Tirumala News: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీహరి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఏడు కొండలపై వేంకటేశ్వరుడు వెలసిన క్షేత్రం కావడంతో ఆ ప్రాంతాన్ని దైవ సన్నిధిగా భావిస్తున్నారు భక్తులు. అక్కడ ఏ చిన్న తప్పు జరిగినా, భక్తులు మండిపడుతుంటారు.
అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్నారన్న వార్తలు హంగామా చేయడంపై టీటీడీ సీరియస్ అయ్యింది. తిరుమలలో అపచారం జరిగిందంటూ ఓ వీడియో సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ‘‘తిరుమలలో మరొక అపచారం.. వదలని మందు బాబులు!, శ్రీవారి సన్నిధిలో మద్యం తాగుతున్న మందు బాబులు. మందు తాగేసి బాటిల్స్‌ను మెట్లపై విసురుతున్న మందుబాబులు.
కూటమి ప్రభుత్వంలో రోజురోజుకు దిగజారుతున్న తిరుమల ప్రతిష్ట’’ అంటూ పోస్టు చేశారు. మద్యం తాగిన ఓ వ్యక్తి ఖాళీ మందు బాటిల్‌ను మెట్లపైకి విసిరేస్తున్నారని ఆ వీడియోలో కనిపించింది. ఈ వ్యవహారం టీటీడీ దృష్టికి వెళ్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం రియాక్ట్ అయ్యింది. దీనిపై ఎక్స్ వేదికగా అసలు విషయాలు బయటపెట్టింది.
శ్రీవారి సన్నిధిలో మద్యం సేవించారని చెప్పే వీడియో అబద్ధం, తప్పుదారి పట్టించేదిగా ఉందని తెలిపింది. ఆ వీడియోలోని ప్రదేశం తిరుమల ప్రాంగణంలో లేదని పేర్కొంది. తిరుమల పవిత్రతను కించపరిచే ఇటువంటి ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాసుకొచ్చింది.
ALSO READ: ఇంటిగుట్టు బయటకు.. కూతురిపై ముద్రగడ విసుర్లు, పబ్లిసిటీ కోసం దిగజారొద్దు
సదరు తాగుబోతు వ్యక్తి ఫోటోను బయటపెట్టింది. పైన పేర్కొన్న వార్త తప్పని చెబుతూనే, మందుబాబు ఉన్న ప్రాంతం తిరుమల పరిధిలోకి రాదని పేర్కొంది. తప్పుడు వార్తలను ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీనికి సంబంధించిన వ్యక్తులపై రేపో మాపో చర్యలు తీసుకోనుంది.
టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు పగ్గాలు చేపట్టిన నుంచి తప్పుడు వార్తలు ప్రచారం చేసినవారిపై చర్యలు ఉంటాయని పదేపదే చెబుతున్నారు. ఆయన చెప్పినట్టుగానే తప్పుడు ప్రచారం చేసినవారిపై ఉక్కుపాదం మోపనుంది టీడీడీ.
🚫 Fact Check:
A video claiming alcohol consumption in Srivari Sannidhi is false & misleading.📍The spot in the video is not inside Tirumala premises.
Such attempts to defame Tirumala’s sanctity are strongly condemned.#TTD #FactCheck #FakeNewsAlert #Tirumala pic.twitter.com/ldBrrYhdwN— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) June 9, 2025