పంతులు కూడా పూజ అయిపోయిందని అమ్మవారికి హారతి వెలిగించి అమ్మవారికి ఒక్కసారి చూపించి దండం పెట్టుకో అమ్మా అని చెప్తాడు. యామిని సరే పంతులు గారు అంటూ హారతి ఇవ్వడానికి లేస్తుంది. దీంతో పంతులు ఇక్కడ హారతి ఇవ్వమని చెప్పాను అందరూ అలర్ట్ గా ఉండండి దిష్టి బొమ్మల్లా నిలబడటం కాదు అంటాడు. దీంతో కనకం వెళ్లి ఫ్యాన్ వేస్తుంది. కానీ ఫ్యాన్ స్టార్ట్ కాదు. అపర్ణ, ఇంద్రాదేవి కంగారుపడుతుంటారు.
యామిని హారతి ఇస్తుంది. అమ్మా అందరూ హారతి చూస్తూ దండం పెట్టుకోండి మనసులో ఉన్న కోరికలు అన్ని కోరుకోండి. ఈ పెళ్లి నిర్వీగ్నంగా జరగాలని ఎవరి వల్ల ఆటంకం కలగకూడదని మనసులో ఉన్నవన్నీ కోరుకోండి అని చెప్తాడు. ఇంతలో యామిని హారతి ఇచ్చి కింద పెట్టబోతుంటే.. అమ్మా నీ పాటికి నువ్వు అలా హారతి కింద పెట్టేస్తే మా పరిస్థితి ఏంటి.? అంటాడు. దీంతో యామిని మీరు చెప్పినట్టే మూడు సార్లు హారతి ఇచ్చాను కదా శాస్త్రి గారు అంటుంది. దీంతో లేదమ్మా జరిగిన విఘ్నాలన్నీ పోవాలంటే మరో మూడు సార్లు హారతి ఇవ్వాలి అని చెప్తాడు. యామిని సరే అంటూ మళ్లీ హారతి ఇస్తుంటే ఫ్యాన్ ఆన్ అవుతుంది. హారతి ఆరిపోతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో ఇంద్రాదేవి శాస్త్రి గారు హారతి ఆరిపోయింది అంటుంది.
కనిపించిందమ్మా అంటాడు పంతులు. మరి ఏదో ఒకటి చెప్పండి అంటుంది ఇంద్రాదేవి. చెప్తానమ్మా కాస్త ఆలోచించుకునే టైం ఇవ్వండి అంటాడు. ఇంతలో అపర్ణ అక్కడేమో కర్ర విరిగిపోయింది. ఇక్కడేమో హారతి ఆరిపోయింది. ఏంటో ఇదంతా విడ్డూరంగా ఉంది అంటుంది. ఇంతలో ఇంద్రాదేవి ఏంటి ముత్తుయిదవులు ఏమీ మాట్లాడరేమీ అంటుంది. దీంతో వాళ్ల అయ్యయ్యో అపశకునం.. ఈ పెళ్లి జరగకూడదు. ఆపేయండి అంటారు. ఒకటి జరిగితే పొరపాటున జరిగింది అనుకోవచ్చు పదే పదే ఇలానే జరుగుతుంటే ఏదో దోషం ఉన్నట్టేగా అంటుంది ఇంద్రాదేవి. దీంతో వైదేహి ఏంటి పంతులు గారు ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతుంది. దీంతో పంతులు అమ్మా నా శాయశక్తులా నేను ప్రయత్నించాను. కానీ ఎన్ని చేసినా ఆ అమ్మవారికి కూడా ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదనుకుంటాను. అందుకే ఈ విఘ్నాలన్నీ జరుగుతున్నట్టు ఉన్నాయి. ఇంక ఇంతకంటే మనం ముందుకు వెళ్లడం సరికాదమ్మా ఈ పెళ్లి ఇక్కడితో ఆపేయడం వధూవరులకు ఇద్దరికీ మంచిది అంటూ చెప్పగానే..
