East Godavari: చాన్నాళ్లు తర్వాత మీడియా ముందుకొచ్చారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. ఈసారి పార్టీ వ్యవహారాలపై ఆయన నోరు ఎత్త లేదు. కేవలం ఫ్యామిలీకి సంబంధించిన విషయాలపై చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పారు. తన కూతురు క్రాంతి కామెంట్స్ పై తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు ముద్రగడ.
తన ఆరోగ్య సమస్యలపై రకరకాల వార్తలు రావడంతోపై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం రియాక్ట్ అయ్యారు. మా కుటుంబంపై మరొక ఫ్యామిలీ దాడి చేస్తుందన్నారు. మా రెండు కుటుంబాల మధ్య చాలా ఏళ్ల కిందటే మనస్పర్ధలు వచ్చాయన్నారు. చిన్నకొడుకు గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో రగిలి పోతున్నారని కూతురు పేరు ఎత్తకుండా వ్యాఖ్యానించారు.
ఇప్పటికీ తాను ఆరోగ్యంగా ఉన్నానంటే అందుకు కారణం గిరిబాబు అని చెప్పకనే చెప్పారు. అబ్బాయిని దూరం చేసుకుని వారి ఇంటికి చేరుతానని అనుకుంటున్నారని గుర్తు చేశారు. అది ఈ జన్మలో జరగదని కూతురికి మీడియా ముఖంగా తేల్చి చెప్పారు. వారి మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. వయస్సు రీత్యా ఆరోగ్య సమస్యలు తప్ప వేరే సమస్యలు లేవన్నారు.
తనను బంధించి, మానసికంగా హింసించడం ఎవరితరం కాదని చెప్పకనే చెప్పారు. మీ అపాయింట్మెంట్లు చీప్ పబ్లిసిటీ కోసం దిగజార వద్దని కాసింత రుసరుసలాడారు. వైసీపీ కార్యక్రమాలకు తాను హాజరవు తున్నానని, ఇంటికి వచ్చిన అభిమానులు, ప్రజలను కలుస్తున్నట్లు వెల్లడించారు. దమ్ముంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయించి డబ్బా కొట్టుకోవాలంటూ తనదైన శైలిలో సూచించారు ముద్రగడ.
ALSO READ: సాక్షిఛానెల్ విశ్లేషకుడు కొమ్మినేని అరెస్ట్
ఇంతకీ ముద్రగడ కూతురు క్రాంతి ఇటీవల ఏయే విషయాలు వెల్లడించింది. తన తండ్రి ముద్రగడకు క్యాన్సర్ వచ్చిందని సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించింది. కొడుకు గిరి తంద్రికి ట్రీట్ మెంట్ అందించలేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన కుమార్తె క్రాంతి ప్రస్తావించిన అంశాలపై ముద్రగడ బహిరంగ లేఖ విడుదల చేశారు.
ముద్రగడ పద్మనాభం-కూతురు క్రాంతి మధ్య కుటుంబాల మధ్య విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బయటపడింది. తండ్రి-కూతుళ్ల అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఆ సమయంలో క్రాంతి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం కావడం, ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడం చకచకా జరిగిపోయింది.
ఆ సమయంలో ముద్రగడపై విరుచుకుపడ్డారు. కూతురు కామెంట్లపై ముద్రగడ కూటమిపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో జరుగుతున్న వ్యవహారాలు బయటకువచ్చాయి. రానున్న రోజుల్లో తండ్రి-కూతురు మధ్య అంతర్గత వ్యవహారాలు ఇంకెన్ని మలుపులు తిరగనున్నాయో చూడాలి.
ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ
కూతురు క్రాంతి పోస్టుపై స్పందిస్తూ లేఖ విడుదల చేసిన ముద్రగడ
చిన్నబ్బాయి గిరిబాబు ఎదుగుదల చూడలేక రగిలిపోతున్నారంటూ వ్యాఖ్యలు pic.twitter.com/P52uHvJyVv
— BIG TV Breaking News (@bigtvtelugu) June 9, 2025