BigTV English
Advertisement

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

ఎమ్మెల్సీగా తొలిసారి శాసన మండలి సమావేశాలకు హాజరవుతున్న నాగబాబు, ఈరోజు తన గళం వినిపించారు. శాసన మండలిలో మొదటిసారి ఆయన ప్రసంగించారు. న్యాయ వ్యవస్థ, అందులోని లోటుపాట్లను కౌన్సిల్ లో ప్రస్తావించారు నాగబాబు. న్యాయవాదిని నియ‌మించుకునే స్థోమత లేక ఆరేళ్ల పాటు జైల్లో మ‌గ్గిపోయిన ఓ వ్య‌క్తి గురించి నాగ‌బాబు మండ‌లిలో ప్ర‌స్తావించ‌డం విశేషం. అదే సమయంలో ఆయన అడిగిన ప్రశ్నకు మంత్రి వంగలపూడి అనిత సమాధానమిచ్చారు.


నాగబాబు ప్రసంగం..
భార‌త‌దేశంలోని మొత్తం కోర్టుల్లో 3.30 కోట్ల కేసులు ఏపీలో ల‌క్ష‌కు పైగా కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మండలిలో ప్రస్తావించారు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు. వీటిలో 75 శాతానికి పైగా కేసులు మూడేళ్లుగా కిందిస్థాయిలో కోర్టుల్లో కొనసాగుతున్నాయ‌ని చెప్పారు. గుంటూరు జిల్లాలో ఒక రోజు కూలీ దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యి ఆరేళ్లుగా జైలులోనే ఉన్న సంఘటనను ఆయన సభలో ప్రస్తావించారు. అతడికి లాయర్ ని పెట్టుకునే స్థోమత కూడా లేదని, చివరకు అత‌ను ఏ త‌ప్పూ చేయ‌లేద‌ని న్యాయ‌స్థానం తీర్పునివ్వడం విశేషం అని చెప్పుకొచ్చారు. అలాంటి వారికి న‌ష్ట‌ప‌రిహారం ఎలా చెల్లించాలో ఆలోచించాల‌ని చెప్పారు.

రాజకీయ కక్షతో..
రాష్ట్రంలో రాజ‌కీయ క‌క్ష‌ల‌తో కేసులు పెడుతున్నారని శాసన మండలి దృష్టికి తీసుకొచ్చారు నాగబాబు. అధికారంలో ఉన్నవారు న్యాయవ్యవస్థను తమకు అనుకూలంగా వాడుకుంటే.. నిర్దోషుల‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌ని అన్నారు. ఇలాంటి కేసుల వల్ల యువత ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు దూరమవుతున్నారని, విదేశాలకు వెళ్లేందుకు పాస్ పోర్ట్ మంజూరులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. తప్పుడు కేసుల విషయంలో ప్రభుత్వాలు రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడకూడదని సలహా ఇచ్చారు. న్యాయవ్యవస్థలో “జ్యుడీషియల్ వెకెన్సీస్” భర్తీ, “ఫాస్ట్ ట్రాక్ మెకానిజం”పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఆయన సభలో ప్రస్తావించారు. 2019-24 మధ్య కాలంలో తప్పుడు క్రిమినల్ కేసులు పెట్టి చాలామందిని వేధించారని, వాటి పరిష్కారం ఎంతవరకు వచ్చిందని నాగబాబు మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మంత్రి అనిత సమాధానం..
నాగబాబు ప్రశ్నకు హోం మంత్రి అనిత సమాధానమిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాద్యాయులు, అంగన్వాడీలు, ఆశావర్కర్లపై తప్పుడు కేసులు పెట్టిందని ఆమె చెప్పారు. అమరావతి రైతులపై కూడా రాజకీయ కక్షసాధింపు కోసమే కేసులు పెట్టారని వివరించారు. ఆ కేసులను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. పోలీస్ డిపార్ట్ మెంట్, న్యాయశాఖను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం ఈ కేసుల పరిష్కారానికి ప్రయత్నిస్తోందన్నారు మంత్రి. గత ప్రభుత్వ హయాంలో సీపీఎస్ రద్దు కోరుతూ టీచర్లు ఆందోళనకు దిగితే 149 కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 80 శాతం కేసులను ఎత్తివేశామని, మిగతా కేసుల్ని కూడా త్వరలోనే తొలగిస్తామని చెప్పారు మంత్రి అనిత. గత ప్రభుత్వం తనపై కూడా కేసు పెట్టిందని ఆమె గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే కడప కోర్టుకు తాను హాజరయ్యానన్నారు.

చీకటి జీవోలు తెచ్చే సంస్కృతి కూటమి ప్రభుత్వానికి లేదని మంత్రి అనిత స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పెట్టిన తప్పుడు కేసుల్ని త్వరితగతిన పరిష్కరిస్తామని, త్వరలోనే ఆ కేసుల్ని తొలగిస్తామని అన్నారు.

Related News

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

Big Stories

×