BigTV English

Weather Update : తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. రెండ్రోజులు వర్షాలు

Weather Update : తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. రెండ్రోజులు వర్షాలు
rains alert for telugu states
rains alert for telugu states

Weather Update for Telugu States : ప్రతి ఏటా మాదిరి.. ఈ ఏడాది కూడా ఎండాకాలం ఆరంభం కాకుండానే.. ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే.. ఉక్కపోత మొదలవుతోంది. ఇక పూర్తిగా వేసవి వస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే ప్రజలు జంకుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఉక్కపోత భరించలేక ఇప్పటి నుంచే ఏసీలను వాడేస్తున్నారు. ఉక్కపోతతో విలవిల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ కూల్ న్యూస్ చెప్పింది. రెండురోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.


Read More : వైసీపీకి భారీ షాక్.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా

ఉత్తర చత్తీస్ గఢ్ పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. అలాగే సౌత్ తెలంగాణ, పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రస్తుతం సౌత్ తెలంగాణ పరిసరాల మీదుగా ఉపరితల ఆవర్తనం.. దక్షిణ తమిళనాడు వరకూ రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని, దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.


మూడు రోజులుగా తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఖమ్మం, నల్గొండ మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ స్థాయిలోనే ఉష్ణోగ్రతలున్నా ఉక్కపోత మాత్రం క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి.

 

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×