Car Accident: చిత్తూరు జిల్లో రోడ్లు రక్తమోడుతున్నాయి. శుక్రవారం ఘోరమైన ప్రమాదం జరగ్గా, తాజాగా శనివారం మరో దారుణమైన ప్రమాదం చోటు చేసుకుంది. బెంగుళూరు-చెన్నై హైవే మీదుగా వేగంగా వెళ్తున్న కారు టైరు పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు స్పాట్ లో మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
శనివారం ఉదయం బెంగుళూరు నుంచి తిరుపతి ఏడుగురు సభ్యులతో కూడిన ఫ్యామిలీ తిరుపతికి వస్తోంది. హైవే రోడ్డు కావడంతో ఇన్నోవా కారు స్పీడ్‌గా వెళ్తోంది. అయితే చిత్తూరు జిల్లా బంగారుపాలెం సమీపంలోకి రాగానే కారు టైరు పేలిపోయింది. కారు స్పీడ్‌ను డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు.
కారు ఏడు పల్టీలు కొట్టింది. చివరకు బ్రిడ్జి పక్కనేవున్న డివైడర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదం సమయంలో కారులో ఏడుగురు వున్నారు. వారంతా ఒకే ఫ్యామిలీకి చెందినవారుగా తెలుస్తోంది. సేఫ్టీ బెలూన్లు తెరుచుకున్నప్పటికీ ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ALSO READ: సీతారాం ఏచూరి పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నివాళులు.. సిద్ధాంతాలకు కట్టుబడే వ్యక్తి
వేగానికి కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదం గురించి ఆరా తీస్తున్నారు. వీరంతా ఎక్కడ నుంచి వస్తున్నారు? ఎటు వెళ్తున్నారు? అనేదానిపై సమాచారం సేకరిస్తున్నారు.
చిత్తూరు లో ఘోర రోడ్డు ప్రమాదం.7 పల్టీలు కొట్టిన కారు
బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతున్న ఇన్నోవా కారు టైరు పేలడంతో పల్టీలు కొట్టింది. అరగొండకు వెళ్లే రహదారి ఓవర్ బ్రిడ్జిపైన జరిగిన ఘటనలో కారులో ఏడుగురితో పాటు ఒక పాప కూడా ఉన్నట్లు సమాచారం. pic.twitter.com/lQ5RMiWSoX
— BIG TV Breaking News (@bigtvtelugu) September 14, 2024