BigTV English

Mahesh Babu: మహేశ్ బాబు 5 సెకన్ల వాయిస్.. సెకన్‌కు కోటి రూపాయల పారితోషికం..!

Mahesh Babu: మహేశ్ బాబు 5 సెకన్ల వాయిస్.. సెకన్‌కు కోటి రూపాయల పారితోషికం..!


Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా దూసుకుపోతున్నాడు. కూల్ డ్రింగ్, మొబైల్ ఫోన్స్ ఇలా ఎన్నో రకాల కంపెనీలకు యాడ్స్, ప్రమోషన్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు.

అయితే తాజాగా మరో కంపెనీతో భాగస్వామ్యం అయ్యాడు మహేశ్ బాబు. ఇందులో భాంగంగా ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ ట్రాన్సక్షన్ యాప్ ఫోన్ పే‌కు తన వాయిస్‌ను అందించాడు. దీనికి సంబంధించిన వీడియోను సైతం ఫోన్‌పే రిలీజ్ చేయగా.. అందరినీ ఆకట్టుకుంటుంది.


కాగా కేవలం 5 సెకన్లను మాత్రమే మహేశ్ వాయిస్ వస్తుంది. కానీ ఈ 5 సెకన్ల వాయిస్ కోసం మహేశ్ బాబు ఎవరూ ఊహించని పారితోషికం తీసుకున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసి అంతా షాక్ అవుతున్నారు. మరి మహేశ్ తన వాయిస్ కోసం ఎంత తీసుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

READ MORE: ఇకపై ప్రతి షాప్‌లో మహేశ్ బాబు వాయిస్.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్!

ఓ వీడియోలో మహేశ్ బాబు ‘‘ఇప్పుడు 50 రూపాయలు ఫోన్ పే ద్వారా వచ్చాయి. హ్యాట్సాఫ్ గురుగారు. ఫోన్ పే స్మార్ట్‌స్పీకర్లో నా వాయిస్ వింటారు’’ అంటూ మాట్లాడాడు. అయితే ఈ 5 సెకన్ల వాయిస్ కోసం మహేశ్ బాబుకు ఫోన్ పే సంస్థ ఏకంగా రూ.5 కోట్ల పారితోషికం చెల్లించినట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సెకన్‌కు కోటి రూపాయలు తీసుకున్నాడా? అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఇక సూపర్ స్టార్ క్రేజ్ ఆ మాత్రం ఉంటుందని మహేశ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే ఇలా వచ్చిన డబ్బును మహేశ్ బాబు.. పేద పిల్లల గుండె ఆపరేషన్లకు ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా స్వచ్ఛంద సేవాసంస్థల కూడా కొంత మొత్తాన్ని చెల్లించి తన మంచి మనసు చాటుకుంటున్నాడు.

READ MORE: మహేశ్ బాబు – రాజమౌళి మూవీ.. బడ్జెట్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేశ్ బాబు.. మిక్స్‌డ్ టాక్ అందుకున్నాడు. అయినా కలెక్షన్ల పరంగా దూకుడు చూపించాడు. ఇక ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళితో ఓ మూవీ చేస్తున్నాడు. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×