ఏం మాట్లాడుతున్నారు శాస్త్రి గారు ఇంత దూరం వచ్చాక పెళ్లి ఆపేయడం ఏంటి..? అని వైదేహి అడుగుతుంది. దీంతో పంతులు అవునమ్మా ఇప్పుడే ఇక్కడే ఆపేస్తే వాళ్లిద్దరి ప్రాణాలకు క్షేమం. అపర్ణ గారు చెప్పింది కూడా నిజమే రామ్ గారికి యాక్సిడెంట్ అవ్వడానికి కూడా వాళ్లిద్దరి నిశ్చితార్థమే అంటాడు పంతులు. దీంతో ఇంద్రాదేవి హమ్మయ్యా అమ్మవారే ఈ పెళ్లిని ఆపేసింది ఇక నా మనవణ్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని మనసులో అనుకుంటుంది. ఇంతలో పంతులు అని అంటాను అనుకుంటున్నారా..? అమ్మా అలా ఎప్పటికీ ఈ శాస్త్రి అనడు. ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. అంటూ పంతులు ప్లేట్ ఫిరాయించడంతో అపర్ణ, ఇంద్రాదేవి, కనకం షాక్ అవుతారు. ఏం మాట్లాడతున్నారు శాస్త్రి గారు ఇప్పటి వరకు ఆపేయాలి అన్నారు అని అడుగుతుంది. దీంతో పంతులు అవునమ్మా ఆపేయాలి కానీ శాశ్వతంగా కాదు తాత్కాలికంగా మాత్రమే అని చెప్తాడు.
దీంతో యామిని ఏమంటున్నారు శాస్త్రి గారు తాత్కాలికంగా ఆపడం ఏంటి అని అడుగుతుంది. దీంతో శాస్త్రి అవునమ్మా..? మీరు జరిపించిన నిశ్చితార్థం ముహూర్తంలోనే సమస్య ఉంది. అందుకే అక్కడి నుంచే మీకు ఇటువంటి అరిష్టాలు జరుగుతున్నాయి. అందుకే నేను మంచి పరిష్కారం ఆలోచించాను అని చెప్పగానే.. ఏంటో చెప్పండి శాస్త్రి గారు అని అడుగుతుంది వైదేహి. ఏం లేదమ్మా..? వధూవరులిద్దరికీ ఈరోజు మంచి ముహూర్తం చూసి మళ్లీ నిశ్చితార్థం జరిపించి.. తర్వాత తిరిగి మళ్లీ పెళ్లికి ముహూర్తం పెడతాను.
అప్పుడు వారి పెళ్లికి ఎటువంటి ఆటంకాలు కానీ ఎటువంటి దోసాలు కానీ ఉండవు. ఆ తర్వాత ఎన్ని దుష్ట గ్రహాలు వచ్చినా ఈ పెళ్లి ఆపలేవు అని చెప్తాడు. దీంతో పంతులు తనకు యామిని వచ్చి వార్నింగ్ ఇచ్చింది పంతులు గుర్తు చేసుకుంటాడు. యామిని నవ్వుతూ అమ్మమ్మగారు మళ్లీ పెళ్లికి కొత్తగా ముహూర్తం పెడతారట. ఇంక మీ మనవడికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కాబట్టి ఇక మీకొచ్చిన అభ్యంతరం ఏమీ లేదు కదా… కళావతి గారు మీకు ఏమైనా అభ్యంతరం ఉదా..? శాస్త్రి గారు వెంటనే నిశ్చితార్ధం చేయడానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పగానే అలాగేనమ్మా ఇక ఈ పూజ ముగిసింది అని చెప్పగానే అందరూ వెళ్లిపోతారు.
తర్వాత బయటకు వెళ్లిన అపర్ణ, ఇంద్రాదేవి, కనకం ముగ్గురూ కలిసి ఎలాగైనా ఈ పెళ్లిని ఆపేయాలని ప్లాన్ చేస్తుంటారు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ యామిని మెడలో అల్లుడిగారి చేత తాళి కట్టనివ్వను.. ఈ పెళ్లి ఆపాలంటే మనకు ఇప్పుడు మనకు ఒక్కేఒక్క దారి ఉందమ్మా అంటుంది. ఏంటది అని ఇంద్రాదేవి అడిగితే అల్లుడి గారి మనసు మార్చడం అని చెప్పగానే.. అపర్ణ, ఇంద్రాదేవి నవ్వుకుంటారు.
దీంతో అల్లుడి గారి మనసు నేను మారుస్తాను. అంటూ చాలెంజ్ చేసి వెళ్లిపోతుంది కనకం. రూంలో రాజ్ ఇరిటేటింగ్ గా ఫీలవుతుంటే.. కనకం వెళ్లి రాజ్ దగ్గర ఎమోషనల్ అవుతుంది. కావ్య మీరే జీవితం అనుకుంది. మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తుంది అని చెప్తుంది. ఆ విషయం నాకు తెలుసండి అంటూ రాజ్ చెప్తాడు. దీంతో కావ్యను పెళ్లి చేసుకునే అవకాశం వస్తే చేసుకుంటారా..? అని అడుగుతుంది కనకం. దీంతో అలాంటి అవకాశం లేదండి అంటూ బాధపడతాడు రాజ్. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?