Fast Hair Growth Oil: పొడవాటి జుట్టు కావాలని ఏ అమ్మాయి కోరుకోదు చెప్పండి. తమ జుట్టు చాలా అందంగా, పొడవుగా పెరగాలని ఉంటుంది. కానీ ప్రస్తుత రోజుల్లో జుట్టు పొడవుగా ఉండటం ప్రతిఒక్కరికి కలగానే మిగిలిపోతుంది. ఎంత ప్రయత్నంచిన, ఎన్ని రకాల హెయిర్ ఆయిల్స్, షాంపూలు ట్రై చేసిన జుట్టు రాలడం మాత్రం ఆగట్లేదు.
ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో.. జుట్టుకూడా అంతే ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మనం రోజువారి డైట్‌లో ఖచ్చితంగా పండ్లు, ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవాల్సిందే. అలాగే ఒత్తిడిని వీలైనంతవరకు తగ్గించాలి. బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా స్కార్ఫ్ అలాంటివి ఉపయోగించాలి. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కొన్ని కొన్ని సార్లు అవేమి పనిచేయవు. దువ్వుకున్నప్పుడు, తలస్నానం చేసినప్పుడు జుట్టురాలి పోతుంటుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే.. ఈ హెయిర్ ఆయిల్ ఒకసారి ట్రై చేయండి. అద్భుతమైన రిజల్ట్ మీకు కనిపిస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె
మందారం పువ్వులు
మెంతులు
రోజ్‌మెరీ ఆకులు
వెల్లుల్లి పాయలు
ఉల్లిపాయ
బ్లాక్ సీడ్స్
తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని.. అందులో కావాల్సినంత ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె, మందారం పువ్వులు, మెంతులు, రోజ్‌మెరీ ఆకులు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, బ్లాక్ సీడ్స్ పావు కప్పు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరిగించండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి.. కాసేపు చల్లారనిచ్చి.. గాజుసీసాలో వడకట్టుకోండి. ఈ హెయిర్ ఆయిల్‌ను ప్రతిరోజు జుట్టు కుదుళ్లకు 10 నిమిషాల పాటు మర్ధనా చేయండి. అప్పుడే అందులోని పోషకాలు జుట్టుకు అందుతాయి. ఆ తర్వాత తలస్నానం చేయొచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మంచి ఫలితం ఉంటుంది.
రైస్ వాటర్‌లో వీటిని కలిపి హెయిర్‌కి అప్లై చేయండి. జుట్టు పొడవుగా, సిల్కీగా పెరుగుతుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
రైస్ వాటర్
మెంతులు
విటమిన్ ఇ క్యాప్యూల్స్
బాదం నూనె
ఉల్లిపాయ
తయారు చేసుకునే విధానం
ముందుగా రైస్ వాటర్‌లో మెంతులను నానబెట్టాలి. వాటిని వడకట్టుకొని అందులో విటమిన్ సి క్యాప్యూల్స్, బాదం నూనె, ఉల్లిపాయ రసం కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి అరగంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. జుట్టు పొడవుగా, ఒత్తుగా, సిల్కీగా పెరుగుతుంది. ఇందులో ఉపయోగించే పదార్ధాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
Also Read: కరివేపాకుతో ఈ హెయిర్ ఆయిల్ ట్రై చేయండి.. పొడవాటి జుట్టు మీ సొంతం
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.